అంజలి పైగాంకర్

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.

అంజలి పైగాంకర్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.

అంజలి పైగాంకర్
జననం
వృత్తినటి

సినిమారంగం మార్చు

పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది. 1976లో ఫైనల్ ఇయర్ విద్యార్థిగా విధు వినోద్ చోప్రా తీసిన మర్డర్ ఎట్ మంకీ హిల్‌ డిప్లొమా సినిమాలో నటించింది. అంతకు ముందు సంవత్సరం శ్యామ్ బెనెగల్ తీసిన చరణ్ దాస్ చోర్‌లో చిన్న పాత్రలో కూడా నటించింది.[1] 1977లో, అమోల్ పాలేకర్ నటించిన టాక్సీ-టాక్సీలో కనిపించింది, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.[2]

1978లో విడుదలైన సర్వసాక్షి (మరాఠీ), దిల్లగి (హిందీ) సినిమాలలో నటించింది. అరవింద్ దేశాయ్ కి అజీబ్ దస్తాన్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది.[3] చక్ర, ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యోం అతా హై సినిమాల్లో కూడా నటించింది.

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1975 చరణ్ దాస్ చోర్
1976 మర్డర్ ఎట్ మంకీ హిల్
1977 టాక్సీ టాక్సీ
1978 సర్వసాక్షి రేఖ
1978 అరవింద్ దేశాయ్ కి అజీబ్ దాస్తాన్ ఆలిస్ డి'కోస్టా
1978 డిల్లగి శోభ
1980 ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యోం అతా హై
1981 చక్ర చెన్నా
1984 మోహన్ జోషి హజీర్ హో! జోషి కొడుకు స్నేహితురాలు

మూలాలు మార్చు

  1. "Charandas Chor". Rangu-Colour of Indian Cinema. Archived from the original on 22 June 2015. Retrieved 22 June 2015.
  2. "Taxi-Taxi". I Bos Network. Retrieved 22 June 2015.[permanent dead link]
  3. "Anjali Paigankar's filmography". IMDb. Retrieved 22 June 2015.

బయటి లింకులు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అంజలి పైగాంకర్ పేజీ