అనాకిన్రా, కినెరెట్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రయోపైరిన్-అసోసియేటెడ్ పీరియాడిక్ సిండ్రోమ్స్, ఫ్యామిలీ మెడిటరేనియన్ ఫీవర్, స్టిల్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఆక్సిజన్ థెరపీ అవసరమయ్యే కరోనా-19 ఉన్న వ్యక్తులలో కూడా ఇది ఉపయోగించబడుతుంది.[1] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]

అనాకిన్రా
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
Recombinant human Interleukin-1 receptor antagonist protein; syn. N2-l-methionyl-interleukin 1 receptor antagonist (human isoform x reduced)
Clinical data
వాణిజ్య పేర్లు Kineret
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a602001
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B1 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US) Rx-only (EU)
Routes Subcutaneous
Pharmacokinetic data
Bioavailability 95%
మెటాబాలిజం Predominantly kidney
అర్థ జీవిత కాలం 4-6 hrs
Identifiers
ATC code ?
Chemical data
Formula C759H1186N208O232S10 
 ☒N (what is this?)  (verify)

సాధారణ దుష్ప్రభావాలలో ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, తలనొప్పి, వికారం, కీళ్ల నొప్పులు, జ్వరం ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్ ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2] ఇది ఇంటర్‌లుకిన్ 1 రిసెప్టర్ యాంటీగానిస్ట్ ప్రొటీన్ యొక్క రీకాంబినెంట్ వెర్షన్, ఇది ఇంటర్‌లుకిన్ 1 ప్రభావాలను అడ్డుకుంటుంది.[1][2]

అనకిన్రా 2001లో యునైటెడ్ స్టేట్స్, 2002లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి ఎన్.హెచ్.ఎస్.కి ఒక వారం మందుల ధర సుమారు £180[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 1,250 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Kineret". Archived from the original on 21 July 2021. Retrieved 14 January 2022.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "DailyMed - KINERET- anakinra injection, solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 23 July 2021. Retrieved 14 January 2022.
  3. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1148. ISBN 978-0857114105.
  4. "Kineret Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2021. Retrieved 14 January 2022.