అటవీ నిర్మూలన
అటవీ నిర్మూలన అంటే అడవుల్లో ఉండే చెట్లను తొలగించి ఆ భూమిని వేరే అవసరాలకు వాడటం.[1] అటవీ నిర్మూలనలో అటవీ భూమిని పొలాలు, గడ్డిబీడులు లేదా పట్టణ వినియోగంగా మార్చవచ్చు. ప్రస్తుతం భూ ఉపరితలంలో దాదాపు 31% అడవులతో కప్పబడి ఉంది.[2] వ్యవసాయం విస్తరించడానికి ముందు ఉన్న అటవీ విస్తీర్ణం కంటే ఇది మూడింట ఒక వంతు తక్కువ. ఆ నష్టంలో సగం గత శతాబ్దంలో సంభవించింది.[3] సుమారు బంగ్లాదేశ్ దేశమంత పరిమాణంలో ఉన్న 1.5 నుండి 1.8 కోట్ల హెక్టార్ల అడవులు ప్రతి సంవత్సరం నాశనం అవుతున్నాయి. సగటున ప్రతి నిమిషానికి 2,400 చెట్లు నరికివేయబడుతున్నాయి.[4] ఉష్ణమండలంలో అటవీ నిర్మూలన పరిధికి సంబంధించి అంచనాలు విస్తృతంగా మారుతూ ఉంటాయి. 2019లో, మొత్తం వృక్షాల నష్టంలో దాదాపు మూడింట ఒక వంతు లేదా 3.8 మిలియన్ హెక్టార్లు తేమతో కూడిన ఉష్ణమండల ప్రాధమిక అడవులలో సంభవించాయి. ఈ వర్షారణ్య ప్రాంతాలు జీవవైవిధ్యం, కార్బన్ నిల్వకు ప్రధానమైనవి.
చాలా వరకు అటవీ నిర్మూలనకు ప్రత్యక్ష కారణం వ్యవసాయం. 2018లో 80% కంటే ఎక్కువ అటవీ నిర్మూలన వ్యవసాయానికి కారణమైంది. కాఫీ, పామాయిల్, రబ్బరు, ఇంకా అనేక ఇతర ప్రసిద్ధ ఉత్పత్తుల కోసం అడవులు తోటలుగా మార్చబడుతున్నాయి. పశువుల మేత కూడా అటవీ నిర్మూలనకు దారితీస్తుంది. కలప పరిశ్రమ, పట్టణీకరణ ఇంకా మైనింగ్ ఇతర కారణాలు. వాతావరణ మార్పుల ప్రభావాలు అడవి మంటలు పెరగడానికి మరొక కారణం.
మూలాలు
మార్చు- ↑ SAFnet Dictionary|Definition For [deforestation] Archived 25 జూలై 2011 at the Wayback Machine. Dictionary of forestry.org (29 July 2008). Retrieved 15 May 2011.
- ↑ Deforestation|Threats|WWF. Worldwildlife.org. Retrieved 13 November 2016.
- ↑ Ritchie, Hannah; Roser, Max (2021-02-09). "Forests and Deforestation". Our World in Data.
- ↑ "On Water". European Investment Bank (in ఇంగ్లీష్). Retrieved 2020-10-13.