అంధగాడు 2017 లో విడుదలైన తెలుగు సినిమా.

అంధగాడు
దస్త్రం:Andhhagadu.jpg
చిత్ర గోడ పత్రిక
దర్శకత్వంవెలిగొండ శ్రీనివాస్‌
రచనవెలిగొండ శ్రీనివాస్‌
(కథ/ చిత్రానువాదం)
నిర్మాతసుంకర రామబ్రహ్మం
తారాగణంరాజ్ తరుణ్
హెబ్బా పటేల్
గద్దె రాజేంద్ర ప్రసాద్
ఛాయాగ్రహణంబి. రాజశేఖర్
కూర్పుఎం. ఆర్. వర్మ
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
ఎ.కె. ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటేడ్[1]
విడుదల తేదీ
2 జూన్ 2017 (2017-06-02)
సినిమా నిడివి
132 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గౌతమ్‌(రాజ్‌తరుణ్‌) శారదాదేవి అనే అంధ ఆశ్రమంలో తన స్నేహితులు రాజు, కిరణ్‌, దివ్యలతో కలిసి పెరుగుతుంటాడు. తన కళ్ళ కోసం కంటి ఆసుపత్రులు చుట్టూ తిరుగే గౌతమ్‌కు ఓ సందర్భంలో అసిస్టెంట్‌ కమీషనర్‌ ధర్మ(షాయాజీ షిండే) కూతురు నేత్ర(హెబ్బా పటేల్‌) పరిచయం అవుతుంది. తను గుడ్డివాడినని తెలిస్తే నేత్ర తనను విడిచి పెట్టేస్తుందని భావించిన గౌతమ్‌, తన స్నేహితుడు(స్యత) సహాయంతో నేత్ర దగ్గర కళ్ళు ఉన్నవాడిలా నటిస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో నేత్రకు నిజం తెలిసిపోతుంది. తనకు అబద్ధం చెప్పినందుకు గౌతమ్‌ను విడిచి పెట్టి వెళ్ళిపోతుంది. అయితే నేత్ర కంటి వైద్యురాలు కావడంతో ఓ యాక్సిడెంట్‌ కేసులో వచ్చిన కళ్ళను గౌతమ్‌కు పెట్టేలా ఏర్పాటు చేస్తుంది. కంటిచూపు వచ్చిన గౌతమ్‌, నేత్రను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తనే నేత్ర అని చెప్పకుండా మూగ అమ్మాయిలా నటిస్తుంది నేత్ర. అయితే గౌతమ్‌కు కూడా నేత్ర నటిస్తుందనే అసలు నిజం తెలుస్తుంది. కానీ నేత్ర వల్లే తనకు కళ్ళు వచ్చాయని, నేత్ర కూడా తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న గౌతమ్‌ ఆమెను ప్రేమిస్తాడు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. గౌతమ్‌కు ఓ కారు నెంబర్‌ పదే పదే కలలో కనపడుతూ ఉంటుంది. అదే సమయంలో కులకర్ణి(రాజేంద్రప్రసాద్‌) కారణంగా పేరు మోసిన రౌడీ బాబ్జీ(రాజా రవీందర్‌) మనుషులను చంపి హత్య కేసులో ఇరుక్కుంటాడు. అసలు కులకర్ణి ఎవరు? కులకర్ణి బాజ్జీ మనుషులను ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు గౌతమ్‌కు, బాజ్జీకి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు మిగిలిన సినిమా కథలో భాగం.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • దెబ్బకి పోయే పోయే , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.ధనుంజయ్, శేఖర్ చంద్ర
  • జగమే మాయ, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. సిద్ధార్ద్, వాట్ కిన్స్
  • అందగాడు ఆట కొచ్చాడు, రచన: రామజోగయ్యశాస్త్రి , గానం.సింహా, గీతా మాధురి
  • ప్రేమిక , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. మనీషా ఈరబతిని, మేఘ స్రవంతి
  • కనుల ముందరే ,రచన: కరుణాకర్ అడిగర్ల , గానం.వెంకీ

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
  • కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
  • సంగీతం: శేఖర్‌ చంద్ర
  • ఛాయాగ్రహణం: బి. రాజశేఖర్‌
  • నిర్మాత: రామబ్రహ్మం సుంకర
  • కథ, కథనం, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌
  • విడుదల తేదీ: జూన్‌ 2, 2017

మూలాలు

మార్చు
  1. "Andhhagadu (Overview)". Filmibeat.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అంధగాడు&oldid=4211372" నుండి వెలికితీశారు