కర్పూరం
కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము.[5] ఇది టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం.ఇది కాంఫర్ లారెల్ అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆసియా ఖండంలోనూ, ప్రధానంగా బోర్నియో, తైవాన్ లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. నీటిలో కరగదు. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ.
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
1,7,7-Trimethylbicyclo[2.2.1]heptan-2-one
| |||
Systematic IUPAC name
1,7,7-Trimethylbicyclo[2.2.1]heptan-2-one | |||
ఇతర పేర్లు
2-Bornanone; Bornan-2-one; 2-Camphanone; Formosa
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [76-22-2] | ||
పబ్ కెమ్ | 2537 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 200-945-0 | ||
డ్రగ్ బ్యాంకు | DB01744 | ||
కెగ్ | D00098 | ||
వైద్య విషయ శీర్షిక | Camphor | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:36773 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | EX1225000 | ||
ATC code | C01 | ||
SMILES | CC1(C)C2CCC1(C)C(=O)C2 | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 1907611 | ||
జి.మెలిన్ సూచిక | 83275 | ||
3DMet | B04729 | ||
ధర్మములు | |||
C10H16O | |||
మోలార్ ద్రవ్యరాశి | 152.24 g·mol−1 | ||
స్వరూపం | White, translucent crystals | ||
వాసన | fragrant and penetrating | ||
సాంద్రత | 0.992 g cm−3 | ||
ద్రవీభవన స్థానం | 175 నుండి 177 °C (347 నుండి 351 °F; 448 నుండి 450 K) | ||
బాష్పీభవన స్థానం | 209 °C (408 °F; 482 K) | ||
1.2 g dm−3 | |||
ద్రావణీయత in acetone | ~2500 g dm−3 | ||
ద్రావణీయత in acetic acid | ~2000 g dm−3 | ||
ద్రావణీయత in diethyl ether | ~2000 g dm−3 | ||
ద్రావణీయత in chloroform | ~1000 g dm−3 | ||
ద్రావణీయత in ethanol | ~1000 g dm−3 | ||
log P | 2.089 | ||
బాష్ప పీడనం | 4 mmHg (at 70 °C) | ||
Chiral rotation [α]D | +44.1° | ||
ప్రమాదాలు | |||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R11 R22 R36/37/38 | ||
S-పదబంధాలు | S16 S26 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
466 °C (871 °F; 739 K) | ||
విస్ఫోటక పరిమితులు | 0.6%-3.5%[3] | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
1310 mg/kg (oral, mouse)[4] | ||
LDLo (lowest published)
|
800 mg/kg (dog, oral) 2000 mg/kg (rabbit, oral)[4] | ||
LCLo (lowest published)
|
400 mg/m3 (mouse, 3 hr)[4] | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible)
|
TWA 2 mg/m3[3] | ||
REL (Recommended)
|
TWA 2 mg/m3[3] | ||
IDLH (Immediate danger)
|
200 mg/m3[3] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Related {{{label}}} | {{{value}}} | ||
సంబంధిత సమ్మేళనాలు
|
Camphene, Pinene, Borneol, Isoborneol, Camphorsulfonic acid | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నామోనం కాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబరులో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.Ganesh
రకాలు
మార్చుసాధారణంగా హారతికి ఉపయోగించే కర్పూరమే స్ఫురణకు వస్తుంది. తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు రకాలు ప్రసిద్ధం. కాని, కర్పూరంలో పదిహేను రకాలు (జాతులు) ఉన్నాయి. అవి: 1. ఘన సారం, 2. భీమసేనం, 3. ఈశావాసం, 4. ఉదయ భాస్కరం, 5. కమ్మ కర్పూరం, 6. ఘటికం, 7. తురు దాహం, 8. తుషారం, 9. హిమ రసం, 10. హారతి, 11. శుద్ధం, 12. హిక్కరి, 13. పోతాశ్రయం, 14. పోతాశం, 15. సితా భ్రం. ఇవన్నీ కపురం, కప్పురం మొదలైన పర్యాయ పదాలుగా కూడా వాడుకలో ఉన్నాయి.
పచ్చకర్పూరం
మార్చుకర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం
మార్చుటర్పెన్టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం
మార్చుసహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం
మార్చుఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం
మార్చుఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం
మార్చుఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం
మార్చుఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
మరికొన్ని కర్పూరాలు
మార్చుఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
కర్పూరం ఉపయోగాలు
మార్చుకర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. స్వభావము : మంగలకరం, శుభప్రధమైన కర్పూరం అనాదికాలం నుండి వినియోగంలో ఉంది . భారతదేశంలో అన్ని ప్రాంతాలవారు కర్పూరం శుభకార్యాలకు తప్పనిసరిగా వాడతారు . పరిమళాలను వెదజల్లే కర్పూరం ఆలయాలలో హరతి ఇవ్వడానికి వినియోగించడం చిరకాలం నుడి వస్తూఉంది. కర్పూరం ఆవిరి అయ్యే, మండే, జిగురుగా, ఆల్కహాల్ లో కరిగిపోయే, ద్రవంగా మారే, క్లోరోఫారంగా మారే గుణాలు కలిగిఉంటుంది . నీటిలో కొంతమేరకు కరుగుతుంది సువాసన ఇస్తుంది . కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒక టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్ధతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడం వల్ల అది నీటిపై గాలిలో ఉండడం వల్ల గాలిలోని ఆక్సిజన్ సహాయంతో ఇంధనం లాగా కర్పూరం మండగలదు. కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువ కాబట్టి నీటి చల్లదనం కర్పూరపు ముద్దపైన వెలుగుతున్న జ్వాలను చల్లబరచి అది ఆరిపోయేలా చేయలేదు. కర్పూరం పుట్టుక : ఇది ఒక వృక్షం నుండి వస్తుంది, భారీ వృక్షము ఇది . స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం .. చెట్టు కాండము, వేళ్ళు, చెక్కలు, ఆకులు, కొమ్మలు, విత్తనాల నుండి లభిస్తుంది . దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ". కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిలు (Turpentine oil) నుండి కుడా కర్పూరం తయారు చేస్తారు . సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు . వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది . . . పవిత్రంగా భావిస్తారు . కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి . కర్పూరం (C10H16O) ప్రగాఢమైన, తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది . ఉపయోగాలు :
- వంటకి ఉపయోగించే్ది—ఆహారపదార్ధాలు, తీపివస్తువులు ఘుమఘుమ లాడేందుకు కర్పూరం వినియోగిస్తారు .
- వంటలకు ఉపయోగించనిది—పూజలు, వివాహాది శుభకార్యాలలో హారతి ఇవ్వడానికి కర్పూరం వాడుతారు.
- వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి భారతదేశంలో కర్పూరం వాడుతున్నారు ... జ్వరము, కోరింతదగ్గు, ఆస్తమా, మానసికవ్యాధులు, కేన్సర్, ముత్రకోశసమస్యలు నయం చేయడానికి . స్త్రీ పురుష *జననేంద్రియాలను ఉత్తేజానికి ఉపయోగపడుతుంది .
- పరుగులు మందులు, చెడువాసనల నిర్మూలానికీ, ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడుతారు,
- బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్ములానికి, కర్పూం చెక్కలోని రసాయనాలు విరివిగా వాడుతారు .
- పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు,
- విక్స్ వేపరబ్ (vicks veporub), మెంతలితం-ఆయింట్మెంట్ లన్న్తి చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు .
- రక్తనాళాలలోని ప్రవాహాన్ని వృద్ధిపరిచి, హృదయ సంబంధించిన మందుల్లోనూ, దగ్గు శ్వాస కోశ సంబంధిత, కీళ్ళ నొప్పులు సంబంధిత మందులలో దీనిని వివిరిగా వాడుతారు .
- కర్పూరం పరిసర వాతావరణం శుభ్రంగా సువాసనలతో ఉంచుతుంది . కర్పూరం బిళ్ళలను, ఉండలను వాడుతారు .
- తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంట కొకసారి బాధితునికి తాగించండి. దీంతో తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
- కప్పునీటిలో కర్పూరం బిళ్లను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు. అరబకెట్ నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఫ్లోర్‌ను ... తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
దీనిని సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
- స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
- అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
- పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
- నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
- కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
- కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
- కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
- అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
- కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
- మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
- రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
- అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
- దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
- పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
- తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
- పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
- కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
- అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
- కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
- కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.
మూలాలు
మార్చు- ↑ The Merck Index, 7th edition, Merck & Co., Rahway, New Jersey, USA, 1960
- ↑ Handbook of Chemistry and Physics, CRC Press, Ann Arbor, Michigan, USA
- ↑ 3.0 3.1 3.2 3.3 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0096". National Institute for Occupational Safety and Health (NIOSH).
- ↑ 4.0 4.1 4.2 "Camphor (synthetic)". National Institute for Occupational Safety and Health (NIOSH). 4 December 2014. Retrieved 19 February 2015.
- ↑ Mann JC; Hobbs JB; Banthorpe DV; Harborne JB (1994). Natural products: their chemistry and biological significance. Harlow, Essex, England: Longman Scientific & Technical. pp. 309–11. ISBN 0-582-06009-5.