విజయ్ (నటుడు)

భారతీయ నటుడు, గాయకుడు

జోసెఫ్ విజయ్[2][3] (వృత్తి పరంగా"విజయ్") భారతీయ సినిమా నటుడు, నేపథ్యగాయకుడు. ఇతను ప్రధానంగా తమిళ సినిమాలలో నటిస్తాడు.[4] అభిమానులు, మీడియా ఇతనిని దళపతి అనే పేరుతో పిలుస్తారు.[5][6][7] విజయ్ చెన్నైలో ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ దంపతులకు జన్మిచాడు. ఆయన చిత్ర పరిశ్రమలో బాలనటునిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలలో "వెట్రి" (1984) నుండి ఇతు ఎంగల్ నీతి (1988) వరకు నటించాడు. తన యుక్త వయస్సులో తన తండ్రి దర్శకత్వంలోని "నాలయ తీర్పు" (1992) లో నటునిగా ప్రవేశించాడు కానీ తన మొదటి విజయవంతమైన సినిమా 1996లో విడుదలైన "పూవె ఉనక్కాగ". ఈ చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించాడు.[8] యిప్పటి వరకు ఆయన 61 చిత్రాలలో నటునిగా నటించాడు. ఆయన మూడు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్సు, ఒక కాస్మోపోలిటన్ పురస్కారం, ఎనిమిది విజయ్ పురస్కారాలు, మూడు ఎడిసన్ పురస్కారాలు, రెండు వికటన్ పురస్కారాలు అందుకున్నాడు. యుకె జాతీయ అవార్డులకు నామినేట్ చేయబడ్డాడు.[9] ఆయన ఇప్పటి వరకు 32 పాటలను పాడాడు. 2024 లో తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.

విజయ్
పులి ఆడియో విడుదలలో విజయ్
జననం
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్

(1974-06-22) 1974 జూన్ 22 (వయసు 50)[1]
మద్రాసు, తమిళనాడు, భారతదేశం (ప్రస్తుతం చెన్నై)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థలయోలా కళాశాల, చెన్నై
వృత్తిసినిమా నటుడు, నేపధ్య్తగాయకుడు
క్రియాశీల సంవత్సరాలు
  • 1984–1988 (బాలనటుడు)
  • 1992–ప్రస్తుతం (కథానాయకుడు)
జీవిత భాగస్వామి
  • సంగీతా సోర్నలింగం
(1999–ప్రస్తుతం)
పిల్లలు2, దివ్యా షాష (కుమార్తె),
జేసన్‌ సంజయ్‌ (కుమారుడు)
తల్లిదండ్రులు
బంధువులువిక్రాంత్ (కజిన్)
విరాజ్ (కజిన్)

ప్రారంభ జీవితం

మార్చు

విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభ చంద్రశేఖర్ సినిమా నేపథ్యగాయని, కర్ణాటక సంగీత విద్వాంసులు. అతనికి విద్య అనే సోదరి ఉంది. ఆమె రెండేళ్ల ప్రాయంలో మరణించింది. సోదరి మరణం విజయ్ పై ప్రభావం చూపింది. తన తల్లి చెప్పిన కథనం ప్రకారం బాల్యంలో విజయ్ చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవాడు. తన సోదరి మరణం తరువాత చురుకుదనం తగ్గింది.[10] తన సోదరి విద్య యొక్క కథను 2005లో సుక్రన్ అనే చిత్రం ద్వారా తెరకెక్కించాడు.[11]

ఆయన తన బాల్యం చెన్నైలో గడిపాడు. ప్రారంభ విద్యను కోడంబాక్కం లోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తిచేసాడు.[12] తరువాత బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు.[13] లయోలా కళాశాల నుండి విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీని పూర్తిచేసాడు. ఆయన నటనపై ఆసక్తిని కనవరచేవాడు.[10]

విజయ్ 1999 ఆగస్టు 25 న సంగీత స్వర్ణలింగం అనే అమ్మాయిని హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో వివాహమాడాడు.[14][15] వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జాసన్ సంజయ్ 2000లో లండన్ లో జన్మించాడు.[16] [17] కుమార్తె దివ్యా షాష 2005 లో చెన్నైలోజన్మించింది.[18] తన కుమారుడు జాసన్ సంజయ్ 2009 లో విడుదలైన "వెట్టైకారణ్" చిత్రంలో తన ఆయనతో పాటు నటించాడు. కుమార్తె 2016 లో విడుదలైన తేరీ చిత్రంలో చిన్నపాత్రలో దర్శనమిచ్చింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు

రాజకీయ జీవితం

మార్చు

విజయ్ 2 ఫిబ్రవరి 2024న తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించాడు.[20][21]

మూలాలు

మార్చు
  1. "Exclusive biography of @actorvijay and on his life", filmibeat.com; accessed 31 July 2018.
  2. "Vijay full name is Joseph Vijay".
  3. "Vijay uses full name as Joseph Vijay in his official letter head".
  4. "TN doesn't care if their Thalapathy is Joseph Vijay: Why does BJP's H Raja?". 23 October 2017. Retrieved 11 January 2018.
  5. "Vijay's title changed from Ilayathalapathy to Thalapathy". Behindwoods. 2017-06-21. Retrieved 2017-12-03.
  6. "A teen shares why actor Joseph 'Ilayathalapathy' Vijay is her hero – News & Events | The Star Online". The Star (Malaysia).
  7. "Why Vijay's Mersal was destined to be a blockbuster, even without the BJP's help".
  8. "Poove Unakkaga - The First Blockbuster of Vijay's Career - #22YearsOfVijayism: The 11 Big Box Office Comebacks of Ilayathalapathy Vijay". www.behindwoods.com. Retrieved 11 January 2018.
  9. Awards, National Film (2018-01-15). "Congratulations to @actorvijay nominated for #BestSupportingActor at the #NationalFilmAwardsUK for his role on the film @MersalFilm Vote now". @NATFilmAwards (in ఇంగ్లీష్). Retrieved 2018-01-16.
  10. 10.0 10.1 "Mothers Day special Interview with Illayathalapathy Vijay mother Shobha Chandrasekhar – Tamil Movie News – IndiaGlitz".
  11. "Vijay". starsbiography.
  12. "Vijay speaks about his childhood schooling in fathima matriculation school chennai".
  13. "Vijay | Which Celebrity belongs to your school/college?". Behindwoods. Retrieved 2017-12-28.
  14. "Vijay Marriage: When The Tamil Superstar Fell For His Fan". The Bridal Box (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-07-28. Retrieved 2017-11-23.
  15. "Rediff On The Net, Movies: Gossip from the southern film industry". Rediff.com. 17 August 1998. Retrieved 18 July 2010.
  16. Andhra Jyothy (29 August 2023). "మెగాఫోన్‌ పడుతున్న విజయ్‌ వారసుడు". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
  17. "rediff.com, Movies: Vijay meets his son on the Net!". Rediff.com. 26 August 2000. Retrieved 18 July 2010.
  18. "Great Pillai Gallery -A list of PILLAI WHO'S WHO". www.saivaneri.org. Archived from the original on 10 నవంబర్ 2015. Retrieved 5 November 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  19. "BEAST: Vijay Thalapathy 65's First Look and Title is out". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-21. Retrieved 2022-04-04.
  20. Eenadu (13 April 2024). "రాజకీయ తెరపై తారల తళుకులు.. తమిళనాట పరిస్థితి ఇలా." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  21. Sakshi (2 February 2024). "రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్‌". Archived from the original on 3 February 2024. Retrieved 3 February 2024.

ఇతర లింకులు

మార్చు