అంద నాళ్
అంద నాళ్ (అనువాదం. ఆరోజు) 1954న నాటి తమిళ మిస్టరీ-థ్రిల్లర్ సినిమా, ఈ సినిమాని ఏ. వీ. మెయ్యప్పన్ నిర్మించగా, ఎస్. బాలచందర్ దర్శకత్వం వహించాడు. నాయిర్ శైలిలో తీసిన తొలి తమిళ సినిమా. అలాగే, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు లేకుండా నిర్మించిన మొదటి తమిళ చిత్రం కూడా. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రేడియో ఇంజనీర్ రాజన్ (శివాజీ గణేశన్) హత్యకు సంబంధించిన కథ ఇది. రాజన్ భార్య ఉష (పండరి బాయి), పక్కింట్లోని చిన్నయ్య పిళ్ళై (పి.డి.సంబందం), రాజన్ సోదరుడు పట్టాబి (టి. కె. బాలచంద్రన్), సోదరి హేమ (మేనకా), రాజన్ ప్రియురాలు అంబుజం (కె. సూర్యకళ)ల్లో ఎవరు హత్య చేశారన్న ఆసక్తి రేకెత్తిస్తూ సినిమా సాగుతుంది. ఈ సంఘటన గురించి ప్రతి ఒక్కరూ చెప్పే కథనం కొత్త వ్యక్తిపై అనుమానాన్ని కలిగిస్తూంటుంది.
అంద నాళ్ (1954 తమిళ సినిమా) | |
దస్త్రం:Andha Naal.jpg థియేట్రికల్ రిలీజ్ పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్. బాలచందర్ |
నిర్మాణం | ఏ. వి. మెయ్యప్పన్ |
కథ | ఎస్. బాలచందర్ |
చిత్రానువాదం | జవర్ సీతారామన్ |
తారాగణం |
|
సంగీతం | సరస్వతీ స్టోర్ ఆర్కెస్ట్రా |
ఛాయాగ్రహణం | ఎస్. మారుతీరావు |
కూర్పు | ఎస్. సూర్య |
విడుదల తేదీ | 1954 ఏప్రిల్ 13 |
నిడివి | 130 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళ |
నిర్మాణ_సంస్థ | ఏవీఎం ప్రొడక్షన్స్ |