తోలేటి వెంకటరెడ్డి
తెలుగు రచయిత
తోలేటి వెంకటరెడ్డి తెలుగు సినిమా రచయిత.అనేక సినిమా లకు పాటలు, సంభాషణలు వ్రాశాడు."తోలేటి రాసిన పాటల్లో చాలా ప్రసిద్ధమైన గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కు’. ఘంటసాల విజయనగరంలో వున్న రోజుల్లో పరిచయమైన తోలేటి క్రమంగా సన్నిహితుడై స్నేహితుడయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, జీవితం, సంఘం, వదిన లాంటి కొన్ని సినిమాలక్కూడా పాటలు రాశాడు. తోలేటి వెంకటరెడ్డిగా పేరు మార్చినా, అసలు పేరు తోలేటి వెంకటశాస్త్రి".[1]
తోలేటి వెంకటరెడ్డి | |
---|---|
జననం | తోలేటి వెంకటశాస్త్రి |
మరణం | జూన్ 6, 1955 |
ఇతర పేర్లు | తోలేటి |
వృత్తి | రచయిత |
పిల్లలు | 6 |
జీవిత విశేషాలు
మార్చుఇతడు విజయనగరంలో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తర్వాత మద్రాసుకు వచ్చి కొలంబియా, హెచ్.ఎం.వి. రికార్డింగు కంపెనీలకు పాటలు వ్రాశాడు. ఇతడు సుమారు 12 సినిమాలకు పనిచేశాడు. తన 41యేట ఇతడు 1955, జూన్ 6వ తేదీన మద్రాసులో మరణించాడు. మరణించేనాటికి ఇతనికి తల్లి, భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.[2]
సినిమాలు
మార్చు- జీవితం (1950)
- మొదటి రాత్రి (1950)
- ఆడ జన్మ (1951)
- నవ్వితే నవరత్నాలు (1951)
- అత్తింటి కాపురం (1952) (సంభాషణలు, పాటలు)
- కాంచన (1952) (సంభాషణలు, పాటలు)
- సవతి పోరు (1952)
- కాళహస్తి మహాత్యం (1954)
- సంఘం (1954) (సంభాషణలు, పాటలు)
- వదిన (1955)
- ఆలీబాబా 40 దొంగలు (1956)
- సదారమ (1956)
ప్రైవేటు గీతాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ మల్లాది సూరిబాబు (4 August 2018). "తోలేటి". ఆంధ్రభూమి దినపత్రిక.
- ↑ మల్హర్ (10 July 1955). "ఫిలిం రచయిత 'తోలేటి ' మరణించాడు" (PDF). జమీన్ రైతు వార్తాపత్రిక. No. 23, సంపుటి 27. నెల్లూరు శ్రీరామమూర్తి. Retrieved 25 July 2020.
- ↑ కవిగాయక వైతాళికులు, మల్లాది సూరిబాబు ఆంధ్రభూమి జూలై 27 2020 పత్రికలో.
- ↑ మిసిమి డిసెంబరు 2015 పత్రికలో డా. ఎం. పురుషోత్తమాచార్య గారి "మన ఘంటసాల సంగీత వైభవం" పుస్తకం నుండి ప్రచురించబడిన వ్యాసం.