అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)
అనంతగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] అనంతగిరి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సూర్యాపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
అనంతగిరి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°03′11″N 79°58′57″E / 17.052942°N 79.982474°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట జిల్లా |
మండల కేంద్రం | అనంతగిరి (సూర్యాపేట జిల్లా) |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 115 km² (44.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 30,972 |
- పురుషులు | 15,589 |
- స్త్రీలు | 15,383 |
పిన్‌కోడ్ | 508234 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
మార్చులోగడ అనంతగిరి గ్రామం నల్గొండ జిల్లా సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలోని కోదాడ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అనంతగిరి నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, కోదాడ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+09 (పది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3] పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 115 చ.కి.మీ. కాగా, జనాభా 30,972. జనాభాలో పురుషులు 15,589 కాగా, స్త్రీల సంఖ్య 15,383. మండలంలో 8,337 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ 2.0 2.1 "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.