మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్

భారత ప్రభుత్వ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థ

మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL) భారత ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ రంగ తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. 2021 లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలుగా పునర్నిర్మించినపుడు దీన్ని స్థాపించారు.[1][2][3] భారత సాయుధ దళాలు, విదేశీ మిలిటరీలు, దేశీయ పౌర అవసరాల కోసం ఇక్కడ మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, రాకెట్లు, బాంబులను తయారు చేస్తారు.

మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్
రకంప్రభుత్వ రంగ సంస్థ
పరిశ్రమరక్షణ రంగ తయారీ
పూర్వీకులుఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
స్థాపనఅక్టోబరు 1, 2021 (2021-10-01)
ప్రధాన కార్యాలయంఅమ్యూనిషన్ ఫ్యాక్టరీ ఖడ్కి, ,
ఉత్పత్తులు
యజమానిభారత ప్రభుత్వం
విభాగాలు
  • అమ్యూనిషన్ ఫ్యాక్టరీ ఖడ్కి
  • కార్డైట్ ఫ్యాక్టరీ అరువంకాడు
  • హై ఎనర్జీ ప్రొజెక్టైల్ ఫ్యాక్టరీ తిరుచ్చిరాపల్లి]]
  • హై ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ ఖడ్కి
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బొలాంగిర్
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చందా చంద్రపూర్
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సి
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నలందా
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వరన్‌గావ్
వెబ్‌సైట్https://munitionsindia.in

ఉత్పత్తులు

మార్చు

మ్యూనిషన్స్ ఇండియా ఉత్పత్తుల్లో ముఖ్యమైన కొన్ని:[4]

  • పినాక మల్టీ బారెల్ రాకెట్ లాంచర్
  • చేతి బాంబు
  • హై స్పీడ్, లో డ్రాగ్ బాంబ్
  • FSAPDS
  • శివాలిక్ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్ (MMHG)
  • 155 mm హై ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఫుల్ బోర్ (బోట్ టెయిల్) షెల్
  • మైండేక Archived 2024-05-22 at the Wayback Machine నావల్ మైన్
  • ఎయిర్ టు గ్రౌండ్ 1000 lb బాంబులు (అధిక పేలుడు పదార్థం[permanent dead link], థర్మోబారిక్[5])
  • 68 mm ఎయిర్ టు గ్రౌండ్ రాకెట్స్ (HE, HC, ట్రైనింగ్ రౌండ్లు)
  • మోర్టార్ బాంబులు (81 మిమీ, 51 మిమీ)
  • పెద్ద క్యాలిబర్ మందుగుండు సామగ్రి
    • 155 మిమీ (HE M-107, ఇల్యూమినేటింగ్ రౌండ్లు, HE ERFB, స్క్రీనింగ్ స్మోక్ రౌండ్లు)
    • 130 mm (HE రౌండ్లు)
    • 125 mm (HE, HEAT రౌండ్లు)
    • 105 mm ( IFG HE, IFG ఇల్యూమినేటింగ్, స్క్రీనింగ్ స్మోక్ రౌండ్లు)
  • మీడియం క్యాలిబర్ మందుగుండు సామగ్రి
    • 84 mm (HE, స్మోక్, ఇల్యూమినేటింగ్ (ILLG) రౌండ్లు)
    • 30 mm ( HE/I, AP / T, HE/T BMP-II కోసం రౌండ్లు)
  • చిన్న కాలిబర్ మందుగుండు సామగ్రి ( యాంటీ మెటీరియల్ రైఫిల్ కోసం 20 mm రౌండ్లు, 14.5×114mm, 7.62 x 51 mm, 7.62 x 54 mmR, 5.56 x 45 mm, 9×19 mm )

అభివృద్ధిలో ఉన్నవి

మార్చు

రామ్‌జెట్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ షెల్

మార్చు

ఐఐటి మద్రాస్‌తో పాటు ఐఐటి కాన్పూర్, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎఆర్‌డిఇ), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ) కలిసి ఇప్పటికే ఉన్న 155 మి.మీ. షెల్ రీడిజైనింగ్‌పై కసరత్తు చేస్తున్నాయి. 60 కిమీ+ పరిధి కల రామ్‌జెట్ ప్రొపల్షన్‌ని ఉపయోగించే షెల్ ఇది. ఇది Haubits FH77, ధనుష్, K9 థండర్, DRDO అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్‌లకు అనుకూలంగా దీన్ని తయారు చేస్తున్నారు. పథాన్ని సవరించుకునేందుకు షెల్, ప్రెసిషన్ గైడెన్స్ కిట్‌ను ఉపయోగిస్తుంది. మ్యూనిషన్స్ ఇండియా షెల్స్‌ను తయారు చేయగలదని ఐఐటీ మద్రాస్ నిర్ధారిస్తుంది.[6]

155 mm స్మార్ట్ ఆర్టిలరీ షెల్

మార్చు

మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్‌తో కలిసి, IIT మద్రాస్ భారతదేశంలోనే మొట్టమొదటి 155 mm స్మార్ట్ మందుగుండు సామగ్రిని అభివృద్ధి చేస్తోంది. లక్ష్య ఛేదనలో ఫిరంగి షెల్ ఖచ్చితత్వాన్ని, ప్రాణాంతకతనూ మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ మందుగుండును 39-, 45-క్యాలిబర్ 155 mm తుపాకుల నుండి ప్రయోగించవచ్చు. సాంప్రదాయ మందుగుండు సామాగ్రికి ఉండే 500 మీటర్ల CEP కాకుండా, మరింత ఖచ్చితత్వంతో 10 మీటర్ల సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ (CEP)ని సాధించడం వీరి అంతిమ లక్ష్యం. ఇది గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్‌లతో కూడిన సూక్ష్మ ఎలక్ట్రానిక్స్ , సెన్సార్‌ల వంటి అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉంటుంది. 155 mm స్మార్ట్ మందుగుండు సామగ్రి కచ్చితత్వాన్ని పెంచడానికి NavIC ఉపగ్రహ మార్గదర్శకత్వాన్ని కూడా ఉపయోగించుకుంటుంది. విభిన్న వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి, 155 mm స్మార్ట్ మందుగుండు సామగ్రి ప్రస్తుత ఫిరంగి తుపాకులలో వాడడానికి అనువుగా తయారు చేయబడింది. దీనికి ఫిన్ స్టెబిలైజేషన్, కెనార్డ్ కంట్రోల్, త్రీ-మోడ్ ఫ్యూజ్ ఆపరేషన్‌తో సహా అధునాతన లక్షణాలు ఉన్నాయి.[7] దీని కనిష్ట పరిధి 8 కి.మీ, గరిష్ట పరిధి 38 కి.మీ. అదనంగా, ఈ స్మార్ట్ షెల్ మూడు వేర్వేరు పేలుడు మోడ్‌లను కలిగి ఉంది: విలంబనం, పేలుడు ఎత్తు, పాయింట్ విస్ఫోటనం.[8][9]

ఎగుమతులు

మార్చు

2017, 2019 లో UAE 40,000, 50,000 155 mm ఫిరంగి మందుగుండు సామగ్రిని కొనుగోలు చేసింది. వాటి ఆర్డర్ల విలువ సుమారు $4 కోట్లు $4.6 కోట్లు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆర్మేనియాలు 155 మిమీ షెల్స్‌ను కొనుగోలు చేసేవి. 2024 ఫిబ్రవరిలో వెలువడ్డ వార్తల ప్రకారం, ఎవరో తెలియని యూరోపియన్ దేశం- పోలాండ్ లేదా స్లోవేనియా కావచ్చు- ఫిరంగి మందుగుండును కొనుగోలు చేసింది.[10][11]

ఉక్రెయిన్ నుండి వీడియోలు ఇటీవల వెలువడ్డాయి, భారతదేశంలో తయారైన ఫిరంగి మందుగుండు సామగ్రిని ఉక్రేనియన్ దళాలు రష్యా-ఉక్రేనియన్ యుద్ధంలో ఉపయోగిస్తున్నట్లు ఈ వీడియోలు చూపుతున్నాయి. రష్యన్, ఉక్రేనియన్ భాషలలోని సోషల్ మీడియా పోస్ట్‌లు ఉక్రెయిన్‌లోకి పడుతున్న వాటిలో భారతీయ 155 మిమీ ఫిరంగి గుండ్లు ఉన్నట్లు నివేదించింది. వాటిలో MIL-ఉత్పత్తి చేసిన HE ERFB BT షెల్స్ ఉన్నాయని పుకారు వచ్చింది.[10][12]

MIL, దాని భాగస్వామి, Nadrah కంపెనీ, సౌదీ అరేబియాకు ఫిరంగి మందుగుండు సామగ్రిని అందించడానికి వరల్డ్ డిఫెన్స్ షో 2024లో $225 మిలియన్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.[13]

2024 మార్చి నాటికి, మ్యూనిషన్స్ ఇండియా వద్ద ₹6,000 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్లున్నాయి. 2026-27 వరకు వీటి సరఫరాలు జరుగుతాయి. ప్రముఖ కస్టమర్‌లు UAE, వియత్నాం, యూరప్ నుండి ఒక తెలియని దేశం. [14]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Roche, Elizabeth (15 October 2021). "New defence PSUs will help India become self-reliant: PM". mint (in ఇంగ్లీష్). Retrieved 16 October 2021.
  2. "Seven new defence companies, carved out of OFB, dedicated to the Nation on the occasion of Vijayadashami". Ministry of Defence (India). Press Information Bureau. 5 October 2021. Retrieved 16 October 2021.
  3. Pubby, Manu (12 October 2021). "Modi to launch seven new PSUs this week, Defence Ministry approves Rs 65,000-crore orders". The Economic Times. Retrieved 16 October 2021.
  4. "Products « MIL". munitionsindia.in. Archived from the original on 2024-05-22. Retrieved 2024-03-06.
  5. "Aero India 2023: Munitions India to start mass producing 1,000 lb thermobaric bombs". Janes.com (in ఇంగ్లీష్). Retrieved 2024-05-22.
  6. MP, Sidharth (21 February 2020). "IIT-M working on next-gen Ramjet-powered 155mm artillery shells for Indian Army". WION. Archived from the original on 21 September 2020. Retrieved 22 August 2022.
  7. "IIT Madras to spearhead development of India's first Indigenous 155mm Smart Ammunition". The Economic Times. 2024-02-06. ISSN 0013-0389. Retrieved 2024-02-08.
  8. MP, Sidharth (5 February 2024). "IIT-M and Munitions India to develop smart ammo for 155mm artillery guns". WION (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-06.
  9. Bureau, The Hindu (2024-02-05). "IIT Madras to develop smart ammunition". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-03-20.
  10. 10.0 10.1 "Munitions India Bags Largest Export Order From Saudi Arabia; To Supply 155MM Artillery Shells Worth $225M". The EurAsian Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-02-08. Retrieved 2024-02-08.
  11. Pubby, Manu (2019-08-03). "In its largest ever export order, OFB to supply 50,000 Bofors shells to UAE". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2024-02-08.
  12. Chaudhury, Dipanjan Roy (2024-01-05). "Russia flags supply of India-made 155mm artillery shells to Ukraine". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2024-02-08.
  13. "MIL inks $225-million ammunition contract with Saudi Arabia government". BusinessLine (in ఇంగ్లీష్). 2024-02-07. Retrieved 2024-02-08.
  14. Ramesh, M. (2024-03-05). "Ammunitions maker Munitions India's export orders swell to ₹6,000 crore". BusinessLine (in ఇంగ్లీష్). Retrieved 2024-03-06.