డిసెంబర్ 11
తేదీ
(డిసెంబరు 11 నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.
- 1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
- 1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
- 1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
- 1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు.
- 1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది
జననాలు
మార్చు- 1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్యయోధుడు. (మ.1921)
- 1864: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945)
- 1896: గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారుడు, నిర్మాత.
- 1922: దిలీప్ కుమార్, భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు,రాజకీయ నాయకుడు .
- 1931: ఓషో, భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)
- 1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
- 1948:రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (మ.2008)
- 1966: బెనెడిక్టా బొక్కొలి, ఇటాలియన్ సినిమా నటి.
- 1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత
- 1969: విశ్వనాథన్ ఆనంద్, భారత చదరంగ క్రీడాకాకారుడు.
- 1995: నభా నటేష్, కన్నడ, తెలుగు, చలన చిత్ర నటి, మోడల్ .
మరణాలు
మార్చు- 1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికా. (జ.1694)
- 1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734)
- 1967: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889)
- 2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916)
- 2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924)
- 2013: శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953)
- 2015: హేమ ఉపాధ్యాయ, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, (జ.1972)
- 2016: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (జ. 1946)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- అంతర్జాతీయ పర్వత దినోత్సవం
- యూనిసెఫ్ దినోత్సవం.
- వితంతు పునర్వివాహా దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
డిసెంబర్ 10 - డిసెంబర్ 12 - నవంబర్ 11 - జనవరి 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |