భారత్ డైనమిక్స్ లిమిటెడ్
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారతదేశంలో ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలను తయారు చేసే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. 1970 లో దీన్ని హైదరాబాదులో గైడెడ్ ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రంగా స్థాపించారు.[4] భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డిఆర్‌డిఓ, అంతరిక్ష పరిశ్రమల నుండి ఇంజనీర్లను సమీకరించి బిడిఎల్‌ను స్థాపించారు. మొదటి తరం ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి - ఫ్రెంచ్ ఎస్ఎస్ 11 బి 1 తో బిడిఎల్ ఉత్పత్తి మొదలు పెట్టింది. భారత ప్రభుత్వం ఫ్రెంచి ఏరోస్పేషియేల్‌తో కుదుర్చుకున్న లైసెన్సు ఒప్పందంలో భాగంగా దీన్ని తయారు చేసారు. బిడిఎల్ కు మూడు ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. ఇవి తెలంగాణ లోని కంచన్‌బాగ్, భానూరు, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం.
రకం | Public Sector Undertaking |
---|---|
పరిశ్రమ | Defence |
స్థాపన | 1970 |
ప్రధాన కార్యాలయం | Bharat Dynamics Limited Corporate Office, Financial District, Nanakramguda, Hyderabad, Telangana - 500032, India |
సేవ చేసే ప్రాంతము | India |
కీలక వ్యక్తులు | Commodore Siddharth Mishra (Chairman & MD) |
రెవెన్యూ | ₹3,095.20 crore (US$390 million) (2020)[1] |
₹2,828.81 crore (US$350 million) (2020)[1] | |
₹1,793.83 crore (US$220 million) (2020)[1] | |
Total assets | ₹5,468.41 crore (US$680 million) (2019)[2] |
Total equity | ₹2,268.54 crore (US$280 million) (2019)[2] |
యజమాని | Government of India (74.93%) [3] |
ఉద్యోగుల సంఖ్య | 3,030 (March 2019) [2] |
మాతృ సంస్థ | Ministry of Defence, Government of India |
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీపట్నంలో ఒకటి, మహారాష్ట్రలోని అమరావతి వద్ద మరొకటి కొత్త యూనిట్లను స్థాపించాలని బిడిఎల్ సంకల్పించింది.
చరిత్ర
మార్చుఇంటిగ్రేటెడ్ గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (ఐజిఎండిపి) ద్వారా భారతదేశం స్వదేశీ క్షిపణులను అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పుడు బిడిఎల్‌ను ప్రధాన ఉత్పత్తి సంస్థగా గుర్తించారు. భారతదేశపు మొట్టమొదటి నేల నుండి నేల పైకి ప్రయోగించే పేథ్వి క్షిపణిని బిడిఎల్ తయారు చేసింది. బిడిఎల్ పృథ్వీని త్రివిధ దళాలకూ సరఫరా చేసింది. డిఆర్‌డివో వంటి సంస్థల సాంకేతిక సహకారంతో బిడిఎల్, అండర్ వాటర్ ఆయుధ వ్యవస్థలు, గాలి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణుల ఉత్పత్తిని, సంబంధిత అనుబంధ పరికరాల ఉత్పత్తిని కూడా చేపట్టింది.
ఉత్పత్తులు, సేవలు
మార్చుస్వదేశీ క్షిపణులు
మార్చుభారతదేశం అభివృద్ధి చేసిన క్షిపణుల ఉత్పత్తికి నోడల్ ఏజెన్సీ బిడిఎల్. బిడిఎల్ ఉత్పత్తి చేసిన మొట్టమొదటి క్షిపణి పృథ్వీ క్షిపణి . [5]
బిడిఎల్ భారత సాయుధ దళాల కోసం అనేక క్షిపణులను తయారు చేస్తోంది. వాటిలో కొన్ని ప్రముఖ ఉత్పత్తులు:
1998 లో, BDL నిర్మించిన అగ్ని- 1 ని భారత సాయుధ దళాలలో మోహరించారు. బిడిఎల్ భారత సాయుధ దళాల కోసం ఇతర క్షిపణులను, వ్యవస్థలను కూడా తయారు చేస్తుంది
ఆకాశ్ మధ్యమ-పరిధి, నేల నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి. దీన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) తయారు చేసింది. ఇందులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కూడా పాలుపంచుకున్నాయి. [6] [7] ఈ క్షిపణి వ్యవస్థ 30 కి.మీ. దూరాన, 18,000 మీ. ఎత్తున ఉన్న విమానాలను ఛేదించగలదు. [8] శకలాలతో కూర్చి తయారు చేసిన వార్‌హెడ్ కలిగిన ఈ క్షిపణికి విమానాలను, బాలిస్టిక్ క్షిపణుల వార్‌హెడ్‌లనూ నాశనం చేసే సామర్థ్యం ఉంది. [9] [10] దీన్ని భారత సైన్యం, వైమానిక దళాల్లో మోహరించారు.
- అధునాతన తేలికపాటి టార్పెడో [11]
ఓడ, హెలికాప్టరు, జలాంతర్గామిల నుండి దీన్ని ప్రయోగించవచ్చు
- రక్షణాత్మక వ్యవస్థలు (కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్స్ - సిఎమ్‌డిఎస్)
నేలపై నుండి, గాల్లోనుండీ ప్రయోగించిన శత్రు క్షిపణుల నుండి విమానాలను రక్షించుకునేందుకు తయారు చేసిన వ్యవస్థ ఇది. గాల్లో జ్వాలలను రగిలిస్తూ శత్రు క్షిపణుల దృష్టిని విమానాల నుండి మళ్ళించి వాటిని తికమక పెట్టే వ్యవస్థ ఇది.
- మిలన్ 2 టి
ఇది రెండవ తరం, సెమీ ఆటోమేటిక్, గొట్టం ద్వారా ప్రయోగించ గల, టాండెమ్ వార్‌హెడ్‌తో కూడిన, ఆప్టికల్‌గా ట్రాక్ చేసే క్షిపణి.
- కాంకర్స్ - ఎమ్
ఇది రెండవ తరం, సెమీ ఆటోమేటిక్, టాంకు విధ్వంసక, ట్యూబ్ లాంచ్, ఆప్టికల్ ట్రాక్, వైర్ గైడెడ్ క్షిపణి. ఇది 75 నుండి 4000 మీటర్ల పరిధిలో పేలుడు పదార్థాల రియాక్టివ్ ఆర్మోర్స్‌తో కదిలే, స్థిరమైన సాయుధ లక్ష్యాలను నాశనం చేయడానికి రూపొందించబడింది.
- ఇన్వార్
ఇన్వార్ అనేది టి -90 ట్యాంకు పేల్చే ఆయుధం. ఈ క్షిపణిలో సెమీ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. పేలుడు రియాక్టివ్ కవచాన్ని ఛేదించడానికి రూపొందించిన టాండెమ్ వార్‌హెడ్ కలిగిన ఈ క్షిపణి జామింగు నిరోధక శక్తి కలిగినది. నిశ్చలంగా ఉన్న లక్ష్యాలనే కాక, 70 కి.మీ/గం వేగంతో కదిలే లక్ష్యాలను కూడా ఈ అయుధం ఛేదించ గలదు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Financial Results 31.03.2020 Data from BSE Site".
- ↑ 2.0 2.1 2.2 "Balance Sheet 31.03.2019".
- ↑ "Latest Shareholding Pattern - Bharat Dynamics Ltd". trendlyne.com. Retrieved 2020-08-12.
- ↑ "Bharat Dynamics Limited". Bdl.ap.nic.in. Archived from the original on 30 డిసెంబరు 2010. Retrieved 20 అక్టోబరు 2019.
- ↑ "Defence test-fires two Prithvi-2 missiles in quick succession". The Hindu Business Line. 13 October 2009. Retrieved 22 December 2010.
- ↑ "AKASH AIR DEFENSE WEAPON SYSTEM". Archived from the original on 2008-01-15. Retrieved 2019-10-20.
- ↑ Journal of Electronic Defense Staff (2004). "Guided Threat Systems". International Electronic Countermeasures Handbook. Artech House. p. 115. ISBN 1-58053-898-3.
- ↑ Asian tribune: Upgraded version of ‘Akash’ test fired; By Hemanta Kumar Rout[dead link]
- ↑ http://news.biharprabha.com/2012/05/india-successfully-tests-medium-range-akash-missile/ India successfully tests medium Range Akash missile
- ↑ http://articles.timesofindia.indiatimes.com/2007-12-13/india/27973517_1_akash-missile-nuclear-capable-multi-target-missile Archived 2012-11-07 at the Wayback Machine Nuclear-capable Akash missile test fired
- ↑ "Bharat Dynamics Limited". ap.nic.in. Archived from the original on 2009-07-27. Retrieved 2019-10-20.