అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్

భారత ప్రభుత్వ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థ

 

అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్
రకంప్రభుత్వ రంగ సంస్థ
పరిశ్రమరక్షణ రంగ తయారీ
పూర్వీకులుఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్
స్థాపనఅక్టోబరు 1, 2021 (2021-10-01)
ప్రధాన కార్యాలయంఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, కాన్పూర్, ,
కీలక వ్యక్తులు
IOFS
ఉత్పత్తులు
యజమానిభారత ప్రభుత్వం
విభాగాలు
వెబ్‌సైట్aweil.in

అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE), కాన్పూర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ.[1] AWE ప్రాథమికంగా భారత సాయుధ బలగాలు, విదేశీ మిలిటరీలు, దేశీయ పౌర వినియోగం కోసం చిన్న ఆయుధాలు, ఫిరంగి తుపాకులను తయారు చేస్తుంది.

చరిత్ర

మార్చు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలుగా పునర్నిర్మించడం, కార్పొరేటైజేషన్ చేయడంలో భాగంగా 2021 లో AWE ఏర్పడింది. [2] [3]

ఫ్యాక్టరీ

మార్చు

పూర్వపు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు లోని క్రింది కర్మాగారాలు ఇప్పుడు AWE లో ఉన్నాయి: [4]

  • ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ, కాన్పూర్
  • గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ కాసిపోర్
  • గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ జబల్పూర్
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాన్పూర్
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కోర్వా
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరాపల్లి
  • రైఫిల్ ఫ్యాక్టరీ ఇషాపూర్
  • స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ, కాన్పూర్

ఇండో-రష్యా రైఫిల్స్‌లో కలాష్నికోవ్ కన్సర్న్, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌ లతో పాటు AWE కి కూడా వాటా ఉంది. [5]

నైపుణ్యాభివృద్ధి

మార్చు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఇషాపూర్ (OFIL) అనేది అడ్వాన్స్ వెపన్ & ఎక్విప్‌మెంట్స్ ఇండియా లిమిటెడ్ లో భాగంగా ఉన్న శిక్షణా సంస్థ. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ, సాంకేతిక, నిర్వాహక నైపుణ్యాలను అందించడంలో ఉన్నతీకరించడంలో నిమగ్నమై ఉంది.

1920లో బ్రిటిష్ పాలనలో లెఫ్టినెంట్ కల్నల్. ఎల్. డి లెన్‌ఫెస్టే RA CIA ఆధ్వర్యంలో ఈ సంస్థ ఏర్పడింది. అతను అప్పటి ఇషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీకి సూపరింటెండెంటుగా ఉండేవాడు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుండి సోదరభావంతో పాటు పరిశ్రమలో ఎల్లప్పుడూ దానికి గర్వించదగిన స్థానం ఉండేది. ప్రభుత్వంలో చాలా ఉన్నత స్థానాలు సాధించిన పూర్వ విద్యార్థుల శక్తి సామర్థ్యాల కారణంగా అక్కడి శిక్షణ నాణ్యత పట్ల కార్పొరేట్ ప్రపంచంలో గౌరవ భావం ఉండేది.

OFIL ఇషాపూర్ 1997 & 2005లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అందించిన ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ పురస్కార గ్రహీత. 2002లో రన్నరప్‌గా నిలిచింది.

OFIL ఇషాపూర్ శిక్షణలో పాల్గొనే అధికారులకు, ఇతరులకు వసతి, తిండి అందించడానికి హాస్టల్ సదుపాయం కూడా ఉంది. మొత్తం 116 మంది ఉండగల సామర్థ్యంతో AC, NON-AC గదులు, ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. https://www.icsi.edu/media/webmodules/05092022_Notice.pdf
  2. "Seven new defence companies, carved out of OFB, dedicated to the Nation on the occasion of Vijayadashami". Ministry of Defence (India). Press Information Bureau. 5 October 2021. Retrieved 16 October 2021.
  3. Pubby, Manu (12 October 2021). "Modi to launch seven new PSUs this week, Defence Ministry approves Rs 65,000-crore orders". The Economic Times. Retrieved 16 October 2021.
  4. "Splitting of OFB". pib.gov.in. Retrieved 2024-03-21.
  5. "Indo-Russian venture completes production of AK-203 first batch". Janes.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-21.