అత్తిలి సూర్యనారాయణ

తెలుగు రచయిత

అత్తిలి సూర్యనారాయణ రచయిత, సంఘ సంస్కర్త. ఇతడు ఆర్యసమాజంలో పనిచేశాడు. 1914లో రాయుడు గంగయ్య, వెల్లంకి కృష్ణమూర్తిలతో కలిసి ఏలూరు, ఆ చుట్టుపక్కల గ్రామాలైన గోగులపల్లి, పైడిచింతలపాడు గ్రామాలలో క్రైస్తవ మతం మార్చుకున్న వందలాది అంటరాని వారిని తిరిగి హిందువులుగా మతమార్పిడి చేయించాడు.[1] అస్పృశ్యులకు ఏలూరులోని జనార్దనస్వామి ఆలయ ప్రవేశానికై ఆత్మకూరు గోవిందాచార్యులు, గూడూరు రామచంద్రరావు, చెంచుదాసు, అయ్యదేవర కాళేశ్వరరావు, నరాలసెట్టి దేవేంద్రుడు మొదలైన వారితో కలిసి సత్యాగ్రహాన్ని నిర్వహించాడు.[2] ఇతడు కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో సహాయోధ్యాపకుడిగా పనిచేసినాడు.[3]

అత్తిలి సూర్యనారాయణ
అత్తిలి సూర్యనారాయణ
జననంఅత్తిలి సూర్యనారాయణ
వృత్తిసహాయ అధ్యాపకుడు
ఉద్యోగంపిఠాపురం రాజా కళాశాల, కాకినాడ
ప్రసిద్ధిసంఘ సంస్కర్త, రచయిత

రచనలు మార్చు

మూలాలు మార్చు

  1. జంగం చిన్నయ్య, అనువాదం:కె.సజయ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు (2021 ed.). హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 174. Retrieved 18 June 2022.
  2. జంగం చిన్నయ్య, అనువాదం:కె.సజయ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు (2021 ed.). హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 157. Retrieved 18 June 2022.
  3. కాశీనాథుని నాగేశ్వరరావు (12 April 2011). "చిత్రపటముల వివరణము" (PDF). ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 253. Retrieved 18 June 2022.
  4. Prabhāvati, Vāsā (2003). Bhāratasvātantryōdyamaṃlō Telugu mahiḷala pātra. Vāsā Pracuraṇalu.
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: