అజలాపురం జలపాతం

అజలాపురం జలపాతం, నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం అజలాపురంలో ఈ జలపాతం ఉంది. [1]

రాచకొండ ముఖద్వారం

ప్రదేశం మార్చు

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కేంద్రానికి మర్రిగూడ మండలంలోని అజలాపురం గ్రామం ఉంది. జిల్లా కేంద్రం నుంచి అజలాపురం గ్రామానికి వాహన సౌకర్యం ఉంది. అజలాపురం గ్రామం నుంచి రెండు కి.మీ. వెళితే రాచకొండ గుట్టలకు ఆనుకొని సహజ సిద్ధంగా అజలాపురం జలపాతం ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 కి.మీ.. హైదరాబాద్‌ నుండి 50 కి.మీ. దూరంలో ఉంది. చుట్టూరా కొండలు, గుట్టలతో పాటు పచ్చనిచెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచిపెడతాడతాయి. ఇక్కడి చల్లటి, ప్రశాంతమైన వాతావరణంలో బండరాళ్లపై జారిపడుతున్న ఆ నీటి సవ్వడి పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. చక్కటి ప్రకృతి అందాలు కలిగిన ఈ ప్రాంతం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.[2]

పర్యాటకుల సందడి మార్చు

ఎడాదిలో ఆరుమాసాల పాటు వచ్చే ఈ జలపాతాన్ని చూసేందుకు అనునిత్యం పర్యాటకులు వస్తుంటారు. మర్రిగూడ పరిసర ప్రాంతాల నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల నుండి కూడా నిత్యం వందలమంది పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు.బుగ్గలో జలపాతంతోపాటు విశాలమైన ఎత్తైన కొండలు నిత్యం పచ్చదనాన్ని పరుచుకుని ఉండడంతో చూపరులకు కనువిందు కలగచేస్తాయి. ఈ వాటర్‌పాల్స్‌ దగ్గరకు వెళ్లాలంటే సుమారు రెండు కి.మీ. వరకూ కాలినడకన ప్రయాణం చేయాల్సిందే.[3]

మూలాలు మార్చు

  1. అజలాపురం జలపాతం. "అజలాపురం జలపాతం". నమస్తే తెలంగాణ. Archived from the original on 10 జూలై 2017. Retrieved 9 September 2017.
  2. Reporter, Staff (2014-09-05). "Spring near temple a crowd-puller". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-11.
  3. "అజలాపురం బుగ్గ అందాలు అదరహో | రీతి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-05-11.[permanent dead link]

వెలుపలి లంకెలు మార్చు