అజ్జమ్ విహారనౌక 2013
అజ్జమ్ అనేది ఒక ప్రైవేట్ నావ. ఇది లర్సనే యాచ్ ద్వారా ఏప్రిల్ 5, 2013 న నిర్మింపబడి ప్రారంభింపబడింది. ఈ నావ ప్రపంచ నావ లన్నింటిలో అతి పెద్దది. దీని పొడవు 180 మీటర్లు (590 అడుగులు) గా ఉండి ప్రపంచ నావలన్నింటిలో అతిపెద్దదిగా నిలిచింది.[1] ఇది 20.8 మీటర్లు (68'4") బీమ్, 4.3 మీటర్లు (14'1") షాలో డ్రాప్ట్ కలిగి యుంటుంది.[2] ఇది రెండు ఫుట్‌బాల్ ఫీల్డ్ ల విస్తీర్ణం కలిగి యుంటుంది.
నిర్మాణం
మార్చుఈ మహా నావ నిర్మాణానికి ఇంజనీర్ ముబారక్ సాద్ అల్ అహబాబి అజామ్ నాయకత్వం వహించాడు. దీని సాంకేతిక ఇంజనీరింగ్ ను లర్సన్ ద్వారా, బయటి డిజైన్ ను నౌతా యాచ్‌ల సంస్థ, అంతర్గత డిజైన్ను క్రిస్టోఫీ కెయోనీ చేశారు. ఇంజనీరింగ్ చేసిన ఒక సంవత్సరం తరువాత ఈ సూపర్ యాచ్ నిర్మాణానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఇది అత్యున్నత విహారనౌకల నిర్మాణంలో ఒక రికార్డు సమయం. ఈ నావ విలాసవంతమైన, అధునాతన వసతి కల్పించే ముఖ్య లక్షణాలు కలిగి మధ్య వెచ్చని, లోతు లేని నీటిలో అధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది.[3]
లక్షణాలు
మార్చుఈ నావ యొక్క అనేక యితర లక్షణాలలో ఒకటి దీని ముఖ్య సలైన్ 29 మీటర్ల పొడవు, దీని బీం 18 మీటర్ల పొడవు కలిగి పిల్లర్స్ లేకుండా ఓపెన్ గా ఉంది. ఇది 30 నాట్ల కంటే ఎక్కువ ప్రయాణించుటకు వీలుగా నాలుగు పంపు-జెట్ లు [4] ద్వారా 70 MW (94,000 hp) శక్తి ఉత్పాదనకు అవసరమైన రెండు గ్యాస్ టర్బైన్లు, రెండు డీజిల్ ఇంజిన్ల కలయికతో యేర్పాటయ్యింది.[5] ఈ నావ యజమాని ఎవరో తెలియదు, కానీ మధ్య తూర్పు ప్రాంతానికి చెందిందని ఊహించబడింది
విశిష్టతలు.
మార్చుదీనిలో దిగువ వివరింపబడిన విశిష్టతలుఉన్నయి.[6]
- దీని తయారీకి 592 మిలియన్ల డాలర్లు ఖర్చయింది. అంటే సుమారు 3228 కోట్ల రూపాయలు.
- దీని శక్తి 84000 హార్స్ పవర్కి సమానం. అంటే గంటకు 55 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
- బులెట్ ఫ్రూఫ్ అద్దాలు, లేజర్ వ్యవస్థతో ఆధునిక రక్షణ యేర్పాట్లు ఉన్నాయి.
- దీంట్లో ఏకంగా పదిలక్షల లీటర్ల ఇంధనాన్ని నింపవచ్చు.
- దీని నిర్వహణకు 50 మంది సిబ్బంది అవసరమవుతారు.
- దీని నమూనా రూపొందించటానికి ఇంజనీర్లకు యేడాది పడితే, నిర్మించడానికి మూడేళ్ళు పట్టింది.
- దీని బరువు 14000 టన్నులు.
- దీని పొడవు 590 అడుగులు, వెడల్పు 68 అడుగులు, ఎత్తు నాలుగు అంతస్తుల భవనం అంత.
మూలాలు
మార్చు- ↑ Daniel Fisher (2013-04-05). "German Shipyard Launches World's Largest Private Yacht At 591 Feet". Forbes.
- ↑ Megayacht News - Azzam, World’s Largest Yacht, Reappears at Lürssen
- ↑ "More details released on 180 metre Lürssen superyacht Azzam". Superyacht Times. 5 April 2013. Archived from the original on 22 నవంబరు 2015. Retrieved 10 April 2013.
- ↑ International Business Times - Azzam Mega Yacht, Built By Lürssen, Snatches Title Of 'Largest Motor Yacht In The World'
- ↑ "Nauta Yachts comments on their design for superyacht Azzam". SuperYacht Times. 9 April 2013. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 10 April 2013.
- ↑ "ఈ నౌక ప్రత్యేకతల గూర్చి ఈనాడు లో వ్యాసం". Archived from the original on 2013-06-27. Retrieved 2013-07-02.