అదృష్ట విజయము ప్రముఖ తెలుగు నాటకకర్త సోమరాజు రామానుజరావు అరేబియన్ నైట్స్ నుంచి స్వీకరించి రచించిన నాటకం. పారశీక భాషలో తొలుత రచించిన అరేబియన్‌ నైట్స్‌ నుంచి స్వీకరించిన ఆలీబాబా నలభై దొంగలు కథ ఈ నాటకానికి మూలం.

అదృష్ట విజయము
కృతికర్త: సోమరాజు రామానుజరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నాటకం
ప్రచురణ:
విడుదల:

రచన నేపథ్యం

మార్చు

రామానుజరావు రచించిన ఈ నాటకానికి ప్రపంచ ప్రసిద్ధమైన అరేబియన్ నైట్స్ గ్రంథంలోని కథ మూలం. అరేబియన్ నైట్స్‌ లేదా అలీఫ్ లైలా లేదా One Thousand and One Nights (అరబ్బీ كتاب ألف ليلة وليلة - కితాబ్ 'అల్ఫ్ లైలా వ-లైలా; పర్షియన్ هزار و یک شب - హజార్-ఒ ఏక్ షబ్), అనేక వందల సంవత్సరాలనుండి ఎందరో రచయితల ద్వారా వ్రాయబడిన కథల సమాహారము. దీనిని ప్రపంచంలోని పలు దేశాలలో, పలుభాషలలోకి తర్జుమా చేశారు. ఇందులో 'వెయ్యిన్నొక్క' కథలున్నాయి. ప్రతి రాత్రీ ఓ కథ చెబితే వెయ్యిన్నొక్క రాత్రులు గడచి పోతాయి. ఈ అలీఫ్ లైలా కథలలో బాగా ప్రాచుర్యం పొందినవి, అల్లావుద్దీన్ అత్భుత దీపం, అలీబాబా నలభైదొంగలు, సింద్ బాద్ సాహసయాత్రలు. వాటిలోని ఆలీబాబా నలభై దొంగలు ఈ కథకు మూలం.

రచయిత

మార్చు

సోమరాజు రామానుజరావు ప్రముఖ నాటకకర్త. ఆయన పలు నాటకాలను వివిధ భాషల నుంచి అనువదించారు. కొన్నిటిని స్వయంగా రచించారు.

ఇతివృత్తం

మార్చు

రహస్యంగా దొంగలు దాచిన నిధిని కనిపెట్టిన ఓ నిరుపేద జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది ముఖ్య కథాంశం. పారశీక ఇతివృత్తాన్ని రచయిత భారతీయ నేపథ్యంలోకి మలిచారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు