సింథటిక్ రేడియో ఐసోటోపు

(Synthetic radioisotope నుండి దారిమార్పు చెందింది)

సింథటిక్ రేడియో ఐసోటోప్ అనేది రేడియో న్యూక్లైడ్. ఇది ప్రకృతిలో కనిపించదు: దానిని ఉత్పత్తి చేసేందుకు సహజమైన ప్రక్రియ గానీ, యంత్రాంగం గానీ ఉనికిలో లేదు లేదా ఇది చాలా అస్థిరంగా ఉండడం వలన అది చాలా తక్కువ వ్యవధిలో క్షయం చెందుతుంది. ఉదాహరణలు టెక్నీషియం -95, ప్రోమేథియం -146. వీటిలో చాలా వరకు అణు ఇంధన తయారీల్లో కనుగొన్నవే, వాటి నుండి సేకరించబడ్డవే. కొన్నిటిని తప్పనిసరిగా పార్టికల్ యాక్సిలరేటర్ల లోనే తయారు చేయాలి. 

ఉత్పత్తి

మార్చు

కొన్ని సింథటిక్ రేడియో ఐసోటోప్‌లను, వాడేసిన న్యూక్లియర్ రియాక్టర్ ఇంధన కడ్డీల నుండి సంగ్రహిస్తారు. వీటిలో వివిధ విచ్ఛిత్తి ఉత్పత్తులు ఉంటాయి. ఉదాహరణకు, 1994 వరకు, దాదాపు 49,000 టెరాబెక్వెరెల్స్ (78 మెట్రిక్ టన్నుల) టెక్నీషియంను అణు రియాక్టర్లలో ఉత్పత్తి అయిందని అంచనా వేసారు. భూమిపై టెక్నీషియంకు ఇదే ప్రధాన వనరు. [1]

కొన్ని సింథటిక్ ఐసోటోప్‌లు కేంద్రక విచ్ఛిత్తి ద్వారా గణనీయమైన పరిమాణంలో ఉత్పత్తి అవుతాయి గానీ వాటిని సేకరించలేరు. ఇతర ఐసోటోప్‌లు న్యూక్లియర్ రియాక్టర్‌లోని మాతృ ఐసోటోపులు న్యూట్రాన్ రేడియేషన్ చెందినపుడు తయారవుతాయి (ఉదాహరణకు, Tc-97 ను Ru-96 యొక్క న్యూట్రాన్ రేడియేషన్ ద్వారా తయారు చేయవచ్చు) లేదా పార్టికల్ యాక్సిలరేటరులో అధిక శక్తి కణాలతో పేరెంట్ ఐసోటోప్‌లను గుద్దడం ద్వారా తయారు చేస్తారు. [2]

అనేక ఐసోటోప్‌లు సైక్లోట్రాన్‌లలో ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు ఫ్లోరిన్-18, ఆక్సిజన్-15 ఇవి పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీకి విస్తృతంగా ఉపయోగపడతాయి. [3]

ఉపయోగాలు

మార్చు

చాలా సింథటిక్ రేడియో ఐసోటోప్‌లు తక్కువ అర్ధ-జీవితాన్ని కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి ప్రమాదం అయినప్పటికీ, రేడియోధార్మిక పదార్థాలకు అనేక వైద్య, పారిశ్రామిక ఉపయోగాలు ఉన్నాయి.

న్యూక్లియర్ మెడిసిన్

మార్చు

న్యూక్లియర్ మెడిసిన్ రంగంలో రోగ నిర్ధారణకు, చికిత్సకూ రేడియో ఐసోటోప్‌లను వినియోగిస్తారు

పారిశ్రామిక రేడియేషన్ వనరులు

మార్చు

ఆల్ఫా పార్టికల్, బీటా పార్టికల్, గామా రే రేడియోధార్మిక ఉద్గారాలు పారిశ్రామికంగా ఉపయోగపడతాయి. వీటిలో చాలావాటికి సింథటిక్ రేడియో ఐసోటోప్‌లే వనరులు. పెట్రోలియం పరిశ్రమ, ఇండస్ట్రియల్ రేడియోగ్రఫీ, హోంల్యాండ్ సెక్యూరిటీ, ప్రాసెస్ కంట్రోల్, ఫుడ్ రేడియేషన్, అండర్‌గ్రౌండ్ డిటెక్షన్ వంటి రంగాల్లో వీటిని ఉపయోగిస్తారు. [4] [5] [6]

మూలాలు

మార్చు
  1. Yoshihara, K (1996). "Technetium in the environment". In Yoshihara, K; Omori, T (eds.). Technetium and Rhenium Their Chemistry and Its Applications. Topics in Current Chemistry. Vol. 176. Springer. doi:10.1007/3-540-59469-8_2. ISBN 978-3-540-59469-7.
  2. "Radioisotope Production". Brookhaven National Laboratory. 2009. Archived from the original on 6 January 2010.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Cyclotron Produced Radionuclides: Physical Characteristics and Production Methods. Vienna: IAEA. 2009. ISBN 978-92-0-106908-5.
  4. Greenblatt, Jack A. (2009). "Stable and Radioactive Isotopes: Industry & Trade Summary" (PDF). Office of Industries. United States International Trade Commission. Archived (PDF) from the original on 2022-10-09.
  5. (August 2005). "The US national isotope program: Current status and strategy for future success". Archived 2018-03-05 at the Wayback Machine "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-03-05. Retrieved 2022-10-28.
  6. Branch, Doug (2012). "Radioactive Isotopes in Process Measurement" (PDF). VEGA Controls. Archived (PDF) from the original on 2022-10-09. Retrieved 4 March 2018.