తుమృకోట

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, రెంటచింతల మండలంలోని గ్రామం

తుమృకోట, పల్నాడు జిల్లా, రెంటచింతల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రెంటచింతల నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1557 ఇళ్లతో, 5926 జనాభాతో 2121 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2905, ఆడవారి సంఖ్య 3021. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 987 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 318. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589835.[1]

తుమృకోట
పటం
తుమృకోట is located in ఆంధ్రప్రదేశ్
తుమృకోట
తుమృకోట
అక్షాంశ రేఖాంశాలు: 16°33′9.0″N 79°33′11.9″E / 16.552500°N 79.553306°E / 16.552500; 79.553306
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలంరెంటచింతల
విస్తీర్ణం
21.21 కి.మీ2 (8.19 చ. మై)
జనాభా
 (2011)
5,926
 • జనసాంద్రత280/కి.మీ2 (720/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,905
 • స్త్రీలు3,021
 • లింగ నిష్పత్తి1,040
 • నివాసాలు1,557
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522421
2011 జనగణన కోడ్589835

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

ఒకప్పుడు తిమ్మరుసు ఈ గ్రామాన్ని పాలించాడు.అతని పేరు మీద ఈ ఊరికి తిమ్మరుసు కోట అని పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో ఆ పేరు తుమ్మర్కోడు, తుమ్మూరుకోట, తుమృకోటగా పరిణామం చెందింది.

సమీప మండలాలు

మార్చు

తూర్పున గురజాల మండలం, దక్షణాన దుర్గి మండలం, పశ్చిమాన మాచెర్ల మండలం, తూర్పున దాచేపల్లి మండలం.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి రెంటచింతలలో ఉంది. సమీప జూనియర్ కళాశాల రెంటచింతలలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

తుమృకోటలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 6 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఆరుగురు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

తుమృకోటలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (ఆంధ్రా బ్యాంకు) ఉంది. ఈ బ్యాంకు శాఖ, తుమృకోట గ్రామంతోపాటు, పాలువాయి, పశర్లపాడు, మల్లవరం గ్రామాలకు గూడా తన సేవలందించుచున్నది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. సహకార బ్యాంకువ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

తుమృకోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 714 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 142 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 51 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 35 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 1178 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 580 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 598 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

తుమృకోటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • కాలువలు: 250 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 348 హెక్టార్లు

తయారీ

మార్చు

తుమృకోటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి (అవరోహణ క్రమంలో) :

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, ప్రత్తి, మిరప

గ్రామ పంచాయతీ

మార్చు

కీ.శే.కొణకంచి నారాయణ:- ఇతను 2007 నుండి 2013 వరకు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసాడు. ఇతను 2017, జూలై-16న, 82 సంవత్సరాల వయస్సులో, హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుచూ మృతిచెందాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

గ్రామంలో చారిత్రక దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి.

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో 2016, నవంబరు-27వతేదీ కార్తీకమాసం, ఆదివారంనాడు రెండున్నర లక్షల రూపాయల దాతల ఆర్థిక సహకారంతో, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు వేకువఝాము నుండియే ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారి కళ్యాణం, అన్నాభిషేకం, హోమం ఏర్పాటు చేసారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [8]

శ్రీ రామాలయము

మార్చు

ఈ ఆలయం చాలా పురాతనమైనది.

శ్రీ బ్రహ్మంగారి దేవాలయo

మార్చు

ఈ ఆలయం నూతనంగా నిర్మించుచున్నారు.

శ్రీ వూర ముత్యాలమ్మ తల్లి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-23, శ్రావణమాసం, శనివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలు, వరుణదేవుడు కరుణించి, పాడిపంటలతో సంతోషంగా గడపాలని గ్రామస్థులు మొక్కుకున్నారు. శనివారం ఉదయం బోనాలు, రాత్రికి కుంకుమబండ్లు అత్యంత భక్తిశ్రద్ధలతో ఏర్పాటుచేసి, గ్రామ వీధులలో ఊరేగించారు. అనంతరం ముత్యాలమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఆదివారం రాత్రికి బలి కార్యక్రమం ఏర్పాటుచేసారు.

శ్రీ జనార్ధనస్వామివారి ఆలయం

మార్చు

దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయాన్ని 200 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పట్లో భక్తులు, స్వామివారికి నిత్య ధూప, దీప, నైవేద్యాలకు, వేడుకలకు, పూజారులకు, చాకిరి మాన్యాలకు 40 ఎకరాలు, దేవాదాయశాఖకు 40 ఎకరాలు విరాళంగా అందజేసినారు. ఆ భూములను 14 సంవత్సరాల క్రితం, ప్రజాసంఘాలు నామమాత్రపు కౌలుకే స్వాధీనం చేసుకున్నవి. ఆ కౌలుగూడా బకాయిలు పేౠకుపోవదంతో, పూజారులు ఆలయంలో వేడుకలు నిర్వహించకుండా పట్టణాలకు వలస పోయినారు. ఆలయం శిథిలావస్థకు చేరడం, భూములు పరాధీనం కావడం, ధూప, దీప, నైవేద్యాలకు కరువవడంతో, గ్రామంలోని భక్తులను కలచివేసింది. 2011లో శ్రీ బండ్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు సమావేశమై, జీర్ణోద్ధరణకు చేరుకున్న ఆలయాన్ని పునర్నిర్మించే సామర్థ్యం దేవాదాయశాఖకు లేనందువలన, భక్తుల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. గ్రామంలో ప్రతి భక్తుడు, ఎకరాలవారీగా విరాళాలు సమర్పించారు. గ్రామ కాయిదా సొమ్ము, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇచ్చే సొమ్ము, తుమృకోటలో జన్మించి ఇతర రాష్ట్రాలలో, దేశాలలో ఉంటున్నవారు, వివిధవర్గాలనుండి విరాళాలు సేకరించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. వెంటనే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. వారు ఒక సంవత్సరం తరువాత అనుమతి పత్రం ఇచ్చారు. దేవాదాయశాఖకు రు. 15 లక్షలు డిపాజిట్టు చేసి, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి, నిర్మాణం చేపట్టేటందుకు అధికారుల అంగీకారం పొందినారు. సుమారు 18 సెంట్ల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణపనులు జరుపుచున్నారు. జనార్ధనుడు, వేణుగోపాలస్వామి, గజలక్ష్మి లకు ప్రత్యేకంగా గర్భగుడి నిర్మించారు. 33 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవుతో మందిర నిర్మాణం గ్రానైటుతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుచునారు. కోటప్పకొండ దగ్గర లభ్యమయ్యే రాయితో రు. 76 లక్షల వ్యయంతో పనులు చేయించుచున్నారు. మాచవరం మండలం లోని జింకలపాలెం నుండి 42 అడుగుల ఎత్తయిన ధ్వజస్తంభాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం గోడల నిర్మాణ పనులు పూర్తిచేసారు. ఇంతవరకు ఒక కోటి రూపాయల వ్యయం అయినది. మరియొక 50 లక్షల రూపాయలతో దేవతామూర్తులను భక్తులు దర్శనం చేసుకునే విధంగా తయారు చేసారు.

నూతనంగా నిర్మించిన ఈ ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు, 2015.జూన్-2వ తేదీ మంగళవారం ప్రారంభించారు. నిత్యం హోమాలు, ప్రత్యేకపూజలు నిర్వహించ్చారు. ఆరవతేదీ శనివారం ఉదయం, గోదాదేవి, జనార్ధనస్వామి, రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి, ఆంజనేయుడు, గరుత్మంతుడు మొదలగు విగ్రహాలను, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో తిరునాళ్ళ వాతావరణం నెలకొన్నది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామములో, 7వ తేదీ ఆదివారంనాడు, రాష్ట్రస్థాయిలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం

మార్చు

ఈ గ్రామములో సమరసత, తిరుమల తిరుపతి దేవస్థానం, గ్రామస్థుల సహకారంతో ఈ ఆలయ నిర్మాణానికి, 2017, జూన్-20వతేదీ మంగళవారంనాడు భూమిపూజ నిర్వహించారు. తుమృకోటకు చెందిన శ్రీ కొణకంచి గురుప్రసాద్, గిరిజన కాలనీలోని ఐదు సెంట్ల స్థలాన్ని ఈ ఆలయ నిర్మాణానికి వితరణగా అందించారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

ఈ గ్రామంలోని ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,150. ఇందులో పురుషుల సంఖ్య 3,080, స్త్రీల సంఖ్య 3,070, గ్రామంలో నివాస గృహాలు 1,448 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 2,121 హెక్టారులు.

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=తుమృకోట&oldid=4256291" నుండి వెలికితీశారు