అందరి బంధువయ (పుస్తకం)
అందరి బంధువయ పుస్తకం బాల సాహిత్యకారుడు బి.వి.నరసింహారావు సాహిత్య సర్వస్వం. ఆత్మకథ, కథలు, గేయాలు, గేయనాటికలు, వ్యాసాలు, లేఖలు వంటి వివిధ ప్రక్రియల్లో ఆయన వెలువరించిన సాహిత్యమంతటినీ మూడు సంపుటాలుగా వెలువరించారు.
అందరి బంధువయ | |
కృతికర్త: | బి.వి. నరసింహారావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | సాహితీ సర్వస్వం |
ప్రచురణ: | దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ |
విడుదల: | 2013 |
రచన నేపథ్యం
మార్చుబాలసాహిత్యకారుడు బి.వి.నరసింహారావు వివిధ కథలు, గేయాలు, గేయనాటికలు, ఆత్మకథ, వ్యాసాలు, లేఖలు(చలానికి) వంటి ప్రక్రియల్లో సాహిత్యాన్ని సృష్టించారు. ఆ క్రమంలో తెలుగులో బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకు ఆయనను బాల బంధుగా గౌరవించారు. ఆయన శతజయంతి సందర్భంగా దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ సాహిత్యాన్ని అందరి బంధువయగా ప్రచురించారు. 1948లో తొలి రచన ప్రారంభించిన బి.వి.నరసింహారావు తాను 1994లో మరణించేవరకూ సాహిత్యసృష్టి చేస్తూనే వున్నారు.[1]
ఇతివృత్తాలు
మార్చుఅందరి బంధువయలో బి.వి.నరసింహారావు సమగ్ర సాహిత్యం ప్రచురించారు. దాదాపుగా ఆయన సాహిత్యం చాలావరకూ బాలల సాహిత్యమై ఉండగా, చలం లేఖలు, ఆత్మకథ వంటివి కూడా బాలల సాహిత్యాన్ని గురించే ఉంటాయి. ఉపాధ్యాయునిగా, విద్యాశాఖ అధికారిగా, నాట్యకారునిగా, సాహిత్యవేత్తగా పొందిన అనుభవాన్ని బాలలతో పంచుకోవాలని చేసిన ప్రయత్నాలే ఆయన సాహిత్యంలో కనిపిస్తాయి. పద విపంచి, ఆంధ్రపదావళి వంటి భాషా క్రీడలు, ఆధునిక యక్షప్రశ్నలు వంటి వైవిధ్యభరితమైన ప్రక్రియలతో పాటుగా కథలు, గేయాలు, గేయనాటికలు, వ్యాసాలు వంటి ప్రక్రియల్లో బాలసాహిత్యాన్ని సృష్టిచేశారు. తన అనుభవాలను, సాహిత్యం పట్ల తన అభిప్రాయాలను ఆత్మకథ, లేఖలు వంటి ప్రక్రియల్లో వెల్లడించారు.[2]