అక్కల చంద్రమౌళి
అక్కల చంద్రమౌళి తెలంగాణా రాష్ట్రానికి చెందిన కవి.
అక్కల చంద్రమౌళి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, సినిమా పాటల రచయిత. ఆయన 2013లో ‘గులాబీ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.
అక్కల చంద్రమౌళి | |
---|---|
జననం | 8 జూన్ 1983 |
వృత్తి | కవి, సినిమా పాటల రచయిత |
తల్లిదండ్రులు | అక్కల లచ్చన్న, రాజేశ్వరి |
జననం, విద్యాభాస్యం
మార్చుఅక్కల చంద్రమౌళి 8 జూన్ 1983న తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపూర్ గ్రామంలో అక్కల లచ్చన్న, రాజేశ్వరి దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు రామకృష్ణాపూర్ లో, హైదరాబాద్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి , ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ పూర్తి చేశాడు.[1]
సినీ జీవితం
మార్చుఅక్కల చంద్రమౌళి సింగరేణిలో కారుణ్య నియామకం ద్వారా తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చింది. ఆయన సినిమాలపై ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 2013లో ‘గులాబీ’ సినిమా ద్వారా పాటల రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పలు డాక్యూమెంటరీలకు పాటలు రాసాడు.
- చిత్రాలు-పాటలు
- గులాబీ (2013) - 1. శతమానంభవతి చరితల్లోనే మురిసే 2. సొగసు చీరలో నిశీధి వేళలో 3. ఇది కవి రాయని శ్లోకమే 4. మేఘమొదిలే మెరుపై కదిలే
- శివకాశీపురం (2017) - 1. ఇన్నాళ్లుగా నా కళ్లల్లో నువ్వే 2. బంతీపూలతో బండికట్టినానే 3. తొలివరమై రావా
- కారులో షికారుకెళ్తే (2017) - 1.హే దుమ్మేసేయ్ ఈలగొట్టి
- మెయిల్ (2021) 1.హే.. బొమ్మా బొరుసంటూ
- పరేషాన్ (2021) 1. సౌ సారా సౌ సారా చటక్కారా [2]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (4 September 2021). "సాహిత్య చంద్రుడు". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ Telangana Today (24 January 2021). "Mancherial lyricist hits high notes". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.