అంబిక సోని
అంబికా సోని (జననం 13 నవంబర్ 1942) భారత జాతీయకాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2009 నుంచి 2012 వరకు మన్మోహన్ సింగ్ మంత్రి వర్గం లో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె పంజాబ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుఅవిభక్త పంజాబ్‌లోని లాహోర్‌లో 1942లో లెఫ్టినెంట్ గవర్నర్ అయిన నకుల్ సేన్ దంపతులకు జన్మించారు. [1] ఆమె తల్లి ఇందు వాధ్వా గృహిణి. ఈమె కుటుంబం హిందూ, మతము నుంచి క్రైస్తవ మతంలోకి మారారు.
1961లో, 19 సంవత్సరాల వయస్సులో, అంబిక ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఉదయ్ సోనీని వివాహం చేసుకుంది.
రాజకీయ జీవితం
మార్చుఅంబికా సోనీ 1969లో పార్టీ చీలిక సమయంలో ఇందిరాగాంధీ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరి 1969లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1975లో ఆమె ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికై సంజయ్ గాంధీతో కలిసి పనిచేశారు. [1] 1998లో ఆమె ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. 1999-2006 వరకు ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
నిర్వహించిన పదవులు
మార్చుజనవరి 2000 - ఫిబ్రవరి 2004 ఆగస్టు 2004 - జనవరి 2006 | పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యురాలు |
జనవరి 2000 - ఫిబ్రవరి 2004 | పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలు |
29 జనవరి 2006 - 22 మే 2009 | పర్యాటక మంత్రి సాంస్కృతిక మంత్రి | మొదటి మన్మోహన్ సింగ్ మంత్రివర్గం | |
22 మే 2009 - 27 అక్టోబర్ 2012 | సమాచార ప్రసార శాఖ మంత్రి | రెండవ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "An affair to remember". Hindustan Times (in ఇంగ్లీష్). 2009-12-11. Retrieved 2022-05-03. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు