హెబ్బా పటేల్

సినీ నటి

హెబ్బా పటేల్ (జ. జనవరి 6, 1989) భారతీయ చలనచిత్ర నటీమణి, నృత్యకారిణి, ప్రచారకర్త తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.[1]

హెబ్బా పటేల్
కుమారి 21ఎఫ్ పాటల విడుదల కార్యక్రమం
జననంజనవరి 6, 1989
వృత్తినటి, నృత్యకారిణి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2010 - ప్రస్తుతం

జననం మార్చు

హెబ్బా పటేల్, 1989, జనవరి 6న మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించింది.

సినీరంగ ప్రస్థానం మార్చు

హెబ్బా పటేల్ 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా చిత్రంద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ, కన్నడంలో వచ్చిన అధ్యక్ష (తొలిపరిచయం) చిత్రం మొదటగా విడుదలైంది.

2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది.

నటించిన చిత్రాల జాబితా మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2014 అధ్యక్ష ఐశ్వర్య కన్నడ తొలిపరిచయం (కన్నడ)
తిరుమనం ఎనుం నిఖా నసీమ తమిళం తొలిపరిచయం (తమిళం)
అలా ఎలా? శృతి తెలుగు తొలిపరిచయం (తెలుగు)
2015 కుమారి 21ఎఫ్ మీరా కుమారి & కుమారి తెలుగు
2016 ఈడోరకం ఆడోరకం సుప్రియ తెలుగు
ఎక్కడికి పోతావు చిన్నవాడా అమల & నిత్య తెలుగు
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్[2] పద్మావతి & పద్దు తెలుగు
2017 మిస్టర్ మీరా తెలుగు
అంధగాడు[3] డాక్టర్ నేత్ర తెలుగు
విన్నైతాండి వంద ఏంజల్ నక్షత్ర తమిళం
ఏంజెల్[4] నక్షత్ర తెలుగు
2018 24 కిస్సెస్ శ్రీ లక్ష్మి తెలుగు
2020 ఒరేయ్ బుజ్జిగా సృజన తెలుగు
2022 తెలిసినవాళ్లు తెలుగు
2023 ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చైత్ర
అలా నిన్ను చేరి

వెబ్‌సిరీస్‌ మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "హెబ్బా పటేల్". telugu.filmibeat.com. Retrieved 24 May 2017.
  2. సాక్షి. "ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్". Retrieved 24 May 2017.
  3. నవతెలంగాణ. "రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ 'అందగాడు' మూవీ టీజర్". Retrieved 24 May 2017.
  4. సాక్షి. "విజువల్ వండర్ గా ఏంజెల్". Retrieved 24 May 2017.