చాందీపూర్

ఒడిశాలోని ఒక పట్నం
చాందీపూర్ is located in Odisha
చాందీపూర్
చాందీపూర్
చాందీపూర్ (Odisha)

చాందీపూర్ ను చాందీపూర్-ఆన్-సీ అని కూడా అంటారు. ఒరిస్సా (ఒడిషా), బాలేశ్వర్ (బాలెసోర్) జిల్లాలోని ఓ చిన్న సముద్ర తీర రిసార్టు. బాలేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిమీ దూరంలో ఉంటుంది. 

చాందీపూర్ బీచిలో సూర్యాస్తమయం

చాందీపూర్‌కు ఒక విశిష్టత ఉంది - భారత్ తయారుచేసిన క్షిపణులు దాదాపుగా అన్నిటినీ పరీక్షించేది ఇక్కడే.

చాందీపూర్‌కు మరో విశిష్టత ఉంది - ఆటూ పోట్ల సమయాల్లో సముద్రం వెనక్కు వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆటు/పాటు సమయంలో సముద్రం 5 కి.మీ. వెనక్కి వెళ్తుంది. మళ్ళీ పోటు సమయంలో మామూలుగా వస్తుంది. అంటే, చూస్తూండగానే రోజుకు ఒకసారి సముద్రం అదృశ్యమై మళ్ళీ ప్రత్యక్షమౌతుందన్నమాట. దీనివల్ల ఈ బీచి జీవవైవిధ్యానికి ఆలవాలమైంది. బీచి దగ్గరలో మిర్జాపూర్ వద్ద బుద్ధ బలంగా నది సంగమం వద్ద గుర్రపునాడా పీత దొరుకుతుంది. ఇదొక చక్కని పిక్నిక్ స్థలం.  ఒరిస్సా పర్యాటక సంస్థ వారి పాంథనివాస్ ఒకటి ఇక్కడ ఉంది.

ఆటు/పాటు సమయంలో చాందీపూర్ బీచి

భౌగోళికం మార్చు

చాందీపూర్ 21°28′N 87°01′E / 21.47°N 87.02°E / 21.47; 87.02.[1] వద్ద ఉంది. సముద్రమట్టం నుండి దాని సగటు ఎత్తు 3 మీ. గ్రామ వైశాల్యం 51.33 ఎకరాలు.[2]

సాధారణ భారతీయ వాతావరణం మార్చు

వేసవిలో ఉష్ణోగ్రత 25-40 సెల్సియస్ డిగ్రీల దాకా ఉంటుంది. చాందీపూర్ సందర్శనకు నవంబరు-మార్చి సరైన సమయం.

సైన్యం మార్చు

భారత సైన్యపు సమీకృత పరీక్షా శ్రేణి -Integrated Test Range (ITR) ను చాందీపూర్‌కు దక్షిణంగా 70 కిమీ దూరంలో ఉన్న అబ్దుల్ కలాం ద్వీపం వద్ద (గతంలో దీన్ని వీలర్ ఐలాండ్ అనేవారు)  ITR ను స్థాపించారు. అనేక క్షిపణులను -ఆకాశ్, శౌర్య లతో సహా -ఇక్కడే పరీక్షించారు,[3] అగ్నిపృథ్వి బాలిస్టిక్  క్షిపణులు, బరాక్-8 క్షిపణి కూడా ఇక్కడే  పరీక్షించారు. .[4]

రవాణా సౌకర్యం మార్చు

బాలేశ్వర్ దాకా రైల్లో వెళ్ళి, అక్కడి నుండి బస్సు, ఆటో లేదా ట్యాక్సీ ద్వారా చాందీపూర్ చేరుకోవచ్చు. బాలేశ్వర్ నేషనల్ హైవే 5 పై ఉంది.[5]

ఇక్కడ ప్రధానంగా చూడదగ్గ స్థలాలు: దేవ్‌కుండ్ జలపాతం, పంచలింగేశ్వర్, క్షీరచోర గోపీనాథ దేవాలయం, చాందీపూర్ బీచి, నీలగిరి జగన్నాథ దేవాలయం.

ఆహారం మార్చు

అనేక రకాల సముద్రాహారం ఇక్కడ దొరుకుతుంది. చేప ఇక్కడ బాగా చవక. ఒరియా బెంగాలీ వంటకాలు బాగా దొరుకుతాయి.

మూలాలు వనరులు మార్చు

  1. Falling Rain Genomics, Inc - Chandipur
  2. "Subalaya Town Area Chart (archive)". Archived from the original on 2009-04-11. Retrieved 2009-04-11.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-17. Retrieved 2016-07-23.
  4. "Barak-8 missile test-fired from Chandipur". Archived from the original on 2016-07-24. Retrieved 2016-07-23.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-12. Retrieved 2016-07-23.