అంతర్గాం మండలం
అంతర్గాం మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]
అంతర్గాం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, అంతర్గాం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | అంతర్గాం (అంతర్గాం మండలం) |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 123 km² (47.5 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 23,493 |
- పురుషులు | 11,701 |
- స్త్రీలు | 11,792 |
పిన్‌కోడ్ | 502314 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం అంతర్గాం
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 123 చ.కి.మీ. కాగా, జనాభా 23,493. జనాభాలో పురుషులు 11,701 కాగా, స్త్రీల సంఖ్య 11,792. మండలంలో 6,343 గృహాలున్నాయి.[3]
2016 లో ఏర్పడిన మండలం
మార్చులోగడ అంతర్గాం గ్రామం కరీంనగర్ జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలోని రామగుండం మండల పరిధిలోనిది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అంతర్గాం గ్రామాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- మద్దిరియాల
- పొట్యాల
- సోమనపల్లి
- ముర్మూర్
- ఎల్లంపల్లి
- గౌలివాడ
- అంతర్గాం
- బ్రాహ్మణపల్లి
- ఆకెన్‌పల్లి
- ఏక్లాస్‌పూర్
- లింగాపూర్
- రాయదండి
- కుందనపల్లి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ 2.0 2.1 "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-12-10.