అక్కిరాజు హరగోపాల్
అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు.[1] ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై అలిపిరిలో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో చర్చలకు ఆహ్వానించిన సమయంలో అతను బయటికొచ్చాడు. అనంతరం తిరిగి అడవి బాట పట్టిన ఆర్కే పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో అతనికి బుల్లెట్ గాయం అయింది. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలం, జూలకల్లు గ్రామానికి చెందిన ఆర్కేపై పోలీస్ శాఖ గతంలో కోటి రూపాయల రివార్డు, అతనిపై ఏపీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా ప్రభుత్వాలు రూ.97 లక్షల రివార్డును ప్రకటించాయి.[2]
అక్కిరాజు హరగోపాల్ | |
---|---|
జననం | అక్కిరాజు హరగోపాల్ 1957 మార్చి 25 తుమృకోట గ్రామం, రెంటచింతల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 14 అక్టోబరు 2021 బీజాపూర్, ఛత్తీస్‌గఢ్ |
మరణ కారణం | అనారోగ్యం |
ఇతర పేర్లు | రామకృష్ణ (ఆర్కే) |
వృత్తి | మావోయిస్టు నేత , మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు |
భార్య / భర్త | శిరీష |
పిల్లలు | మున్నా(పృథ్వి) |
తల్లిదండ్రులు | సచ్చిదానందరావు, రాజ్యలక్ష్మి |
జననం, విద్యాభాస్యం
మార్చుఅక్కిరాజు హరగోపాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రెంటచింతల మండలం, తుమృకోట గ్రామంలో జన్మించాడు.అతను వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేశాడు.
జీవిత ప్రస్థానం
మార్చుఅక్కిరాజు హరగోపాల్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత 1978లో ఆర్కే పీపుల్స్ వార్ (మావోయిస్టు పార్టీ) సభ్యత్వం తీసుకొని 1986 వరకు కార్యకర్తగా పని చేశాడు. అతను 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా, 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా, 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2004 నుంచి పదేండ్లు ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ (ఏవోబీ) కార్యదర్శిగా పనిచేశాడు.అతను 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3]
మరణం
మార్చుఆర్కే కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2021, అక్టోబరు 14న దక్షిణ బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మృతి చెందాడని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించారు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత". ETV Bharat News. Retrieved 2021-10-14.
- ↑ Eenadu (15 October 2021). "Maoist Leader RK: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత". Archived from the original on 15 అక్టోబరు 2021. Retrieved 15 October 2021.
- ↑ BBC News తెలుగు (15 October 2021). "మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. అనారోగ్యంతో మరణించారని ప్రకటించిన పార్టీ". Archived from the original on 15 అక్టోబరు 2021. Retrieved 15 October 2021.
- ↑ vamshikrishna (2021-10-14). "Maoist RK : మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆర్కే మృతి". www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 2021-10-14.
- ↑ Namasthe Telangana (15 October 2021). "ఆర్కే మృతి వాస్తవమే.. మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన". Archived from the original on 15 అక్టోబరు 2021. Retrieved 15 October 2021.