దర్పణం

(అద్దం నుండి దారిమార్పు చెందింది)
సమతల దర్పణంలో ప్లవర్ వాజ్ యొక్క ప్రతిబింబము

దర్పణం లేదా అద్దం (ఆంగ్లం Mirror) ఒక ముఖ్యమైన గృహోపకరణము. ఈ అద్దాలకు ఒక వైపు మెరుగుపెట్టబడి కాంతి కిరణాలను పరావర్తనం (Reflection) చెందిస్తుంది. సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా (Plane mirror) ఉంటుంది.దీనిని సమతల దర్పణం అంటారు. కొన్ని ప్రత్యేకమైన వంపు తిరిగిన దర్పణాలు (Curved mirrors) ప్రతిబింబాన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా చేయడానికి దూరంగా లేదా దగ్గరగా తేవడానికి ఉపయోగిస్తారు. వీటిలో కుంభాకార దర్పణాలు (Convex mirrors), పుటాకార దర్పణాలు (Concave mirrors) అని రెండు రకాలు.

దర్పణాలు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా అలంకరణ, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని రకాల డెకరేషన్, అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలో దర్పణాలు టెలిస్కోపులు, లేజర్ పరికరాలు, కెమెరాలు, పారిశ్రామిక యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్నీ దృశ్య కాంతిని ఉపయోగించేవి. అయితే కొన్ని దర్పణాలు కంటి కనిపించని ఇతర తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాల కోసం ఉపయోగంలో ఉన్నాయి.

భాషా విశేషాలుసవరించు

మూలాలుసవరించు

  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం అద్దము పదప్రయోగాలు.[permanent dead link]
  2. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం దర్పణము పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-22. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దర్పణం&oldid=2881327" నుండి వెలికితీశారు