అగ్ని-1
అగ్ని-1, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన మధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణి. భారత సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీన్ని తయారుచేసారు. ఈ ఒకే దశ క్షిపణిని కార్గిల్ యుద్ధం తరువాత తయారు చేసారు. 250 కి.మీ. ల పృథ్వి-2, 2500 కి.మీ.ల అగ్ని-2 మధ్య గల పరిధి అంతరాన్ని పూరించేందుకు ఈ క్షిపణిని తయారు చేసారు. 2002 జనవరి 25 న దీన్ని తొలిసారిగా ప్రయోగించారు. వీలర్ ఐలండ్‌లోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుండి, రోడ్డు మొబైలు లాంచరు ద్వారా దీన్ని ప్రయోగించారు..[8]
అగ్ని-1 | |
---|---|
దస్త్రం:Agni-I launch.jpg | |
రకం | మధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | భారతదేశం |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | 2004[1]—present |
వాడేవారు | భారత సైనిక దళం |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) |
తయారీదారు | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ |
ఒక్కొక్కదాని వెల | ₹ 25-35 కోట్లు (INR) లేక $ 5.6-7.9 million (USD)[2] |
విశిష్టతలు | |
బరువు | 12,000 కి.గ్రా.[3][4][5] |
పొడవు | 15 మీ.[3][4][5] |
వ్యాసం | 1.0 మీ.[4][5] |
వార్‌హెడ్ | Strategic nuclear (15 kt to 250 kt), conventional HE-unitary, penetration, sub-munitions, incendiary or fuel air explosives |
ఇంజను | ఒకే దశ |
ఆపరేషను పరిధి | 700-1250 km [3][4][6] |
ఫ్లైట్ సీలింగు | 370 km[5] |
ఫ్లైటు ఎత్తు | ~ 200 km [6] |
వేగం | మ్యాక్ 7.5 [6] or 2.5 km/s (Agni-I)[4] |
గైడెన్స్ వ్యవస్థ | Ring Laser Gyro- INS (Inertial Navigation System), optionally augmented by GPS terminal guidance with possible radar scene correlation |
కచ్చితత్వం | 25 మీ. వర్తుల దోష పరిధి [7] |
లాంచి ప్లాట్‌ఫారం | 8 x 8 Tatra TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher |
చరిత్ర, అభివృద్ధి
మార్చుచాందీపూర్ నుండి 1989 లో అగ్ని-1 ను మొదటిసారిగా ప్రయోగించారు. 1,000 కి.గ్రా.ల సాంప్రదాయిక లేదా అణు వార్‌హెడ్‌ను అది మోసుకుపోగలదు.
అగ్ని-1 కి 700 – 1,250 కి.మీ. పరిధి ఉంది.[4][6] కనీస నిరోధ సామర్థ్యంలో అగ్ని-1 ఒక భాగమని భావిస్తారు.
అగ్ని-1 ఘన ఇంధన, ఒకటే దశ, రైలు రోడ్డు మొబైలు ద్వారా ప్రయోగించగల, మధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని-2 అంతకు ముందే అభివృద్ధి చెయ్యబడింది. DRDO 15 నెలల సమయంలో అగ్ని-1 ను అభివృద్ధి చేసింది.[9] MRV బాడీ-లిఫ్ట్ ఏరోడైనమిక్స్ దీనికి దిశా లోపాలను స్వయంగా సరిదిద్దుకునే సామర్థ్యాన్ని, థెర్మల్ స్ట్రెస్‌లను తగ్గించుకునే సామర్థ్యాన్నీ ఇస్తాయి. MRV లో ఉన్న వేగ నియంత్రణ పాకేజీ ఈ లాంచి ట్రాజెక్టరీ వేరియన్సులను సరిచేస్తుంది. అగ్ని-1, 15 మీ. పొడవుతో 12 టన్నుల బరువు కలిగి 1,000 కి.గ్రా. వార్‌హెడ్‌ను మోసుకు పోగలదు.[4][5] తక్కువ పేలోడుతో, కాంపోజైట్లతో తయారైన బాడీతో ఈ క్షిపణి 1,500 కి.మీ. దూరాన్ని చేరగలదని అంచనా.[6]
ఆపరేషన్ చరిత్ర
మార్చుభారత సైన్యం ఎప్పటికప్పుడు యూజరు పరీక్షలను నిర్వహిస్తూ ఉంటుంది. తన ఐబ్బందికి శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. వ్యూహాత్మక బలగాల కమాండ్ సాధారణంగా ఈ పరీక్షలు చేస్తుంది. DRDO ఇందు కవసరమైన లాజిస్టిక్ మద్దతు ఇస్తుంది.[10][11][12] 2007 అక్టోబరు 5 న మొదలైనప్పటి నుండి అనేక మార్లు ఈ పరీక్షలు జరిగాయి. 2015 నవంబరు 27 న ఓ పరీక్ష జరిగింది.[13] తరువాత 2016 మార్చి 14 న వీలర్ ఐలాండ్ లోని లాంచిపాడ్-4 నుండి మరో పరీక్షను నిర్వహించారు[14][15]
వాడుకదారులు
మార్చుసికందరాబాదులోని వ్యూహాత్మక బలగాల కమాండ్ నేతృత్వంలో ఉన్న 334 క్షిపణి గ్రూపు, అగ్ని-1 క్షిపణిని వాడుతుంది[7] [3][4][10]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Dikshit, Sandeep (5 July 2004). "Army's missile group to maintain Agni A-1". The Hindu. Archived from the original on 4 ఫిబ్రవరి 2015. Retrieved 4 February 2015.
- ↑ "Technical tune to Agni test before talks". Calcutta, India: The Telegraph. 30 August 2004. Archived from the original on 11 December 2007. Retrieved 2007-12-13.
- ↑ 3.0 3.1 3.2 3.3 "India successfully test-fires Agni I ballistic missile". Indian Express. Nov 25, 2010. Retrieved 19 October 2011.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 "India test-fires nuclear-capable Agni-I missile". The Times of India. Nov 25, 2010. Archived from the original on 2012-11-04. Retrieved 19 October 2011.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 "India successfully test-fired Agni-I". Asian Tribune. 5 July 2004. Archived from the original on 31 మే 2012. Retrieved 20 October 2011.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 "Nuclear-Capable Agni-1 Ballistic Missile's Range Can Be Extended To 1500 Km". Aa Me, In. 2012-11-28. Retrieved 2012-12-04.
- ↑ 7.0 7.1 "Agni-1". MissileThreat. Archived from the original on 2012-10-18. Retrieved 2012-12-04.
- ↑ T. S. Subramanian (2 February 2002). "The significance of Agni-I". Frontline. Retrieved 3 February 2015.
- ↑ Subramanian, T.S. (13 July 2012). "Agni-I a success". The Hindu. Chennai, India. Retrieved 28 July 2012.
- ↑ 10.0 10.1 Subramanian, T S (December 1, 2011). "Strategic Forces Command test fires Agni". The Hindu. Chennai, India. Retrieved 1 December 2011.
- ↑ "Agni 1 Missile Test Fired, Part of Army User Trials-India Defence Dated:25 Nov 2010". India-defence.com. Retrieved 2012-12-04.
- ↑ "Successful test-firing of Agni-I". Deccan Herald. 13 July 2012. Retrieved 13 July 2012.
- ↑ http://indiatoday.intoday.in/story/agni-i-nuclear-capable-missile-test-fired-successfully-in-odisha/1/532763.html
- ↑ "India successfully test-fires Agni-I ballistic missile". IBNLive. Archived from the original on 2016-03-15. Retrieved 2016-03-14.
- ↑ "India successfully test-fired Agni-I ballistic missile". Jagranjosh.com. Archived from the original on 2016-03-14. Retrieved 2016-03-14.