ఎగిరే పళ్ళాలు
ఎగిరే పళ్ళాలు లేదా UFO (unidentified flying object) అనునవి ఒక గుర్తింపబడని వాహనాలు. ఇవి సాధారణంగా గ్రహాంతర వాసుల వాహనాలని ప్రజలు నమ్ముతారు.ఇతర గ్రహాల నుంచి ఎగిరే పళ్లాలు కనిపించినట్లు దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఏదీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు.
వివరాలు
మార్చుఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలో కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని,వారు మనకన్నా చాలా తెలివైనవారని,వారే గ్రహాంతర వాసులు (Alien's) అంటూ ఉంటారు.వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం.
సంకేతాలు
మార్చు1977లో తొలిసారి వాయేజర్ ఉపగ్రహం ద్వారా గ్రహాంతర వాసులను ఉద్దేశించి మనిషి ఒక సందేశం పంపాడు. బంగారు రేకులపై మనిషి రూపురేఖలను, భూమి స్థానాన్ని సూచించే గుర్తులు, కొన్ని శబ్దాలను పొందుపరిచి పంపిన ఈ సందేశంపై ఇప్పటివరకూ ప్రత్యుత్తరం లేదు. అలాగే సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరస్టియల్ లైఫ్ (సెటీ) భూమ్మీద ఉన్న అత్యంత భారీ రేడియో టెలిస్కోపుల సాయంతో సుదూర గ్రహాలకు సంకేతాలు పంపుతూనే ఉంది. గ్రహాంతర వాసులెవరైనా ఉంటే ఈ సంకేతాలు అందుకుని స్పందించకపోతారా? అన్న అశతో జరుగుతున్న ఈ ప్రయత్నం ఇప్పటివరకూ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు.[1]
1977 ఆగస్టు 15న అందిన ఒక్క సందేశం మాత్రం గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని పెంచేలా చేసింది. ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ టెలిస్కోపు ద్వారా అందిన ఈ సంకేతాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్త అదే కాగితంపై ‘వావ్’ అని రాశాడంటే అదెంత ఆసక్తికరమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంకేతాన్ని మరోసారి పొందేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక 1974లో కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు పూర్టరికోలోని ఆర్సిబో వేధశాల నుంచి 210 బైట్ల సైజున్న ఓ సందేశాన్ని ఎం13 నక్షత్ర మండలంవైపు పంపించారు. మానవుల, కీలకమైన రసాయన అణువుల, డీఎన్‌ఏ రసాయన నిర్మాణం వంటి వివరాలతో కూడిన ఈ సందేశం వన్‌వే ట్రాఫిక్ మాదిరిగానే మిగిలిపోయింది.[2]
ప్రభుత్వాల పరిశోధన
మార్చుఅమెరికా
మార్చుఎగిరే పళ్లాలు (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్) ఉన్న మాట నిజమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇటీవల వర్జీనియా కోస్ట్ లో రెండేళ్లుగా రోజూ తాము వీటిని చూసేవారమని అమెరికా నేవీ సిబ్బంది చెప్పిన మాటలు వాస్తవమేనని, వీటిని మనం సీరియస్ గా తీసుకోవాలని, సులువుగా కొట్టివేయలేమని ఆయన చెప్పారు. ఇవి ఎలా వేగంగా కదిలివెళ్తాయో, వాటి ట్రాజెక్టరీ ఏమిటో ఇప్పటికిప్పుడు చెప్పలేమని, ఇంకా రీసెర్చ్ జరుగుతోందని అన్నారు. అమెరికా లేట్ లేట్ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. 2008 లో తాను దేశాధ్యక్షపదవిని చేపట్టాక వీటి రహస్యాలఫై ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకోదలిచానని అన్నారు. ఇందుకు ఆసక్తి చూపానన్నారు. అలాగే ఏలియన్ స్పెసిమెన్స్, వాటి స్పేస్ షిప్స్ శాంపిల్స్ ని ల్యాబ్ లో ఎక్కడ ఉంచారో కనుగొనాలని కూడా ఇంట్రెస్ట్ చూపానని ఆయన తెలిపారు. అమెరికా మిలిటరీ టార్గెట్లను ఎగిరే పళ్ళాలు మాటిమాటికీ వేధిస్తున్న దృశ్యం తాలూకు ఫుటేజీని నేను చూశానని, ఇది ఈ మధ్యే వైరల్ అయిందని ఆయన చెప్పారు. కానీ ఇవి కచ్చితంగా ఏమిటన్నవి ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఇప్పటికీ వీటిపై పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఒబామా చెప్పారు.
2019 జూలైలో శాన్ డీగో సమీపాన నీటిలోకి దూసుకువస్తున్న యూఎఫ్ఓను అమెరికా నిఘా నౌక గుర్తించింది. 2021 మే నెలలో ఈ వీడియోను పెంటగాన్ రిలీజ్ చేసింది. 2015-17 మధ్యకాలంలోకూడా వర్జీనియా కోస్టులో ఓ మాజీ నేవీ అధికారి ర్యాన్ గ్రేవ్స్ తన సహచరులు వీటిని చూసేవారని, కానీ వాటి ఆరాను తెలుసుకోలేకపోయారని చెప్పారు. లీకయిన కొత్త ఫుటేజీని మళ్ళీ పెంటగాన్ విడుదల చేసింది.[3]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ https://voyager.jpl.nasa.gov/golden-record/
- ↑ Wood, Lisa (July 3, 2010). "WOW!". Ohio History Connection Collections Blog. Archived from the original on 2021-03-08. Retrieved 2016-07-02.
- ↑ https://www.dnaindia.com/science/report-former-us-president-barack-obama-confirms-presence-of-ufos-aliens-makes-shocking-revelations-2891306
Find more about UFO at Wikipedia's sister projects | |
Definitions and translations from Wiktionary | |
Media from Commons | |
Quotations from Wikiquote | |
Source texts from Wikisource | |
Textbooks from Wikibooks | |
Travel guide from Wikivoyage | |
Learning resources from Wikiversity |
- "Government Reports on UFOs" from the Government Information Library at the University of Colorado Boulder
- "CIA's Role in the Study of UFOs, 1947–90" Archived 2019-10-01 at the Wayback Machine by Gerald K. Haines, Central Intelligence Agency
- "UFOs: Fact or Fiction?" Archived 2020-11-28 at the Wayback Machine Declassified CIA documents from the 1940s through the early 1990s.
- "UFO Reports in the UK" from 1997 to 2009 by the Ministry of Defence
- "Newly released UFO files from the UK government" at The National Archives
- "Canada's UFOs: The Search for the Unknown", a virtual museum exhibition by the Library and Archives Canada
- Declassified files on UFOs from many countries
- Declassified video—Chilean UAP event of November 11, 2014 (official Archived 2018-10-10 at the Wayback Machine; video (9:59))
- An astrophysicist's view of UFOs (Adam Frank; NYT; 30 May 2021)
- A list of skeptical resources (astronomer Andrew Fraknoi)
- UFO Explanations (videos; scientist Mick West)==బయటి లంకెలు==