అగ్నిహోత్రం
అగ్నిహోత్రము ఒక హిందూ సాంప్రదాయము. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు, అగ్నిదేవుడిని ఆవాహన చేసి, ఆయనను సంతృప్తి పరచడానికి అగ్నిహోత్రము ఏర్పాటు చేస్తారు.
గృహంలో చేయడం వల్ల లాభాలుసవరించు
అగ్నిహోత్రంలో భాగంగా ఎండిన ఆవు పేడా, ఎండిన అరటి మొక్కలు, పనస, వేప వంటి కొమ్మలని తీసుకొని వేద మంత్రోచ్ఛాటనలతో కర్పూర హారతితో వెలిగిస్తారు. అందులో నెయ్యిలో నానబెట్టిన బియ్యాన్ని వేస్తారు. ఈ ప్రక్రియను అగ్నిహోత్రము అంటారు. ఇలా గృహస్థుడు చేయించుకోవటం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని కొంతమంది విశ్వాసం.
ఈ అగ్నిహోత్రము సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన చేయాలి. అగ్నిహోత్రం జరిగినంత సేపు అగ్నిహోత్రము వద్ద నిష్ఠగా మంత్రోచ్ఛాటన వింటూ కుటుంబ సభ్యలతా విధిగా ఉండాలి. అగ్నిహోత్రం పూర్తవ్వగానే వచ్చిన భస్మాన్ని నిత్యం పూస చేసే ముందు ధరించాలి. ఆ భస్మాన్ని ధరించడం మూలంగా ఏ కార్యములోనైన విజయం కలుగుతుందని ప్రజల విశ్వాసం.[1]
మూలాలుసవరించు
- ↑ "గృహంలో అగ్నిహోత్రం చేయటం వల్ల కలిగే ఫలం... - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-06-27.
బాహ్య లంకెలుసవరించు
- "Agnihothram for Healthy Life". www.youtube.com. Retrieved 2020-06-27.
- "Nitya Agnihotram by Sivananda Sastry". www.youtube.com. Retrieved 2020-06-27.
- "అగ్నిహోత్రం యొక్క విశిష్టత - AROGYAMASTHU". www.youtube.com. Retrieved 2020-06-27.
- "అగ్నిహోత్రం గురించి మీకు తెలియని రహస్యం,Brahmasri Samavedam Shanmukha Sarma,Bhakthi TV". www.youtube.com. Retrieved 2020-06-27.