నందుర్బార్ జిల్లా
నందుర్బార్ మహారాష్ట్ర రాష్ట్రములోని వాయవ్య మూలన ఉన్న ఖాందేష్ ప్రాంతములోని ఒక జిల్లా. జిల్లా ముఖ్యపట్టణం నందుర్బార్. జిల్లా 5055 కి.మీ² మేర వ్యాపించి ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 13,11,709. అందులో 15.45% పట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు. [1] నందుర్బార్ పట్టణం నుండి 30 కి.మీల దూరములో సుజ్లాన్ ఎనర్జీ ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సామర్థ్యం కల గాలిమరల ఫార్మును నెలకొల్పుతున్నారు. ఇది ప్రపంచములోనే అతిపెద్ద గాలిమరల సముదాయము. ఇక్కడ స్థానికంగా గాలిమరల టవర్లను , బ్లేడ్లను తయారుచేసేందుకు సుజ్లాన్ ఒక నిర్మాణసంస్థను నెలకొల్పింది.
?నందుర్బార్ మహారాష్ట్ర • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 21°13′41″N 74°08′32″E / 21.228°N 74.1422°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 5,055 కి.మీ² (1,952 చ.మై) |
ముఖ్య పట్టణం | నందుర్బార్ |
తాలూకాలు | 1.షాహదా,2.నందుర్బార్,3.నవపూర్,
4.తలోదా,5.అక్కల్‌కువా,6.అక్రానీ |
జనాభా • జనసాంద్రత • ఆడ-మగ నిష్పత్తి • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
13,09,135 (2001 నాటికి) • 260/కి.మీ² (673/చ.మై) • 975 • 46.63% • 55.11% • 37.93% |
కోడులు • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• +91-2564 |
ISO abbreviation | IN-MH-NB |
వెబ్‌సైటు: nandurbar.nic.in |
తాలూకాలు
మార్చుజిల్లాలో ఆరు తాలూకాలున్నవి. అవి అక్కల్‌కువా, అక్రానీ మహల్ (ధడ్‌గావ్ అని కూడా పిలుస్తారు. తలోదా, షాహదా, నందుర్బార్ , నవపూర్. జిల్లాలో ఒక లోక్‌సభ నియోజకవర్గము ఉంది. అది నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గము. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ధూలే జిల్లాకు చెందిన సక్రి , షిర్‌పూర్ నియోజకవర్గాలు కూడా భాగంగా ఉన్నాయి. జిల్లాలో నాలుగు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అక్కల్‌కువా, షాహదా, నందుర్బార్ , నవాపూర్. నందుర్బార్ ప్రాథమికంగా ఆదివాసులుండే ప్రాంతం.