పెద్దపల్లి రెవెన్యూ డివిజను
పెద్దపల్లి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. పెద్దపల్లి జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం పెద్దపల్లిలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం, పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
పెద్దపల్లి రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
మార్చుపెద్దపల్లి డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | పెద్దపల్లి రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | పెద్దపల్లి మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
2 | ఓదెల మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
3 | సుల్తానాబాద్ మండలం | 7 రెవెన్యూ గ్రామాలు |
4 | జూలపల్లి మండలం | 9 రెవెన్యూ గ్రామాలు |
5 | ఎలిగేడు మండలం | 23 రెవెన్యూ గ్రామాలు |
6 | ధర్మారం మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
7 | రామగుండం మండలం | 8 రెవెన్యూ గ్రామాలు |
8 | అంతర్గాం మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
9 | పాలకుర్తి మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
10 | శ్రీరాంపూర్ మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-04.
- ↑ "Revenue Divisions | PEDDAPALLI DISTRICT | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-11. Retrieved 2022-04-04.
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-04-04.