అంజలి మరాఠీ
అంజలి మరాఠే భారతీయ నేపథ్య గాయని, హిందుస్తానీ గాయకురాలు.
అంజలి మరాఠే | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
మూలం | పూణే, మహారాష్ట్ర, భారతదేశం |
సంగీత శైలి | మరాఠీ గీతాలు, హిందీ గీతాలు |
సంబంధిత చర్యలు | సలీల్ కులకర్ణి |
జీవితం తొలి దశలో
మార్చుఆమె తన తల్లి అనురాధ మరాఠే నుండి శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. ఆమె స్వయంగా ప్రసిద్ధ శాస్త్రీయ సంగీతంతో పాటు అనేక మరాఠీ, హిందీ పాటల స్టేజ్ షోలను నిర్వహించేది.
కెరీర్
మార్చుఆమె వైద్యశాస్త్రంలో సైకాలజీ గ్రాడ్యుయేట్ అవ్వాలని అనుకుంది. కానీ పన్నెండో తరగతిలో ఉండగానే సంగీతాన్ని కెరీర్ గా ఎంచుకుంది.[1] ఆమె 1996లో 16 సంవత్సరాల వయస్సులో మరాఠీ చిత్రం దోఘీ(दोघी )లో ఒక పాటను పాడినందుకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
తొమ్మిదేళ్ల వయస్సులోనే ఝుతే సచ్చే గుడ్డే బచ్చె (హిందీ), ఒలక్ సంగనా (మరాఠీ) ధారావాహికలకు టైటిల్ పాటలు ఆమె రికార్డ్ చేసింది. ఆమె ఆల్ ఇండియా రేడియో పూణే ప్రసారం చేసిన పిల్లల ప్రోగ్రామ్ బలోద్యన్ పాటలను కూడా రికార్డ్ చేసింది. చౌకట్ రాజా (మరాఠీ), సాయిబాబా (మరాఠీ), దోఘీ (మరాఠీ)ల కోసం ఆమె పాడిన పాటలతో ప్రసిద్ధిచెందింది.
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె గాయని అనురాధ మరాఠే కుమార్తె. ఆమె సలీల్ కులకర్ణిని వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు శుభంకర్, కుమార్తె అనన్య ఉన్నారు. వారు ఇటీవల విడిపోయారు. శుభంకర్ పిల్లల చిత్రం చింటూ (चिंटू)లో పాటలు ఆలపించాడు.
మూలాలు
మార్చు- ↑ "In the genes" Archived 1 మే 2005 at the Wayback Machine. The Indian Express. 20 April 2005. Retrieved 1 June 2011.