అంతిమతీర్పు
అంతిమతీర్పు 1988లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి జోషీ దర్శకత్వం వహించాడు.[1] అదే దర్శకుడి స్వంత మలయాళ చిత్రం "న్యూఢిల్లీ"కి రీమేక్ చిత్రం. ఈ చిత్రం ఇర్వింగ్ వాల్లాస్ రాసిన నవల "ఆల్ మైటీ " ఆధారంగా నిర్మించబడింది. ఇది మొత్తం న్యూఢిల్లీలో చిత్రీకరించబడిన ఒకే ఒక తెలుగు చిత్రం. ఈ చిత్రంలో కృష్ణం రాజుకు తెలుగు సినిమాలో ఉత్తమ నటునిగా ఫిలిం ఫేర్ పురస్కారం లభించింది.[2][3]
అంతిమ తీర్పు రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రం. మలయాళ వెర్సటైల్ డైరెక్టర్ జోషి తెలుగులో తొలిసారిగా తెరకెక్కించిన ఈ సినిమా 1988 లో విడుదలై అప్పటి ప్రేక్షకుల్ని అబ్బుర పరిచింది. నిజానికి మలయాళంలో జోషి దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘న్యూ ఢిల్లీ’ సినిమాకి రీమేక్ వెర్షన్ . మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్ లోనూ మరిచిపోలేని చిత్రమైంది. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన కథానాయిక సుమలత, ఊర్వశి, త్యాగరాజన్, సురేష్ గోపీ లాంటి నటీనటులే తెలుగులోనూ నటించి మెప్పించారు.
ఈ మూవీలో కృష్ణంరాజు తర్వాత అంతటి స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు నటరాజ విష్ణుగా నటించిన త్యాగరాజన్ (జీన్స్ హీరో ప్రశాంత్ తండ్రి ).
కథ
మార్చుస్వార్ధ రాజకీయాలకు బలై, నా అన్న వాళ్ళను పోగొట్టుకొని, అవిటివాడిగా మారిన నిజాయితీ పరుడైన ఒక జర్నలిస్ట్ అయిన జి.కె (కృష్ణంరాజు) సొంతంగా ఒక పేపర్ స్థాపించి తనను ఆ స్థితికి తీసుకొచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ‘అంతిమ తీర్పు’ చిత్ర కథ.
తారాగణం
మార్చు- కృష్ణం రాజు - జి, జె
- త్యాగరాజన్
- సుమలత - వసంత
- ప్రభాకరరెడ్డి
- రంగనాథ్
- సురేష్ గోపి
- ఊర్వశి
- మోహన్ జోస్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
మూలాలు
మార్చు- ↑ "Anthima Theerpu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-01.
- ↑ "Krishnam Raju Awards: List of awards and nominations received by Krishnam Raju | Times of India Entertainment". timesofindia.indiatimes.com. Retrieved 2020-08-01.
- ↑ "ఆయన తెలుగు తెర రెబెల్ స్టార్". సితార. Archived from the original on 2021-01-20. Retrieved 2020-08-01.