అంగారపర్ణుడు

(అంగార పర్ణుడు నుండి దారిమార్పు చెందింది)

అంగారపర్ణుడు కుబేరుని మిత్రుడైన ఓ గంధర్వుడు.

భావము

మార్చు

అంగారపర్ణుడు అనగా దేద్దిప్యమానంగా వెలుగు వాహనము.

భారత కథల్లో అంగారపర్ణుడు

మార్చు
 
అర్జునుడు

అంగారపర్ణుడు ద్రుపద నగరానికి వెళుతున్న పాండవుల పాదముల చప్పుడు విని "ఎవరు మీరు? ఈ అర్ధ రాత్రి ఈ అడవిలో తిరుగుతున్నారు? ఈ అడవి, గంగానది అంగారపర్ణుడదని తెలియదా" అని కేకలు వేసెను. ఈ నదిలో ఎవరు స్నానము చేస్తారో వారిది కానీ, నీది ఎలా అవుతుంది? నీవు వద్దంటే ఈ అడవిలో ప్రవేశించకూడదా? అని అర్జునుడు సమాధానమిచ్చాడు. అప్పుడు అంగారపర్ణుడు అర్జునుడి పై బాణాలతో దాడి ప్రారంభించాడు. వారిద్దరికి జరిగిన యుద్ధములో అర్జునుడు అతనిని ఓడించి జుత్తు పట్టుకుని యీడ్చుకుంటూ ధర్మరాజు దగ్గరకు తెచ్చి పడేసాడు. అప్పుడు అతని భార్య నాకు పతి దానమిమ్మని ధర్మరాజుని వేడుకున్నది. అపుడు ధర్మరాజు జాలిపడి అతనిని వదిలి వేసాడు. అర్జునుడి బల పరాక్రమాలు మెచ్చుకుని అంగారపర్ణుడు అతనికి "జాక్షుషి" అన్న గంధర్వ విద్య నేర్పి కొన్ని గంధర్వ అశ్వాలను కూడా ఇస్తాడు. ఇందుకు ప్రతిగా, అర్జునుడు, తన గురువు ద్రోణాచార్యుడు తనకు నేర్పిన ఆగ్నేయాస్త్రము ప్రయోగమును అంగారపర్ణుడికి నేర్పిస్తాడు. పోరాటము జరిగిన సందర్భమున అర్జునుని బాణాగ్నిచే ఈతని రథము దగ్దమైనందున గంధర్వ శక్తిచే అంగారపర్ణుడు తిరిగి తనకు రత్నఖచితమైన మరియొక రథము తయారు చేసుకున్నందువల్ల ఈతడు "చిత్ర రథుడు" అన్న పేరు కూడా పొందాడు.

పాండవులను తపతేయులని సంబోధించింది, తపతి, వశిష్టు ల గురించి వారికి చెప్పినది అంగారపర్ణుడే. పాండవుల అవసరాలకు "ధౌమ్యుడు" అన్న పురోహితుడిని పాండవులకు సూచించినది అంగారపర్ణుడే. అంగారపర్ణుడి కథ మహాభారతంలో ఉంది.

నివాసము

మార్చు

గంగా నదీ పరీవాహక ప్రాంతములు,, గంగానది చుట్టూ ఉన్న అడవి

నామాలు

మార్చు
  1. అంగారప్రర్ణుడు
  2. చిత్రరధుడు

బయటి లింకులు

మార్చు
  1. తెలుగు భక్తిలో
  2. మహాభారతము లో[permanent dead link]
  3. యోగాపుస్తకాలు లో[permanent dead link]
  4. గూగుల్ బుక్స్ లో
  5. గూగుల్ బుక్స్ లో