అమోల్ పాలేకర్ (జ.24 నవంబర్ 1944) హిందీ సినిమా నటుడు, దర్శకుడు. హిందీ, మరాఠీ సినిమా నిర్మాత.[3]

అమోల్ పాలేకర్ (Amol Palekar)
Amol Palekar.jpg
2009లో పాలేకర్ చిత్రం
జననం (1944-11-24) 1944 నవంబరు 24 (వయస్సు: 75  సంవత్సరాలు)[1]
ముంబాయి, భారతదెశం
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1971–present
జీవిత భాగస్వామిచిత్ర (మొదటి భార్య, సంద్య గోఖలే
తల్లిదండ్రులు
 • Kamalakar Palekar[2] (తండ్రి)
 • Suhasini Palekar[2] (తల్లి)
పురస్కారాలుఉత్తమ నటుడు (గోల్‌మాల్ 1980)
వెబ్ సైటుhttp://www.amolpalekar.com

జీవిత విశేషాలుసవరించు

పాలేకర్ ముంబాయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో లలిత కళలను అభ్యసించాడు. అతమి చిత్రకారుడిగా తన కళాత్మక వృత్తిని ప్రారంభించాడు[4]. పెయింటర్‌గా ఏడు చిత్రకళా ప్రదర్శనలు, గ్రూపు ప్రదర్శనలు చేపట్టాడు. నాటక ప్రదర్శనలలో చురుకుగా పాల్గొనే పాలేకర్ మరాఠీ, హిందీలలో 1967 వరకూ అనేక ప్రదర్శనలను రూపొందించి నిర్మాతగా, దర్శకుడిగావ్యవహరించాడు. అనేక ప్రదర్శనలలో పాల్గొన్నాడు. దీని ద్వారా గుర్తింపు పొంది తద్వారా హిందీ చిత్రపరిశ్రమకు ఆహ్వానించబడ్డారు

నటుడిగా 1970 దశకంలో హిందీ చిత్రరంగాన్ని ఒక ఊపు ఊపాడు. పక్కింటి కుర్రాడిలా ఉండే అతడి ద్వారా అనేక మంచి చిత్రాలు వచ్చాయి. హిందీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ తదితర రంగాలలో ఆయన నటించారు. సినీ జీవితంలో ఒక ఫిల్ంపేర్ అవార్డుతోపాటుగా ఆరు స్టేట్ అవార్డులు ఉత్తమ నటుడిగా అందుకొన్నారు.

ఇక దర్శకుడిగా ఆయన అనేక సున్నిత కథాంశాలను తెరక్కెక్కించారు. భారతీయ సాహిత్యం నుండి అనేక కథలను, మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఆయన తెరకెక్కించారు, మరాఠీ, హిందీ చిత్రాలతోపాటుగా చిన్నితెర దారావాహికలనూ ఆయాన అందించారు. కాచ్చిదూప్ (Kachchi Dhoop), మృగనయని (Mrignayani), నఖాబ్ (Naquab), ఫూల్ ఖునా (Paool Khuna) మరియు కృష్ణ కాళి (Krishna Kali) వంటివి పేరు తెచ్చినవాటిలో కొన్ని

నాటకరంగ జీవితంసవరించు

పాలేకర్ మొదట సత్యదేవ్ దూబే ఎక్స్పెరిమెంటల్ దియెటర్ ద్వారా మరాఠీ నాటకరంగంలో పనిచేసారు, తరువాత అనికేత్ అనే సంస్థను 1972లో సొంతగా నిర్మించారు.

సినిమా ప్రయాణంసవరించు

 • పాలేకర్ తన ప్రస్థానన్ని సత్యదేవ్ దూబే మరాఠీ చిత్రం షంతాత కోర్ట్ చలూ అహే (Shantata! Court Chalu Aahe) ద్వారా 1971లో ప్రవేశించారు.[5]
 • 1974 లో బాసు చటర్జీ యొక్క రజనీ గంధ (Rajnigandha) చిత్రంలో నటించారు. ఈ తక్కువ ఖర్చుతో నిర్మిచిన సినిమా ఆశ్చర్యంగా పెద్ద విజయం సాధించింది. తరువాత హౄషీకేష్ ముఖర్జీ (Hrishikesh Mukherjee) దర్శకత్వంలో వచ్చిన చోటీసీబాత్ (Chhoti Si Baat) ఇంకా పెద్ద విజయం సాధించిపెట్టింది. తరువాత గోల్‌మాల్ (Gol Maal), నరం గరం సినిమాల ద్వారా పేరు పొందారు. గోల్‌మాల్ ద్వారా ఫిల్ంపేర్ అవార్డు పొందారు
 • తన సినిమాల ద్వారా అప్పటి వరకూ ఉన్న హీరో అనే ఇమేజిని మార్చి సినిమాల్లో హీరో మన పక్కింటి అబ్బాయిలా సాదా సీదాగానే ఉండాలి అనే ఒరవడిని సృష్టించారు.
 • 1979 లో 16 సంవత్సరాల శ్రీదేవితో కలసి సోల్వా సావన్ (Solva Saawan) అనే హిందీ సినిమాలో అంగవైకల్యం కల మానసిక వికలాంగుడిగా నటించాడు. ఇది శ్రీదేవి మొట్టమొదటి హిందీ సినిమా. అమోల్ పాత్రను తమిళంలో కమల్‌హాసన్ నటించారు.
 • 1982 లో (ఒలంగాల్) అనే మళాయాళం సినిమాలో రవి అనే పాత్రలో నటించారు.
 • పాలేకర్ మరాఠీ సినిమా ఆక్రిత్ ద్వారా దర్శకుడిగా మారారు. తరువాత సినిమా తోడాసా రూమాని హో జాయెనాతో తన దర్శకత్య ప్రతిభను ప్రదర్శించి మంచి విజయం అందుకొన్నారు. ఈసినిమా మానవ జీవితంలో ప్రవర్తన అనే దాని ఆధారంగా రూపొందించారు[6][6], ఇక మరో సినిమా పహేలి ఆస్కార్ 2006 ఉత్తమ ప్రాంతీయేతర సినిమాగా ఎన్నిక చేసారు. అయితే చివరి రౌండ్‌లో వెనుదిరిగింది..

వ్యక్తిగత జీవిత విశేషాలుసవరించు

అమోల్ బొంబాయిలో జన్మించారు. తల్లిదండ్రులు కమలాకర్, సుహాసిని మద్య దిగువ తరగతికి చెందినవారు. అమోల్‌కు నీలం, రేఖ, ఉన్నతి అనే ముగ్గురు అక్కచెళ్ళెళ్ళు. అతడి తండ్రి జనరల్ పోస్టాఫీస్‌లో పనిచేస్తుండేవాడు. తల్లి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేది[7]. అమోల్ సినిమాల్లో బిజీ అవ్వకముందు వరకూ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుండేవాడు. అప్పడే కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడు. అతడి భార్య రచయిత్రి సంధ్య గోఖలే. మొదటి భార్యతో విడాకుల అనంతరం ఈమెను వివాహం చేసుకొన్నాడు.[2][8][9]

ఇతర విశేషాలుసవరించు

 • టెక్ ఏయిడ్స్ వారు రూపొందించిన అనిమేటెడ్ సాప్ట్‌వేర్ కోసం గాత్రం ఇచ్చారు. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.[10]

సినీ ప్రస్థానంలో కొన్నిసవరించు

నటుడిగాసవరించు

Year Film Character/Role Notes
1969 బాజీరావ్ చా బేటా (Bajiraocha Beta) మరాఠీ సినిమా
1971 Shantata! Court Chalu Aahe మరాఠీ సినిమా
1974 రజనీగంథ (Rajnigandha) Sanjay
1974 జీవనజ్యోతి(Jeevana Jyothi (1975 film) సంజయ్ తెలుగు సినిమా
1975 చోటీసీబాత్ అరుణ్ ప్రదీప్
1976 చిట్‌చోర్ (Chitchor) వినోద్
1976 గరోండా (Gharonda) సుదీప్
1977 భూమిక (Bhumika) కేశవ్ దాల్వి
1977 అగర్ ఇఫ్ (Agar... If) అనిల్ అగర్వాల్
1977 టాక్షీ టాక్షీ (Taxi Taxie) దేవ్
1977 టచ్ మేరే రాణీ (Tuch Maazi Raani) మరాఠీ సినిమా
1977 కన్నేశ్వర్ రామ (Kanneshwara Rama) కన్నడ (Short Film)
1978 దామాద్ (Damaad)
1978 సఫేద్ జూట్ (Safed Jhoot) అమోల్ రాము పాలేకర్
1979 బాతే బాతే మే (Baaton Baaton Mein) టోనీ బర్గాంజా
1979 గోల్ మాల్ (Gol Maal) రాం ప్రసాద్, లక్ష్మణ్ ప్రసాద్
ఫిలింపేర్ అవార్డ్
1979 దో లడ్కే దోనే కడ్కే (Do Ladke Dono Kadke) హరి
1979 మేరే బీవీకి షాదీ (Meri Biwi Ki Shaadi) భగవంత్ కుమార్
1979 సోల్వా సావన్ (Solva Sawan)
1979 బిన్ బాప్ కా బేటా (Bin Baap Ka Beta)
1979 Mother 1979 film మరాఠీ
1979 Jeena Yahan దినేష్
1980 ఆంచల్ (Aanchal) కిషన్ లాల్
1980 అప్‌నే పరాయా (Apne Paraye) చంద్రనాథ్
1981 నరం గరం (Naram Garam) రామేశ్వర్ ప్రసాద్
1981 సమీరా (Sameera)
1981 అక్రిత్ (Akriet) ముక్తారావ్ బంగాలీ సినిమా
1981 కళంకిణి (Kalankini) బంగాలీ సినిమా
1981 అగ్నిపరీక్ష (Agni Pareeksha) అలోక్ చౌదరి
1981 చెహరా పె చెహారా (Chehre Pe Chehra) పీటర్
1981 ప్లాట్ నెంబర్ 5 (Plot No. 5 )
1982 జీవన్ ధార (Jeevan Dhaara) ఆనంద్
1982 ఒలంగల్ (Olangal) రవి మలయాళం
1982 రాం నగరి (Ramnagari)
1982 స్పందన్ (Spandan)
1982 శ్రీమాన్ శ్రీమతి Shriman Shrimati మదు గుప్తా
1983 రంగ్ బిరంగి (Rang Birangi) అజయ్ శర్మ
1983 ఆశ్రయ్ (Ashray)
1983 ప్యాసి ఆంకేన్ Pyaasi Aankhen
1983 చెనా అచేనా (Chena Achena) బంగాలీ సినిమా
1984 తరంగ్ (Tarang) రాహుల్
1984 ఆద్మీ ఔర్ ఔరత్ (Aadmi Aur Aurat) తపన్ TV Movie
1984 Prarthana
1984 Sringara Masa కన్నడ సినిమా
1985 Khamosh అమోల్ పాలేకర్
1985 Jhoothi కమల్ నాథ్
1985 Ankahee దేవికానందన్
1985 Abasheshe బంగాలీ సినిమా
1986 Baat Ban Jaye యశ్వంత్ రావ్
1987 Mr. X అమర్ Voice Dubbed by other artist
1994 Teesra Kaun? సి.కె.కదన్
2001 Aks మినిష్టర్
2009 Samaantar కేశవ్ మరాఠీ సినిమా

దర్శకుడిగాసవరించు

Feature films in other regional languagesసవరించు

 • Mother (Bengali) (with Sharmila Tagore & Dipankar Dey)
 • Kalankini (Bengali) (with Mamata Shankar – Directed by Dhiren Ganguly)
 • Chena Achena (Bengali) (with Tanuja & Soumitra Chaterjee)
 • Kanneshwara Rama (Kannada) (with Anant Nag & Shabana Aazmi – Directed by M.S.Sathyu)
 • Paper Boats (Kannada & English) (with Deepa - Directed by Pattabhirama Reddy)
 • Olangal (Malayalam) (with Poornima Jyaram & Ambika - Directed by Balu Mahendra)

టీవీ రంగంలోసవరించు

 • Kachchi Dhoop – 1987
 • Naqab – 1988
 • Paoolkhuna – 1993
 • Mrignayanee – 1991
 • Kareena Kareena – 2004
 • AA Bail Mujhe Maar - 1987
 • Ek Nayi Ummeed-Roshni – 2015

Reality television showsసవరించు

పురస్కారాలుసవరించు

అవార్డ్ సినిమా పాత్ర సంవత్సరం స్థితి
ఉత్తమనటుడుగా ఫిలింఫేర్ అవార్డ్ చోటీసీ బాత్ (Chhoti Si Baat) అరుణ్ ప్రదీప్ 1977 ప్రతిపాదన
గోల్‌మాల్(Gol Maal) రాం ప్రసాద్ దశరథ్ ప్రసాద్ శర్మ 1980 విజేత

Referencesసవరించు

 1. ‘आपल्यातीलच एक’ थोडासा रुमानी झाला तेव्हा A correct reference about his birthday from Marathi language newspaper loksatta news,Birthday is confirmed person with him to be 24 November,1944 during Marathi language wikipedia workshop
 2. 2.0 2.1 2.2 Amol Palekar: Baaton Baaton Mein
 3. "'Paheli is a simple, loveable film'". Rediff.com. 21 June 2005. Cite web requires |website= (help)
 4. "Painting is like 'ghar wapsi' for me: Amol Palekar". FilmyKeeday. Retrieved 27 June 2016.
 5. Chronology of Indian Cinema at upperstall
 6. 6.0 6.1 https://kanikahanda.wordpress.com/2012/09/18/thoda-sa-roomani-ho-jaaye-movie-review/
 7. "Amol Palekar: Baaton Baaton Mein - The Times of India". The Times of India.
 8. [1] Archived 2011-09-27 at the Wayback Machine..
 9. "Amol Palekar is back in action, this time with an English language ..." The Indian Express. 2 August 2010. Retrieved 13 August 2010.
 10. llenging-447244|work=November 17, 2013|publisher= NDTV|accessdate= November 19, 2013}}
 11. "Focus". pib.nic.in. Retrieved 2015-07-26.

External linksసవరించు

మూస:National Film Award Special Jury Award Feature Film మూస:FilmfareBestActorAward