అట్లీ ఒక తమిళ సినిమా దర్శకుడు,ఇతని పేరు అరుణ్ కుమార్ ,అట్లీగా అందరికీ సుపరిచితుడు.ఇతను 21 సెప్టెంబర్ 1986 న జన్మించారు.ఇతను ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ వద్ద ఎంథిరన్(2010), నన్భన్(2012) చిత్రాలకు సహాయ దర్శకుడి గా చేస్తూ తన సినీ జీవితం ప్రారంభించాడు.ఇతను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన రాజా రాణి కి మొదటిసారి దర్శకత్వం వహించి ప్రసిద్ది చెందాడు.ఇందుకు గాను ఇతనికి విజయ్ అవార్డ్ లభించింది.దీనితో ఉత్తమ నూతన దర్శకుడి గా,స్క్రీన్ ప్లే రచయిత గా పేరు ప్రఖ్యాతులు పొందాడు.ప్రముఖ హీరో విజయ్ తో చేసిన తేరి (2016) , మెర్సల్ (2017) బిగిల్ (2019),మూడు చిత్రాలు విజయం సాధించడం తో హ్యాట్రిక్ సాధించాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో పాన్ ఇండియా సినిమా జవాన్ కు దర్శకత్వం వహించాడు.[1]

అట్లీ
8వ విజయ్ అవార్డ్స్, 2014లో అట్లీ
జననం
అరుణ్ కుమార్

(1986-09-21)1986 సెప్టెంబరు 21
మదురై, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
జీవిత భాగస్వామికృష్ణ ప్రియ

కెరీర్

మార్చు

ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ వద్ద ఎంథిరన్(2010), నన్భన్(2012) చిత్రాలకు సహాయ దర్శకుడి గా చేస్తూ తన సినీ జీవితం ప్రారంభించాడు.రాజా రాణి చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఏఆర్ మురుగదాస్ నిర్మించారు ఈ చిత్రంలో నటీనటులు ఆర్య , జై , నయనతార , నజ్రియా నజీమ్,సత్యరాజ్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం. రాజా రాణి నాలుగు వారాల్లోనే దక్షిణ భారత బాక్సాఫీస్ నుండి 500 మిలియన్లకు పైగా సంపాదించింది. ఈ చిత్రానికి ఉత్తమ నూతన దర్శకుడి గా విజయ్ అవార్డ్ అందుకున్నాడు

అతను ఆపిల్ ప్రొడక్షన్ కోసం ఏ అనే పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి తన మొదటి చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాడు ; ఈ చిత్రం సంగిలి బుంగిలి కధవ తోరే , జీవా , శ్రీదివ్య , సూరి నటించి , ఈ కే రాధ రచించి దర్శకత్వం వహించిన హారర్ కామెడీ చిత్రం.

వ్యక్తిగత జీవితం

మార్చు

అట్లీ నటి కృష్ణ ప్రియను 9 నవంబర్ 2014న వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ 2023 జనవరి 31న కుమారుడు జన్మించాడు.[2]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం శీర్షిక దర్శకుడు రచయిత నిర్మాత భాష గమనికలు
2013 రాజా రాణి అవును అవును కాదు తమిళం
2016 తేరి అవును అవును కాదు తమిళం
2017 సంగిలి బుంగిలి కధవ తోరే కాదు కాదు అవును తమిళం
2017 మెర్సల్ అవును అవును కాదు తమిళం సహ రచయిత : కె వి విజయేంద్ర ప్రసాద్
2019 బిగిల్ అవును అవును కాదు తమిళం విజయ్ తో మూడో చిత్రం
2020 అంధఘారం కాదు కాదు అవును తమిళం
2023 జవాన్ అవును అవును కాదు హిందీ
2023 దళపతి 68 అవును అవును కాదు తమిళం విజయ్ తో నాల్గవ చిత్రం

మూలాలు

మార్చు
  1. Eenadu (8 September 2023). "అట్లీ.. అన్నీ హిట్లే.. అక్కడా.. ఇక్కడా." Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.
  2. Namasthe Telangana (31 January 2023). "తండ్రి అయిన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అట్లీ&oldid=4322919" నుండి వెలికితీశారు