అనన్య బిర్లా (జననం: 1994 జూలై 17) ఒక భారతీయ గాయని, గేయ రచయిత, వ్యాపారవేత్త. ఆమె భారతీయ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థలలో ఒకరు. 2016 లో, బిర్లా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో సంతకం చేసి తన ప్రారంభ సింగిల్ "లివిన్ ది లైఫ్" అను ఆల్బమ్ ను విడుదల చేసారు.[1] ఆమె తొలి పాటతో చార్టుల్లో ప్రథమ స్థానాన్ని పొందిన తర్వాత, ఆమె తన రెండవ సింగిల్ "మీంట్ టు బి"ను విడుదల చేసారు, ఇది డిసెంబరు 2017 లో భారతీయ సంగీత పరిశ్రమ (IMI) చే ప్లాటినం సర్టిఫికేట్ పొందింది. ఆంగ్ల భాషలో ప్లాటినం పొందిన మొట్టమొదటి భారతీయ స్త్రీ.[2]

అనన్య బిర్లా
Ananya Birla.jpg
జననం17 జూలై 1994
పౌరసత్వంభారతీయురాలు
వృత్తిగాయని, గేయ రచయిత, వ్యాపారవేత్త
తల్లిదండ్రులుకుమార్ మంగళం బిర్లా

అనన్య బిర్లా, స్త్రీల కోసం స్వతంత్ర మైక్రో ఫిన్ అనే ఒక సూక్ష్మ ఋణ సంస్థను స్థాపించారు.

బాల్యం , విద్యసవరించు

అనన్య బిర్లా, ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అయిన కుమార్ మంగళం బిర్లా, నీరజ బిర్లాల యొక్క పెద్ద కుమార్తె. ఈమె బిర్లా కుటుంబం యొక్క ఆరవ తరం వారసురాలు. అనన్య బాల్యం నుంచే సంగీతం పట్ల మక్కువ కలిగిన వ్యక్తి. తను 11 సంవత్సరాలు ప్రాయం లోనే సంతూర్ నేర్చుకున్నారు. అనన్య బిర్లా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిక శాస్త్రము, నిర్వహణ శాస్త్రం నుండి పట్టభాద్రులైనారు.

మూలాలుసవరించు

  1. "Ananya Birla is India's newest musician on the block". Vogue India. 11 November 2016. Retrieved 21 August 2018.
  2. "Ananya Birla's 'Meant to be' certified platinum". Yahoo. IANS. 28 November 2017. మూలం నుండి 12 జూన్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 21 August 2018.

బాహ్య లింకులుసవరించు

  1. అనన్య బిర్లా అధికారిక వెబ్ సైట్