అత్తింటి కాపురం
1952లో విడుదలైన అత్తింటి కాపురం, తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ చేసిన చిత్రం. ఈ సినిమా తమిళ మూలచిత్రం పేరు కళ్యాణి. 1948లో విడుదలైన హాలీవుడ్ చిత్రం స్నేక్ పిట్ ఆధారంగా మాడ్రన్ థియేటర్స్ స్థాపకుడు టి.ఆర్.సుందరం, అప్పట్లో ప్రసిద్ధి చెందిన దర్శకుడు టి.ఆర్.రాఘవాచార్యను దర్శకుడిగా పెట్టి తమిళంలో కళ్యాణి చిత్రాన్ని తీశాడు. డెయిలీ తంతి పత్రిక మొదటి సంపాదకుడైన షణ్ముగసుందరం ఈ సినిమాకు కథను సమకూర్చాడు. మతిస్థిమితం లేని భర్తగా ఎం.ఎన్.నంబియార్, ఆయనకు భార్య బి.ఎస్.సరోజ నటించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని భర్తకు నయంచేసే ప్రయత్నంలో సఫలం కావటమే ఈ సినిమా యొక్క ఇతివృత్తం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు ఆచార్య క్షయవ్యాధి సోకి అనారోగ్యం బారిన పడగా, ఛాయాగ్రాహకుడు మహమ్మద్ మస్తాన్ దర్శకత్వాన్ని చేపట్టి సినిమాను పూర్తిచేశాడు. నటీనటులు అద్భుతంగా నటించినా, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు.[1]
అత్తింటి కాపురం (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.జి.రాఘవాచార్య, మహమ్మద్ మస్తాన్ |
---|---|
తారాగణం | ఎం.ఎన్.నంబియార్, డి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.జి.చక్రపాణి, కె.వి.శ్రీనివాసన్, బి.ఎస్.సరోజ, యం.సరోజ, ఏ.కరుణానిధి, టి.పి.ముత్తులక్ష్మి, పి.ఎస్.జ్ఞానం, జి.శకుంతల |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి, జి.రామనాథన్ |
నేపథ్య గానం | సుసర్ల దక్షిణామూర్తి, కె.రాణి, పి.లీల, ఎ.పి. కోమల, కె. జమునారాణి, రత్నమాల, చంద్ర, జయశ్రీ, కాంతి |
గీతరచన | తోలేటి వెంకటరెడ్డి |
సంభాషణలు | తోలేటి వెంకటరెడ్డి |
నిర్మాణ సంస్థ | మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- కాలమురా కలికాలమురా ఇది ఓరన్నా , గానం. సుసర్ల దక్షిణామూర్తి
- మన హృదయవీణ మ్రోగే ఓహో ప్రియతమా , గానం. కె. రాణి, సుసర్ల దక్షిణామూర్తి
- నాజీవిత సౌధము నవశోభలతో నిలిపే పాపవే, గానం. కె. రాణి
- ఓయి అభాగ్యుడా యీ భువిలో, ధనమే కద నరులా తులదూచే దురాగత సాధనరా, గానం. సుసర్ల దక్షిణామూర్తి
- అదే చూడవే కొత్తెడ్ల బండీ తోనే అతడే నా సఖుడే పోయెనే నను వీడి, గానం. పి. లీల
- బ్రతుకేలా భువిలోనా వెత తీరే దారీ లేదా
- ఏ పనులైనా నీకంటేనూ మజాగ నే చేస్తా
- కాలమంతా జీవితములో కటిక చీకటా
- లేదోయీ సుఖం జగానా బాధలoదే నలిగిపోవు
- ఒకటి రెండు మూడు, బ్రహ్మచారిగానే వుండి జీవించేది ఒకటి
- ప్రేమా అయ్యో ప్రేమా అయ్యయ్యో ప్రేమా కమలా
- సక్సెస్ సక్సెస్ సక్సెస్ ఆపరేషన్ లేని బల్ అద్భుతమైన
- టక్కు టక్కు టక్కు ఆగలేని టక్కు అత్త కొడుకు మీదనే, గానం. కె రాణి బృందం
- జగతిలోన ఈ పేదరోదనలను జాలి వినేవారన్నా దొరకడే ,
- నా పాపమేమో ఈ పాట్లు తీరే మార్గాలే లేవే ఈ పాడులోకాన,
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Kalyani 1952 - The Hindu Feb 27, 2009". Archived from the original on 2012-07-17. Retrieved 2013-09-17.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.