కె. రాణి

(కె.రాణి నుండి దారిమార్పు చెందింది)

కె. రాణి తెలుగు సినిమారంగంలో తొలికాలం నాటి గాయని. ఈమె ఆకాలంలోని సుమారు అందరు గాయకులతో గొంతు కలిపి ఎన్నో మధురమైన పాటలు గానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాస్‌’ చిత్రంలోని ‘‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’’ పాటతో ఆమె ప్రసిద్ధిగాంచారు. తెలుగులో సుమారు 500పైగా పాటలు ఆలపించారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఈమెనే ఆలపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, సిన్హల, ఉజ్బెక్‌ భాషల్లో పాటలు పాడారు. ‘రూపవతి’ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన రాణి.. ‘బాటసారి’, ‘జయసింహ’, ‘ధర్మదేవత’, ‘లవకుశ’ వంటి చిత్రాల్లో తన పాటలు ఆలపించారు.[1]

కె. రాణి
కె. రాణి
జననంకె.ఉషారాణి.
1942
తుముకూరు, కర్ణాటక రాష్ట్రం
మరణంజూలై 14, 2018
హైదరాబాదు, తెలంగాణ
వృత్తిగాయని
ప్రసిద్ధిసోలో సింగర్
భార్య / భర్తగాలివీటి సీతారామరెడ్డి
తండ్రికిషన్
తల్లిలలిత

జీవిత విశేషాలు మార్చు

ఈమె అసలు పేరు కె.ఉషారాణి. ఈమె 1942లో కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి రైల్వేలో ఉద్యోగి. వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చి కడపలో స్థిరపడ్డారు. ఈమెకు 1966లో గాలివీటి సీతారామరెడ్డితో వివాహం జరిగింది. ఈమె మామగారు బహద్దూర్ సుబ్బారెడ్డి జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. సీతారామరెడ్డికి హైదరాబాదులోని చార్మినార్ సమీపంలో సదరన్ మూవిటోన్ అనే స్టూడియో వుండేది. ఈ స్టూడియోలోనే ‘సతీ అరుంధతి’, ‘నిజం చెబితే నమ్మరు’ వంటి సినిమాలు నిర్మించారు. లవకుశ నిర్మాత శంకరరెడ్డి ‘రహస్యం’ సినిమాను సదరన్ మూవిటోన్ స్టూడియోలోనే నిర్మించడం విశేషం. వీరికి ఇద్దరు అమ్మాయిలు. "మెల్లిసై రాణి" అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాజ్ ఆమెని కీర్తించారు. భారత రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులను ఆమె తన గానామృతంతో ఓలలాడించారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో భాషల్లో కలిపి రాణి ఐదు వందలకు పైగా పాటలు పాడారు.[2]

మరణం మార్చు

2018, జూలై 14న హైదరాబాదులోని తన కుమార్తె ఇంటిలో మరణించింది.[3]

సినిమా పాటలు మార్చు

1951 లో రాణి తొలిసారి ‘రూపవతి’ అనే సినిమాలో “నా తనువే సుమా స్వర్గసీమా, కమ్మని తావి వెదజల్లు బంగారుబొమ్మ” అనే జావళి ని, “వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయి, సయ్యనవోయి మనసార దరిచేరవోయి” అనే కోరస్ పాటని సి. ఆర్. సుబ్బురామన్ సంగీత దర్శకత్వంలో పాడింది.

కె.రాణి పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహ గాయకుడు/ గాయని సంగీత దర్శకుడు గేయ రచయిత సినిమా విడుదలైన సంవత్సరం
1 రూపవతి నా తనువే సుమా స్వర్గసీమా కమ్మని తావి వెదజల్లు సి.ఆర్. సుబ్బరామన్ కె.జి.శర్మ 1951
2 రూపవతి వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయి జిక్కి బృందం సి.ఆర్. సుబ్బరామన్ కె.జి.శర్మ 1951
3 అత్తింటి కాపురం నాజీవిత సౌధము నవశోభలతో నిలిపే పాపవే సుసర్ల దక్షిణామూర్తి,
జి.రామనాథ అయ్యర్
తోలేటి 1952
4 ధర్మ దేవత ఏ ఊరే చిన్నదానా తొలకరి మెరుపల్లె మెరసేవు కె. ప్రసాదరావు సి.ఆర్. సుబ్బరామన్ సముద్రాల సీనియర్ 1952
5 ధర్మ దేవత చిందువేయవోయి చిన్ని కృష్ణయ్య ఓ బాల బి.ఎన్.రావు,
జిక్కి
సి.ఆర్. సుబ్బరామన్ సముద్రాల సీనియర్ 1952
6 ధర్మ దేవత పాటకు పల్లవి కావాలోయి ఆటలు గజ్జలు కావాలోయి సి.ఆర్. సుబ్బరామన్ కె.జి. శర్మ 1952
7 ధర్మ దేవత లంబాడి లంబాడి లంబాడి లంబ లంబ లంబ సి.ఆర్. సుబ్బరామన్ సముద్రాల సీనియర్ 1952
8 పెళ్ళి చేసి చూడు అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే ఫస్టుక్లాసులో ఉడుతా సరోజిని ఘంటసాల పింగళి 1952
9 పెళ్ళి చేసి చూడు బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా లోకమునే ఎ.పి.కోమల,
ఉడుతా సరోజిని
ఘంటసాల ఊటుకూరి 1952
10 సింగారి ఆవో మహారాజ్..ఒక జాన్ కడుపే లేదంటే ఈ లోకాన లేదు గలాటా కె.హెచ్.రెడ్డి ఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్,
టి.ఎ.కళ్యాణం
1952
11 సింగారి కొటారు మానిపైనే గూడు కట్టుకొక్కేరను కొట కొత్తళ౦ కె.హెచ్.రెడ్డి ఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్,
టి.ఎ.కళ్యాణం
1952
12 దేవదాసు అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశానిరాశేనా మిగిలేది సి.ఆర్. సుబ్బరామన్ సముద్రాల సీనియర్ 1953
13 దేవదాసు చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే ఘంటసాల సి.ఆర్. సుబ్బరామన్ సముద్రాల సీనియర్ 1953
14 పుట్టిల్లు ఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ ఆహా హా బ్యూటీ పిఠాపురం మోహన్ దాస్,
చలపతి రావు
1953
15 నిరుపేదలు సార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ చెక్కు చెదరితే డబ్బులు వాపస్ టి.వి.రాజు అనిసెట్టి 1954
16 మా గోపి మా వదిన మా వదిన నా పేరున ఒక జాబును వ్రాసింది జిక్కి బృందం ఎం.ఎస్.విశ్వనాథన్,
రామమూర్తి
అనిసెట్టి 1954
17 చిరంజీవులు నాటిన అంటుకు ...ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా కె.జమునారాణి ఘంటసాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1956
18 బాల సన్యాసమ్మ కథ అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి పి.లీల,
మైధిలి
ఎస్.రాజేశ్వరరావు సముద్రాల జూనియర్ 1956
19 బాల సన్యాసమ్మ కథ కళకళలాడే సతికిపతికి కర్పూర హారతులు మైధిలి బృందం ఎస్. రాజేశ్వరరావు సముద్రాల జూనియర్ 1956
20 బాల సన్యాసమ్మ కథ నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ పిఠాపురం ఎస్. రాజేశ్వరరావు సముద్రాల జూనియర్ 1956
21 అల్లావుద్దీన్ అద్భుతదీపం సొగసరిదాననయ్య రంగేళి సింగారి ఎస్.రాజేశ్వరరావు,
ఎస్.హనుమంతరావు
ఆరుద్ర 1957
22 తోడికోడళ్ళు ఎంతెంత దూరం కోశెడు దూరం నీకు మాకు చాలా చాలా దూరం పి.సుశీల బృందం మాస్టర్ వేణు ఆత్రేయ 1957
23 వద్దంటే పెళ్ళి రావో రావో ప్రియతమా నీవే నాకు సరసుమా రాజన్ - నాగేంద్ర శ్రీరామ్‌చంద్ 1957
24 స్వయంప్రభ ఒరె గున్నా ఏమో అనుకున్నాబల్ గడసరివన్నా ఓ సొగసరి రమేష్ నాయుడు ఆరుద్ర 1957
25 కొండవీటి దొంగ తమలపాకు సున్నము పడుచువాళ్లకందము పి.బి.శ్రీనివాస్ ఎస్.ఎల్.మర్చెంట్,
ఎం.ఎస్.శ్రీరామ్
1958
26 శోభ వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారియేగా ఎ.ఎం. రాజా ఏ.ఎమ్.రాజా పి.వసంతకుమార రెడ్డి 1958
27 దైవబలం ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావు బృందం అశ్వత్థామ కొసరాజు 1959
28 మనోరమ ఓహోహో కాంతమ్మఒక్కసారి చూడమ్మాకొత్త పెళ్ళి కూతురులా పి.బి.శ్రీనివాస్ రమేష్ నాయుడు 1959
29 సిపాయి కూతురు ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో పిఠాపురం యం.ఎస్.రాజు కొనకళ్ల వెంకటరత్నం 1959
30 కన్నకూతురు ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం ఎ.పి.కోమల బృందం ఎం.రంగారావు నారపరాజు 1960
31 ఉషాపరిణయం ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో పిఠాపురం ఎస్.హనుమంతరావు సదాశివబ్రహ్మం 1961
32 ధాన్యమే ధనలక్ష్మి ఆంగ్ల నాగరిక రీతులు అధ్బుతమైన కళాజ్యోతులు సరోజిని మారెళ్ళ అనిసెట్టి 1961
33 యోధాన యోధులు టిక్కు టెక్కుల చిట్టి టెక్కు నిక్కు హోయల చిట్టి అశ్వద్ధామ సుంకర 1961
34 ఏకైక వీరుడు ఎవరో ఎవరో ఇరువురిలో నచ్చిన మెచ్చిన ఎల్.ఆర్. ఈశ్వరి ఎస్.పి. కోదండపాణి వీటూరి 1962
35 పతిగౌరవమే సతికానందం మురిపించు ప్రియరాణీ మృదువైన మంజువాణీ రాజు సాలూరి రాజేశ్వరరావు అనిసెట్టి 1962
36 తల్లి బిడ్డ ఆడించరె జోల లాడించరె అందాల బాబును దీవించి బృందం బి.శంకరరావు ఎ.వేణుగోపాల్ 1963
37 సతీ అరుంధతి పోయిరావే తల్లి పోయి రావమ్మా ఆరని జ్యోతి బృందం అశ్వద్ధామ దాశరథి 1968

మూలాలు మార్చు

  1. "పాటల రాణి ఇక లేరు!".[permanent dead link]
  2. సారంగ, జ్ఞాపకాలు (15 July 2018). "అందమైన పాటలా ఆమె ప్రయాణం! –". magazine.saarangabooks.com. పురాణం విజయ దుర్గ. Retrieved 7 August 2020.
  3. సితార, పాటల పల్లకి. "పాటల తోటను వీడిన పాటల రాణి". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2 ఆగస్టు 2018. Retrieved 7 ఆగస్టు 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=కె._రాణి&oldid=3741101" నుండి వెలికితీశారు