అంకమ్మ తెలుగు పల్లెల్లో పూజలందుకునే ఒక గ్రామదేవత. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలలో అంకమ్మ దేవతను కొలుస్తారు. ఇతర జిల్లాలలో ఈమె ఆరాధన అంతగా కనిపించదు. [1]

కందుకూరులోని అంకమ్మ తల్లి దేవాలయం

అంకమ్మ గుడిసవరించు

అంకమ్మ గుడి సాధారణంగా ఊరి చివరన ఉంటుంది. ఈ గుడి పూరికొట్టం లేదా పెంకులతో వేసిన కొట్టంలో ఉంటుంది. అంకమ్మ విగ్రహం చాలా చోట్ల రాతిలో చెక్కబడి ఉంటుంది, కొన్ని చోట్ల అంకమ్మ విగ్రహం చెక్కలో చెక్కబడి ఉంటుంది.

నమ్మకాలుసవరించు

అంకమ్మ చాలా శక్తివంతమైన దేవత అని జనాలు నమ్ముతారు. ఈమెకు కోపం వస్తే పశుసంపదకు వ్యాధులు వస్తాయని, పంటలు సరిగ్గా పండవని, వానలు పడవని జనం నమ్ముతారు. ఈమె ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉండేందుకు ప్రజలు ఆషాఢ మాసంలో అంకమ్మ కొలువు తీరుస్తారు. ఈ కొలువులను వారం రోజులపాటు, రజక వృత్తిలో ఉన్నవారు పూజారులుగా పూజలు చేస్తారు. అంకమ్మ కథలను చెప్పటానికి బైండ్లవాళ్ళు, ఆసాది వాళ్ళు పాల్గొంటారు. ఆదివారం ఈమెకు చాలా ప్రీతి అని జనం నమ్ముతారు. ఈ కొలువులో జంతుబలులు, సిడివేలడాలు ఉంటాయి.

మూలాలుసవరించు

  1. పులికొండ, సుబ్బాచారి. అంకమ్మ (తె.). కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయం. p. ౧. |access-date= requires |url= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=అంకమ్మ&oldid=3262080" నుండి వెలికితీశారు