ప్రపంచ దేశాలన్నిటిలో అతి శక్తివంతమైన దేశాలను అగ్ర రాజ్యాలు అంటారు. చరిత్రలో ఈ పదం 1945-1991 మధ్య అమెరికా, సోవియట్ యూనియన్ లను, ఆ తరువాతి కాలంలో కేవలం అమెరికాను సూచించడానికి మాత్రమే ఉపయోగించారు.

జెనీవా, స్విట్జర్లాండ్‌లో 1985 నవంబరు 19 న జరిగిన మొదటి అగ్ర రాజ్యాల శిఖరాగ్ర సమావేశంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియట్ ప్రధాన కార్యదర్శి మిఖాయిల్ గోర్బాచెవ్, సమావేశమైనప్పటి దృశ్యచిత్రం

రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తూనే 1945 లో ఐక్య రాజ్య సమితి ఏర్పడింది. ఈ సమితి భద్రతా మండలిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలుగజేయబడింది. ఇదే కాక నిర్ణయ నిరోధ హక్కు(వీటో) కూడా పొందిన ఈ 5 దేశాలు - అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు. అనేక ప్రపంచ దేశాలతో పాటు వీటిలో కూడా బ్రిటన్,ఫ్రాన్స్ లు అమెరికా వైపు, చైనా మాత్రం సోవియట్ యూనియన్ వైపు మొగ్గుజూపేవి. ఈ విధంగా అమెరికా రష్యా ల మధ్య ప్రచ్ఛన్నంగా శీతల సమరం రగులుతూ ఉండేది.

1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఆ స్థానంలో రష్యా భద్రతా మండలి శాశ్వత సభ్యురాలైంది. క్రమేణా ఆర్థికవ్యవస్థ పతనమౌతూ వచ్చిన రష్యా అగ్ర రాజ్యంగా తన స్థానాన్ని కోల్పోవడంతో, ఏకైక అగ్ర రాజ్యంగా అమెరికా ఎదిగింది.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు