అంత్యప్రాసాలంకారము

అంత్యప్రాసాలంకారము తెలుగు భాషకు చెందిన ఒక రకమైన అలంకారము. మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. కూచిమంచి జగ్గకవి కి అంత్యప్రాసాలంకారము లనిన చాలా యిష్టం అలాంటి పద్యములు అతను వ్రాసిన ‘భక్తమందారశతకము’ లో ఆరు కలవు. [1] అంత్య ప్రాస ముద్ర ఆరుద్ర గారి శైలిలో ప్రాస మీద ఆశతో ధ్యాస ఎక్కువగా పెట్టి వేటూరి గారు చాలా పాటలు వ్రాశారు.

ఉదాహరణ-1

మార్చు

శ్రీరఘురామ ! చారుతులసీ దళధామ ! శమక్షమాది శృం
గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమా లలామ ! దు
ర్వారక బంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !

పదాంతమందున్న రామ - ధామ - అభిరామ - లలామ - విరామ - నామ - ఇంతవరకొక అంత్యప్రాసము దాశరథీ ! కరుణాపయోనిధీ ! ఇది యొక అంత్యప్రాసము.

అంత్యప్రాసమున్నదని పద్యమున, కుండవలసిన ప్రాసమును తొలగింపరాదు.[2]

భక్త మందార శతకంలో పద్యం

మార్చు

కూచిమంచి జగ్గకవి రాసిన ఈ పద్యములో అంత్య ప్రాసాలంకారం ఉన్నది.

అతసీపుష్పసమానకోమల వినీలాంగున్, సముద్యన్మహో-
న్నత కోదండనిషంగగంగు, బలవన్నక్తంచరాఖగ్వప-
ర్వతజీమూతతురంగుఁ, గింకరజనవ్రాతావనాత్యంతర-
మ్యతరాపాంగుని, నిన్ భజింతు మది, రామా! భక్తమందారమా!

సినిమా పాటలలో అలంకారము

మార్చు
  • తోటలో నారాజు తొంగి చూసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు - ఏకవీర సినిమా కోసం సి.నారాయణరెడ్డి గారి పాట. : ఇందులో "నాడు", "నేడు" పదాలు అంత్యప్రాసము.
  • రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకో, : రచన: వేటూరి సుందరరామమూర్తి.
  • నటరాజ శతసహస్ర రవితేజ నటగాయక వైతాళిక మునిజన భోజ : రచన: సి.నారాయణరెడ్డి
  • కైలాసాన కార్తీకాన శివ రూపం, ప్రమిదేలేని ప్రమధాలోకం హిమ దీపం
  • పంచ భూతములు ముఖ పంచకమై, ఆరు ఋతువులు ఆహార్యములై, త్రికాలములు నేత్రత్రయమై,  చతుర్వేదములు ప్రాకారములై
  • ఏకులము నీదంటే గోకులము నాదంది మాధవుడు యాదవుడు మాకులమే లెమ్మంది
  • కృషి ఉంటె మనుషులు ఋషు లౌతారు మహా పురుషులౌతారు
  • రాలు పూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
  • అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే
  • ఆకాశ దేశాన, ఆషాఢ మాసాన, మెరిసేటి ఓ మేఘమా, విరహమో, దాహమో, విడలేని మోహమో

మూలాలు

మార్చు
  1. "కూచిమంచి జగ్గకవి - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు)". andhrabharati.com. Retrieved 2021-06-09.
  2. "పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/132 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-06-09.