ప్రధాన మెనూను తెరువు

అనంతనాగ్

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా

జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా ఒకటి. అంతేకాక కాశ్మీర్ లోయలోని 8 జిల్లలలో ఇది ఒకటి. అనతనాగ్ పట్టణం జిల్లా కేంద్రగా ఉంది.2011 గణాంకాలను అనుసరించి జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం లోని జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా జసాంధ్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో జమ్ము మరియు శ్రీనగర్ జిల్లాలు ఉన్నాయి.[1]

అనంత నాగ్ జిల్లా
జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా స్థానం
జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ మరియు కాశ్మీర్
ప్రాంతంకాశ్మీర్ లోయ
ప్రధాన కేంద్రంఅనంతనాగ్ పట్టణం
విస్తీర్ణం
 • మొత్తం2 కి.మీ2 (1,126 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1
 • ర్యాంక్3rd out of 22
 • సాంద్రత370/కి.మీ2 (950/చ. మై.)
Literacy64.32% (2011)
తెహసీళ్ళ సంఖ్య6
జాలస్థలిhttp://anantnag.nic.in

పాలనసవరించు

అనంత నాగ్ జిల్లాలో కోకెర్‌నాగ్, షంగూస్, అనత్‌నాగ్ పట్టణం, బీజ్బెహరా, దొరు, పహల్గాం మరియు క్వాజీగండ్ తెహసిల్స్ ఉన్నాయి. జిల్లాలో 7 బ్లాకులు (బ్రెంగ్, షంగూస్, అచబల్, డాచింపోరా, క్విజిగండ్, ఖోవెరిపోరా మరియు షహబాద్ ఉన్నాయి.[2] ఒక్కో బ్లాకులో పలు గ్రామాలున్నాయి.

రాజకీయాలుసవరించు

అనంత్‌నాగ్ జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు (అనంత్‌నాగ్, వెరినాగ్, కోకర్‌నాగ్, షంగస్, బిజ్‌బెహరా మరియు పహల్గాం ఉన్నాయి.[3]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 1,070,144, [1]
ఇది దాదాపు సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం .[4]
అమెరికాలోని రోహె ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో 425 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత 375.[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 37.48%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 937:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 64.32%[1] in 2011.
జాతియ సరాసరి (72%) కంటే అధికం

1,08,505 జనసంఖ్య కలిగిన అనంత్‌నాగ్ పట్టణం జిల్లాలో జనసంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. మహానగర్ అనంత్‌నాగ్ జనసంఖ్య 1,58,785.

పర్యాటకంసవరించు

అనంతనాగ్ జిల్లాలో (వెరినాగ్, అచబల్, కోకర్నాగ్, డక్సం, పహల్గాం, దండిపోరా, చతబాల్, మార్టాండ్ మరియు సింతాన్ టాప్ పలు పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో అనతనాగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహెల్గాం మరియు కోకర్నాగ్ మరింత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. ప్రధాన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్నాథ్ క్షేత్రం పహల్గాంలో ఉంది. ఇక్కడకు ప్రతిసంవత్సరం వేలాది భక్తులు వస్తూ ఉంటారు.

చారిత్రాత్మక ప్రదేశాలుసవరించు

కాశ్మీర్ లోయలోని మిగిలిన ప్రాంతాల వలెనే అనంతనాగ్ కూడా పలు కష్టసుఖాలను మరియు ఉద్యమాలను ఎదుర్కొన్నది. 1835లో మొగల్ కాలంలో జమ్ము మరియు కాశ్మీరుకు వచ్చిన " చార్లెస్ వన్ హ్యూజ్ " ఇక్కడ కొన్ని శిథిలమైన స్మారకచిహ్నాలను కనుగొన్నాడు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మార్తాండ్ ఆలయం కాక గుర్తించతగిన పురాతన భవనాలు కాని పురాతత్వ చిహ్నాలు కాని లేవు. సుల్తాన్ సికిందర్ కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న పలు పురాతత్వ ప్రదేశాలు విధ్వశం చేయబడ్డాయి. ఒకప్పుడు గొప్ప శిల్పకళావైభవానికి చిహ్నాలుగా నిలిచిన మార్తాండ ఆలయ సమూహం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయ సమూహాన్ని కాశ్మీర్ రాజు లాలిత్యవర్మ మరియు రాజా అవంతిపురా రాజు (శ్రీనగర్ మరియు అనంత్‌నాగ్ మద్యలో ఉంది) అవంతివర్మ నిర్మించిన.

మార్తాండ్ సూర్య ఆలయంసవరించు

దేశంలోని శిల్పకళావైభవం కలిగిన ప్రదేశాలలో మార్తాండ్ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సుల్తాన్ బత్షిఖాన్ చేత విధ్వంసం చేయబడింది.[6] మార్తాండ్ ఆలయాన్ని విధ్వంసం చేయడానికి బత్షిఖాన్‌కు పూర్తిగా ఒక సంవత్సర కాలం పట్టింది. శిథిలావస్థలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ శిల్పం ఇప్పుడు కూడా చూపరులకు ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది. [7] అద్భుతమైన ఆలయసౌందర్యం ఈ ప్రాంతపు గతకాలపు వైభవాన్ని తెలియజేస్తుంది. స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం ఈ జిల్లాలోని సౌదర్యవంతమైన ప్రాంతాలను అభివృద్ధిచేసేంది. ఈ ఆలయం సంప్రదాయానికి చెందినదని భావిస్తున్నారు.[8] ఆర్యసంప్రదాయానికి చెందిన ప్రజలు ఇప్పుడు కూడా ఈ జిల్లాలో నివసిస్తున్నారు.మార్తాండ్ ఆలయం అనంతనాగ్ జిల్లాకు 9 కి.మి దూరంలో అనంతనాగ్ పట్టణానికి తూర్పు- ఈశాన్యంలో ఉంది.

పహల్‌గాంసవరించు

ప్రపంచ ప్రదిద్ధి చెందిన హిల్ స్టేషను అనంత్‌నాగ్‌కు 45 కి.మీ దూరంలో ఉంది. ఈ పట్టణం సముద్రమట్టానికి 7,200 మీ ఎత్తున లిద్దర్ నదీతీరంలో ఉంది. అనంత్‌నాగ్‌లోని 5 తెహ్సిల్స్‌లో పెహల్గాం ఒకటి. అత్యధికంగా యాత్రీకులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఇది ఒకటి. అంతేకాక బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణకు ప్రసిద్ధి చెందినది. ఇంకా దేశంలో అత్యుత్తమ ఆరోగ్యకేంద్రగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అమర్‌నాథ్ యాత్రకు ఆరంభ ప్రదేశాలలో ఇది ఒకటి. పహల్గాం పైన్ అరణ్యాలకు, మనుదుప్పటి కప్పుకున్న పర్వతశిఖరాలకు, ఆరోగ్యకరమైన వాతావరణానికి మరియు విస్తారమైన మైదానాలు మరియు పచ్చికబయళ్ళతో ఆకర్షణీయంగా ఉంది. పహల్గాంలోని లిద్దర్ నదిలో నిరంతరాయంగా కుండపోతగా వచ్చి చేరుతున్న నీరు వలన పహల్గాం సుసంపన్నమైంది. టూరిస్ట్ గుడారలలు మరియు ప్రైవేట్ రెస్టారెంట్లు యాత్రీకులకు అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది. పహల్గాం నుండి పలు పర్వతారోహణా మార్గాలు ఆరంభం ఔతుంటాయి. పహల్గాం నుండి 35 కి.మీ దూరంలో ఉన్న పైన్ అరణ్యాల ద్వారా పయనిస్తూ వెళ్ళే కోలహోయి గ్లాసియర్ పర్వతారోహణా మార్గం వీటిలో ప్రధానమైంది.

నోమడ్సవరించు

నోమడ్ గ్రామం ఆధునిక అభివృద్ధి కార్యక్రమాల వలన ఇంకా కలుషితం కాని ప్రదేశాలలో ఒకటి. చేపలు పట్టే వారికి అనుకూల ప్రదేశం. అనుభవం లేని వారు కూడా ఇక్కడ సులువుగా సెలయేర్లలో " రెయిన్‌బ్లో ట్రాట్ చేపలు " పట్టవచ్చు. " పెద్ద గోధుమవర్ణ ఎలుగుబంటి "కి ఇది స్వస్థలమని భావిస్తున్నారు. అది ఇక్కడ ఉన్న పైన్ మరియు దేవదారు అరణ్యాలలో నివసిస్తుంటుంది. సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఇక్కడ ఒక గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. ఇక్కడ పర్యాటకులకు కేంపింగ్ సాధనాలు, పైంస్ మరియు స్కీయింగ్ పనిముట్లు లభిస్తాయి. అందమైన అరుయే మైదానం గుండా పయనిచే కోలహోయి పర్యాటక గమ్యాలలో ఒకటని భావించవచ్చు. ఒక చిన్న కొండశిఖరం మీద నిర్మితమైన రిసార్ట్ సమీపంలో పలు ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయి. నడక కంటే పోనీల మీద పయనించడం ఉత్తమం. పోనీలు ఇక్కడ అందుబాటు బాడుగలో లభిస్తాయి.

చందన్‌వాడిసవరించు

చందన్‌వాడి లోని పర్యాటక ఆకర్షణలలో ఎత్తుపల్లాలతో అకర్షణీయంగా ఉన్న బియాసరన్ మైదానం చాలా అందమైనది. ఈ మైదానం చుట్టూ దట్టమైన పైన్ వృక్షాల అరణ్యం ఉంది. చందన్‌వాడి మార్గంలో ఉన్న హజాన్ ఒక మంచి పిక్నిక్ స్పాటని చెప్పవచ్చు. చలనచిత్ర ప్రేక్షకులు ఈ ప్రదేశంలోని దృశ్యాలు పలు చిత్రాలలో చోటుచేసుకున్నాయని సులువుగా గ్రహించవచ్చు. పహల్గాంలో 80 కుగ్రామాలు ఉన్నాయి. మామల్ గ్రామంలో శివాలయం 5వ శతభ్ధంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఇది కాశ్మీరు లోని అతిపురాతన ఆలయమని భావిస్తున్నారు.

అమర్నాథ్ యాత్రసవరించు

అమర్‌నాథ్ యాత్రతో పహల్గాం అనుసంధానితమై ఉంది. పహల్గాం నుండి 16 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 2,895 మీ ఎత్తున ఉన్న చందన్‌వారి నుండి అమర్‌నాథ్ యాత్ర మొదలౌతుంది. చందన్ వాడి వరకు మార్గం చదునుగ ఉంటుంది. అక్కడి వరకు కారులో పయనించవచ్చు. అక్కడి నుండి మార్గం ఏటవాలుగా ఉంటుంది. ఇక్కడి నుండి భక్తులు కాలి మార్గం కానీ పోనీ మీదుగా కానీ ప్రయాణించాలి. ఈ యాత్ర శ్రావణ మాసం (జూలై-ఆగస్ట్) లో ఆరంభమౌతుంది. చందన్ వాడి నుండి 11కి.మీ దూరంలో పర్వతసరోవరం శేషాంగ్ (సముద్రమట్టానికి 3,574 మీ. ఎత్తు) ఉంది. ఇక్కడి నుండి 13 కి.మీ దూరంలో ఉన్న పంచతర్ణి వరకు ప్రయాణించవలసిన అవసరం ఉంది. ఇక్కడి నుండి అమర్నాథ్ ఆలయం 6 కి.మీ దూరంలో ఉంది. శ్రావణ మాసంలో సహజసిద్ధంగా అమర్‌నాథ్ గుహలో రూపుదిద్దుకునే ఈ శివలింగం చంద్రకళలకు అనుగుణంగా పెరుగుతూ తరుగుతూ ఉంటుంది.

అచాబల్సవరించు

అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రస్లలో అచాబల్ ఒకటి. మొగలులు నిర్మించిన అనదమైన తోట నడుమ ఉన్న అందమైన సెలఏరు ఇక్కడి ప్రత్యేకత. ఈ తోటకు చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. తోట పైభాగాన్ని " బాగ్- ఈ - బేగం అబాద్ " అంటారు. ఇది మాలిక్ నూర్ జెహాన్ బేగం చేత 1620 లో అభివృద్ధి చేయబడినదని భావించబడుతుంది.

కోకర్నాగ్సవరించు

కోకర్‌నాగ్ నీటి కాలువలకు మరియు అతి పెద్ద మంచి నీటి మడుగుకు ప్రసిద్ధి. మంచినీటి చేపలు అరుదుగా కనిపించే ప్రదేశాలలో కొలను నిర్మించి చేపలను అభివృద్ధిచేసే " ట్రాట్ హచేరీ డిపార్ట్మెంటు " ఇక్కడ ఉంది. ఇక్కడ వైవిధ్యమైన బరువు మరియు వైవిధ్యమైన వయసు కలిగిన మంచినీటి చేపల కొరకు పలు కొలనులు నిర్మించబడ్డాయి. డిపార్ట్మెంటు రుచికరమైన చేపలను తిచి ఆనందించాలనుకున్న పర్యాటకులకు విక్రయిస్తుంది. అచలాబల్ నుండి కోకర్నాగ్ 8 కి.మీ దూరంలో ఉంది. కోకర్నాగ్ కాలువల మొత్తం పొడవు 300 కి.మీ. ఇందులో 129 కి.మీ పొడవున తోటలు పెంచబడుతున్నాయి. మిలినవి ఆరణ్యాల నడుమ ఉన్నాయి. కూకర్నాగ్ ప్రస్తావన " అయిన్ అక్బరీ "లో ఉంది. కోకర్నాగ్ జలాలు దాహం మరియు ఆకలిని తీర్చగవని అందులో వర్ణించబడింది. ఇవి అజీర్ణానికి మందుగా కూడా ఉపకరిస్తాయని అందులో పేర్కొనబడింది. ఈ రచయిత కోక్ర్నాగ్‌లో టచ్‌స్టోన్ ఉందని పేర్కొన్నాడు.

వెరినాగ్సవరించు

అనంత్‌నాగ్ జిల్లాలోని వెరినాగ్ నీటి మడుగు అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇది పర్వతానికి మొదటి భాగంలో జెహ్లం నది వలన ఏర్పడింది. ఇక్కడ జహంగీర్ ఒక తోట మరియు తాత్కాలిక విడిదిని నిర్మించాడు. ఇది అనంత్‌నాగ్‌కు 16 కి.మీ దూరంలో ఉంది. ఈ మడుగు చుట్టూ పైన్ మరియు సతతహరితారణ్యాలు ఉన్నాయి. తోటల నేపథ్యంలో చక్కగా నిర్మించబడిన ఈ మడుగు ఆకారంకూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

దక్షంసవరించు

అనంత్‌నాగ్-సింతాన్-కిష్త్వర్ రహదారి పక్కన దట్టమైన ఆరణ్యమద్యలో ఈ సుందర ప్రదేశం ఉంది. దక్షం మద్య నుండి ఒక సెలయేరు ప్రవహిస్తుంది. ఇందులో ట్రాట్ ఫిష్ అధికంగా ఉంటాయి. పర్వతాల మద్య ఉన్న అరణ్యప్రాంతం ఇది. సమీపంలో ఉన్న అరణ్యాలలో వృక్షజాలం మరియు జంతుజాలంతో సమృద్ధమై ఉంది. ఈ మనోహర ప్రాంతం అనంత్‌నాగ్ ఆగ్నేయంలో ఉంది. ఇది అనంత్‌నాగ్‌కు 40కి.మీ దూరంలో ఉంఫి.

వాతావరణంసవరించు

అనంత్‌నాగ్ జిల్లాలో భౌగోళికంగా వైవిధ్యం ఉన్న కారణంగా వాతావరణంలో అసమానతలు ఉంటాయి. చదునుగా ఉండే ఉత్తరప్రాంతం కంటే పర్వతప్రాంతమైన తూర్పు ప్రాంతంలో చలి అధికంగా ఉంటుంది. వసంతకాలం మరియు ఆకురాలు కాలం వరకు చలిగా, వేసవిలో స్వల్పమైన చలి, శీతాకాలంలో అత్యధిక చలిగానూ ఉంటుంది.

వేసవిసవరించు

వేసవిలో సాధారణంగా స్వల్పంగా వర్షపు జల్లు కురుస్తుంటుంది. గాలిలో తేమ కారణంగా రాత్రి సమయాలలో చలి అత్యధికంగా ఉంటుంది. సంవత్సమంతా వర్షం కురుస్తున్న కారణంగా పొడి వాతావరణం కలిగిన మాసం ఏదీ లేదు. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన మాసం జూలై. జూలై మాసంలో అత్యధిక ఉష్ణోగ్రత 6 ° సెల్షియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 32 ° సెల్షియస్. శీతాకాలం డిసెంబరు - జనవరి వరకు ఉంటుంది.శీతాకాల అత్యధిక ఉష్ణోగ్రత 15° సెల్షియస్, శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత 0 ° సెల్షియస్.

మంచుతుఫానుసవరించు

సాధారణంగా వాతావరణం ముందుగా నిర్ణయించడానికి వీలు కాదు. ఈప్రాంతంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33° సెల్షియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 18° సెల్షియస్. 2012లో జనవరిలో కోన్ని సంవత్సరాల తరువాత సంభవించిన మంచు తుఫాను కారణంగా నగరంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. తరువాత రెండు రోజులు మొత్తం లోయలో శలవు ప్రకటినబడింది.

వర్షపాతంసవరించు

అనంత్‌నాగ్ జిల్లా ప్రాంతంలో తేమ మరియు సంవత్సర వర్షపాతం కొన్ని సంవత్సరాలుగా క్రమంగా అధికరిస్తూ ఉంది. వాణిజ్యపరంగా ప్రణాళికా బద్ధంగా అధికరిస్తున్న అరణ్యాలు మరియు అధికరిస్తున్న పార్కులు మరియు పచ్చిక బయళ్ళు కారణం కావచ్చు. అనంత్‌నాగ్ నగరప్రాంతం కంటే శివారు ప్రాంతంలో అరణ్యాలు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. కాశ్మీర్ ప్రాంత వాతావరణంలో ఉన్న వైవిధ్యాలన్నీ అనంత్‌నాగ్‌లోనూ ఉన్నాయి.

సర్ వాల్టర్ లారెంస్సవరించు

" కాశ్మీర్ లోయ " ఆసియాలోని పెషావర్, బాగ్ధాద్ మరియు డమాస్కస్‌, మొరాకోలోని ఫెజ్, అమెరికా లోని సౌత్ కరోలినా ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ వాతావరణంలో మాత్రం వేరుపడి ఉంటుంది. మే మాసాం చివరి వరకు కాశ్మీర్ లోయ వాతావరణం స్విడ్జర్‌లాండ్ దేశంలో ఉన్నట్లు ఉంటుంది. జూలై మరియు ఆగస్టు మాసాలలో దక్షిణ ఫ్రెంచ్ దేశం వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ కాశ్మీర్ లోయ వాతావరణం ఏ వాతావరణ వర్గానికి చెందదు. ప్రతి 100 అడుగుల ఎత్తులో సరికొత్త వైవిధ్యాలతో వాతావరణం మరియు వృక్షజాలం నెలకొని ఉంటుంది. [9]

వాతావరణ పట్టికసవరించు

Climate data for Anantnag (1971–1986)
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 7.0 8.2 14.1 20.5 24.5 29.6 30.1 29.6 27.4 22.4 15.1 8.2 19.7
Average low °C (°F) -2.0
(28.4)
-0.7 3.4 7.9 10.8 14.9 18.1 17.5 12.1 5.8 0.9 -1.5 7.3
Precipitation mm (inches) 48 68 121 85 68 39 62 76 28 33 28 54
Avg. precipitation days (≥ 1.0 mm) 6.6 7.3 10.2 8.8 8.1 5.7 7.9 6.8 3.5 2.8 2.8 5.1
Source: HKO[10]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts dated 2008-03-13, accessed 2008-08-30
  3. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Retrieved 2008-08-28. Cite web requires |website= (help)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help); Cite web requires |website= (help)
  6. Chander Bhat's Articles. Ikashmir.net (20 March 1960).
  7. CONVERTED KASHMIR: Memorial of Mistakes. Kashmir-information.com.
  8. KashmirForum.org: May 2010. Kashmirforumorg.blogspot.com.
  9. http://www.indiaonapage.com/India/Jammu-and-Kashmir/Anantnag/general-info.html
  10. "Climatological Information for Srinigar, India". Hong Kong Observatory. Retrieved 2011-05-02. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అనంతనాగ్&oldid=2353020" నుండి వెలికితీశారు