అష్టగంధాలు లో ఒక సుగంధము 'అత్తరు. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ లో హర్షవర్థనుడు అక్బర్ చక్రవర్తులు ‘అత్తరు’ పరిశ్రమకు సౌకర్యాలు సమకూర్చారని ‘అయి-నీ-అక్బర్’ గ్రంథంలో ఉన్నదట.అత్తర్‌ పరిమళం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. మల్లెపూలు, గులాబీ రేకులు, గంధపు చెక్కలు, మొగలి పువ్వుల ఆవిరే అసలైన అత్తర్‌. ఎంత కాలం ఎక్కువగా భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. పలుమార్లు దుస్తులను ఉతికినా సువాసన అట్లాగే వుంటే అదే అసలు సిసలైన అత్తర్‌. అత్తర్‌ తయారీలో పువ్వులు వినియోగిస్తే ఫర్‌ప్యూమ్‌లో ఆల్కహాల్‌ను వినియోగిస్తారు. ఎన్నో వేల పూలను గ్రైండ్ చేస్తే వచ్చేది కొద్దిపాటి పరిమళం మాత్రమే. ఇష్టంలేని అత్తరు వాసన పీల్చితే శ్వాసకు ఇబ్బంది. వేసవి కాలంలో ఖస్‌, ఇత్రేగిల్‌ అత్తర్‌లు చల్లదనాన్ని ఇస్తాయి. చలి, వర్షాకాలాలలో షమామతుల్‌ అంర్‌, హీన, జాఫ్రాన్‌, దహనల్‌ఊద్‌ వంటివి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవి కాలంలో దహనల్‌ఊద్‌ వాడితే ముక్కు నుండి రక్తం కారడం ఖాయం. జన్నతుల్‌ ఫర్దోస్‌, మజ్మ, షాజాన్‌, మన్నా, నాయబ్‌, హోప్‌, బకూర్‌, మొకల్లత్‌, ఖస్‌, ఇత్రేగిల్‌, షమామతుల్‌ అంబర్‌, హీన, జాఫ్రాన్‌, దహనుల్‌ఊద్‌, మల్లె, గులాబీ, సంపంగి, మందార, మొగలి పువ్వుల అత్తర్‌ వంటి అనేక రకాలున్నాయి. ఒక తులం మామూలు అత్తర్‌ రూ. 200 వరకు ఉండగా దహనల్‌ ఊద్‌ తులానికి రూ. 2వేల నుండి 6 వేల ధర ఉంది.100 గ్రా. ‘హీనా’ అత్తరు 12 వేలు మొదలుకొని 13 వేలు, 15 వేల వరకు ఉంటుంది.

రకరకాల అత్తరు సీసాలు

అత్తర్లు సువాసన ఎలా ఇస్తాయి?

మార్చు

అత్తరు, సెంట్లు (Perfumes) వాసనలే కాకుండా మిగతా పదార్థాల వాసనలన్నీ నేరుగా మెదడులోకి ప్రవేశిస్తాయి. ఈ వాసనలో అనేక వందల రకాల, అతిసూక్ష్మమైన, ఏమాత్రం బరువులేని వాసన సంబంధిత అణువులు కలిగి ఉంటాయి. దాంతో ఈ అణువులు గాలిలో అతి సులువుగా ఎక్కువ కాలం వ్యాపించి ఉంటాయి. ఈ అణువులు మన ముక్కు రంధ్రాలలోని పై భాగాలకు అతి త్వరగా చేరుకుంటాయి. అక్కడ ఘ్రాణ సంబంధిత గ్రాహకాల న్యూరాన్లు ఉంటాయి. అత్తరు వాసనను వ్యాపింపజేసే అణువులు ఈ గ్రాహకాలకు సులభంగా అంటుకుపోతాయి. వివిధ రకాలైన ఈ గ్రాహకాలు 350 వరకు ఉంటాయి. అవి అనేక వేల రకాల వాసనల సమ్మేళనాలను వాటి మధ్య ఉండే వ్యత్యాసాలను గుర్తించగలవు. అత్తరు, సెంట్లనుంచి వచ్చే వాసనలు మనకు ఆహ్లాదం కలిగించి సేదతీరిస్తే చెడువాసనలు భయాన్ని, అసహ్యాన్ని కలగజేస్తాయి.

అత్తరుపై పాటలు, సామెతలు, లేఖనాలు

మార్చు
  • లేలో దిల్బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ !
  • అత్తరు పలుకుల చిలకమ్మ చిలకరించవే! చిలుకా!
  • మిత్రురాలి లేఖ.. ఆ జ్ఞాపకం ఓ..అత్తరు పరిమళం.
  • అత్తరు సాయిబో రారా అందాల మారాజో రారా
అత్తర సాయిబు మంచోడమ్మ ఉత్తరమేసిండూ
ఉత్తరమేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో
అత్తరు సాయిబూ రారా నా అందగాడా రారా
అందరు మొగుళ్ళు బీదర్ పోయి బిందెలు తెస్తుంటే
నా మొగుడు బీదర్ పోయి బిగసకపోయినాడో అత్తరు
అత్తరసాయిబు మంచోడమ్మ సూపుకు నచ్చిండూ అబ్బా
సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండూ
అందరు మొగుళ్ళు బొంబయి కెళ్ళి బిజినెస్ చేస్తుంటే
బొంబయ్ కెళ్ళిన నా మొగుడు బేవర్సయినాడో అత్తరు
అందరు మొగుళ్ళు చిలంగూర్ పోయి చీరలు తెస్తుంటే
నా మొగుడు చిలంగూర్ పోయి చీపురు తెచ్చినాడో అత్తరు
అందరు మొగుళ్ళు రాత్రి పూట రాగాలు తీస్తుంటే
నా మొగుడు రాత్రి పూట గురకలు తీస్తాడో అత్తరు
  • పాకవానితో సరసంకంటే అత్తరు సాయిబుతో కలహం మేలు
  • “తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.సామెతలు 27:9.
  • అత్తరు పన్నీరు గురగురలు దాని దగ్గరకు పోతే లబలబలు

చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అత్తరు&oldid=3846954" నుండి వెలికితీశారు