అంశ్య పద్వీ
అంశ్య పద్వీ (Marathi: आमश्या पाडवी) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అక్కల్కువ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
అంశ్య పద్వీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | కాగ్డా చండియా పద్వి | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జూలై 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅంశ్య పద్వీ 1995 నుండి కొవ్వలి విహీర్ గ్రామ సర్పంచ్‌గా స్థానిక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ తరువాత అక్కల్కువ పంచాయతీ సమితికి రెండుసార్లు చైర్మన్‌గా పని చేసి ఇరవై ఏళ్లపాటు పంచాయతీ సమితి సభ్యుడిగా పని చేశాడు. ఆయన అక్కల్కువ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సామాజిక సంస్థ ద్వారా వివిధ గిరిజన సమస్యలపై ఉధృతంగా ఉద్యమిస్తున్న నాయకుడిగా పేరుగాంచాడు.
అంశ్య పద్వీ 2014లో శివసేన పార్టీలో చేరినప్పటి నుంచి శివసేన నందుర్బార్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అక్కల్కువ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాగ్డా చండియా పద్వి చేతిలో 2,096 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[2]
అంశ్య పద్వీ 2022లో మహారాష్ట్ర శాసనసమండలికి జరిగిన శివసేన పార్టీ నుండి శాసనసమండలి సభ్యుడిగా ఎన్నికై,[3] 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు శివసేన (యుబిటి)ని వీడి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరాడు.[4] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అక్కల్కువ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాగ్డా చండియా పద్విపై 2,904 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
మార్చు- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee 24 taas (17 March 2024). "उद्धव ठाकरेंचा ढाण्या वाघ शिंदे गटात; आमश्या पाडवी पक्षप्रवेशासाठी कार्यकर्त्यांसह मुंबईत". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (20 June 2022). "Maharashtra Legislative Council polls: Of 10 seats, BJP gets 5, NCP and Shiv Sena bag 2 each, Congress 1" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (17 March 2024). "Shiv Sena (UBT) MLC Aamshya Padvi joins Shinde Sena". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ TimelineDaily (24 November 2024). "Akkalkuwa Election Result: Shiv Sena's Amshya Padvi Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Akkalkuwa". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.