అతి రథ నే పదం వివిధ గ్రంథాలలో ఈ క్రింది విధంగా ఉంది.

  • గ్రంథాలు అయిన మహాభారతం ప్రకారం, అతిరథ (अधिरथ) అనగా ఒక సారధి,, కర్ణుడు యొక్క పెంపుడు తండ్రి .
  • కొన్ని అధ్యయనాల ప్రకారం, అతను అంగరాజు, ఈ రాజ్యం ప్రస్తుతం భారతదేశం లోని భాగల్పూర్, బీహార్ చుట్టూ ప్రక్కల ప్రాంతాలులో ఉంది.
  • అయితే ఇతరులు అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రం ధృతరాష్ట్ర మహారాజు నకు ఒక సారధి.
  • అయితే మూడవ అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రము ధృతరాష్ట మహారాజు నకు సారధి, అంగదేశానికి రాజు,
  • పురు వంశంలో మతినార అనే రాజు ఉండేవాడు. అతని పిల్లలు, తంశు, మహాన్, అతిరథ, దృహ్యుగా ఉన్నారు.[1]
పెంచిన తల్లిదండ్రులైన రాధ, అతిరథుడు లతో కర్ణుడు చిత్రం

యోధుల సామర్థ్య ప్రమాణం[2]

మార్చు

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే ప్రమాణాలైన రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి అనే వాటిలో ఇది ఒక ప్రమాణం.

రథి అనగా ఏక కాలంలో 5000 మందితో యుద్ధం చేయగలిగే యోధుడు. మహాభారతంలో సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు వంటి వారు రథులు.

రథికి 12 రెట్లు సామర్థ్యం కలిగే యోధుడిని అతి రథి అంటారు. అనగా ఏక సమయంలో 60000 మందితో యుద్ధం చేయగలిగే యోధుడు. మహాభారతం ప్రకారం కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు అతిరథులు.

మూలాలు

మార్చు
  1. మహాభారతం, ఆదిపర్వం, అధ్యాయం 94 పద్యం 14 ప్రకారం
  2. "అతిరథ మహారథులు అంటే అర్థం ఏంటో తెలుసా! - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-08-26.

వనరులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అతిరథ&oldid=3858719" నుండి వెలికితీశారు