అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 31న నిర్వహించబడుతుంది.
(అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం నుండి దారిమార్పు చెందింది)

అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 31న నిర్వహించబడుతుంది.[1][2] ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన పెంచడం, వారు సమాజానికి చేసిన కృషిని గుర్తుచేసుకోవడం కోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.

అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం
అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం
2016లో శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవ వేడుకలు
జరుపుకొనేవారుట్రాన్స్‌జెండర్ సమాజం, మద్దతుదారులు
రకంఅంతర్జాతీయం, సంస్కృతి
జరుపుకొనే రోజుమార్చి 31
ఆవృత్తివార్షికం
2019 ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవ వేడుకలు, కార్తహేన నగరం, కొలంబియా

చరిత్రా, ముఖ్య ఘట్టాలు

మార్చు

ప్రారంభం (2009)

మార్చు

2009లో[3] తొలిసారిగా మిచిగాన్కు చెందిన ట్రాన్స్‌జెండర్ కార్యకర్త[4] రేచెల్ క్ర్యాండల్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. మొట్టమొదటి అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం 2009, మార్చి 31న జరిగింది. అప్పటి నుండి అమెరికాకు చెందిన యువ న్యాయవాద సంస్థ అయిన ట్రాన్స్ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ దీనికి నాయకత్వం వహిస్తోంది.[5] 2014 నుండి ఐర్లాండ్, [6] స్కాట్లాండ్[7] దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపబడుతుంది.

2015లో ఫేస్‌బుక్, ట్విట్టర్, టంబ్లర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లలో జరిగిన ఆన్‌లైన్ ఉద్యమంలో చాలా మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు పాల్గొని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇందులో భాగంగా వారు తమ సెల్ఫీలతో పాటు, వారు అనుభవించిన కష్టాలూ, తమ వ్యక్తిగత కథనాలూ, గణాంకాలూ, ఇతర సంబంధిత విషయాలూ నెటిజన్లతో పంచుకున్నారు. తద్వారా ట్రాన్స్‌జెండర్ విషయాలపై ప్రజానీకానికి అవగాహన కలిగించడానికి ప్రయత్నించారు.[8]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nenshi proclaims Trans Day of Visibility". Canadian Broadcasting Corporation. Retrieved 28 March 2020.
  2. "Today is International Transgender Day of Visibility". Human Rights Campaign. 31 March 2014. Archived from the original on 11 సెప్టెంబరు 2018. Retrieved 28 March 2020.
  3. Carreras, Jessica. "Transgender Day of Visibility plans erupt locally, nationwide". PrideSource. Archived from the original on మార్చి 27, 2013. Retrieved మార్చి 28, 2020.
  4. "A time to celebrate". The Hamilton Spectator. 27 March 2014. Retrieved 28 March 2020.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-02. Retrieved 2020-03-28.
  6. "Trans* Education & Advocacy Protest RTE March 31st". Gaelick. మార్చి 31, 2014. Archived from the original on ఏప్రిల్ 3, 2014. Retrieved మార్చి 28, 2020.
  7. "Twitter / The_SSP_: The SSP stands in solidarity ..." 31 March 2014. Retrieved 28 March 2020.
  8. "These Trans People Are Taking Selfies To Celebrate Transgender Day Of Visibility". BuzzFeed LGBT. 31 March 2015. Retrieved 28 March 2020.

ఇతర లంకెలు

మార్చు