అంతర్జాతీయ పర్వత దినోత్సవం

ప్రతి సంవత్సరం డిసెంబరు 11న నిర్వహించబడుతుంది

అంతర్జాతీయ పర్వత దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 11న నిర్వహించబడుతుంది. పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అభివృద్ధికోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1]

అంతర్జాతీయ పర్వత దినోత్సవం
అంతర్జాతీయ పర్వత దినోత్సవం
దామవంద్ పర్వతం, ఇరాన్
యితర పేర్లుపర్వత దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజుడిసెంబరు 11
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

ప్రారంభం

మార్చు

2003లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో డిసెంబరు 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. పర్వత ప్రాంతాలలో ఉన్న వారికి కనీస అవసరాలకు కావలసినవి దొరకడం కష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వ్యక్తుల ద్వారా పర్వత ప్రాంత అభివృద్ధికి కావలసిన వివిధ కార్యక్రమాలను నిర్వహించడంకోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.[2]

కార్యక్రమాలు

మార్చు
  1. పాఠశాలల్లో పర్వతాలకు సంబంధించి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు.[3]
  2. 2018లో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ పర్వత దినోత్సవం కోసం 2017లో మౌంటైన్స్ మాటర్ వీడియో పోటీ నిర్వహించబడింది. ప్రతి విభాగంలో గెలుపొందిన విజేతకు 2018 డిసెంబరు 11న జరిగే అంతర్జాతీయ పర్వత దినోత్సవ కచేరీలో పాల్గొనడానికి రోమ్ పర్యటనను అందించారు.
  3. 2018, డిసెంబరు 11న సియెర్రా నెవాడా డి మెరిడా పర్వతాలకు ప్రయాణించిన వెనిజులా నేషనల్ పార్క్స్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు జోసుస్ లోర్కా వెనిజులా దేశంలోని మంచు పర్వతాలకు పరిరక్షించుకునేందుకు తీసుకున్న చర్యలను ప్రకటించాడు.[4]

మూలాలు

మార్చు
  1. ప్రజాశక్తి, స్నేహ (8 December 2018). "ప‌ర్వ‌త బిందువులు." Retrieved 11 December 2019.
  2. అంతర్జాతీయ పర్వత దినోత్సవం, 11 డిసెంబరు
  3. ప్రజాశక్తి, జిల్లాలు (11 December 2017). "అంతర్జాతీయ పర్వత దినోత్సవం". www.prajasakti.com. Archived from the original on 11 December 2019. Retrieved 11 December 2019.
  4. Rodríguez, Jeanfreddy Gutiérrez and María Fernanda (2019-01-15). "Watching Venezuela's Last Glacier Disappear". The Atlantic. ISSN 1072-7825. Retrieved 11 December 2019.

ఇతర లంకెలు

మార్చు