కీళ్ళ వాతము
కీళ్ళ వాతము, దీనినే ఆంగ్లంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RHA) అంటారు. ఇది దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక రుగ్మత (ఆటో ఇమ్మ్యూన్ వ్యాధి). ఇది ప్రధానంగా రోగి శరీరంలోని కీళ్ళను ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా వెచ్చని, వాపు, కీళ్ళ నొప్పికు దారితీస్తుంది. తరచుగా విశ్రాంతి తరువాత నొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం మరింత తీవ్రమవుతాయి. చాలా సాధారణంగా, మణికట్టు దగ్గర, చేతుల కీళ్లు ప్రభావితమవుతాయి. శరీరానికి రెండు వైపులా ఒకే రకమైన కీళ్ళు ఈ లక్షణాలకు గురి అవుతాయి. ఈ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఇది రక్తహీనత, ఊపిరితిత్తుల చుట్టూ వాపు (ఫ్లూరసి), గుండె చుట్టూ వాపుకు దారితీయవచ్చు. ఈ రోగులకు జ్వరంతో, శక్తి లేకుండా కూడా ఉండవచ్చు.[1] ఈ వ్యాధి లక్షణాలు వారాల నుండి నెలల వరకు క్రమంగా ఏర్పడతాయి .[2]
కీళ్ళ వాతము | |
---|---|
కీళ్ల వాతంతో తీవ్రంగా ప్రభావితమైన చెయ్యి. ఈ స్థాయి వాపు, వైకల్యం ప్రస్తుత చికిత్ససాధ్యం | |
ప్రత్యేకత | రుమటాలజీ |
లక్షణాలు | వెచ్చని, వాపు, కీళ్ళ నొప్పి |
సంక్లిష్టతలు | ఈ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఇది రక్తహీనత, ఊపిరితిత్తుల చుట్టూ వాపు (ఫ్లూరసి) , గుండె చుట్టూ వాపు, ఈ రోగులకు జ్వరంతో శక్తి లేకుండా కూడా ఉండవచ్చు |
సాధారణ ప్రారంభం | మధ్య వయస్సు |
కాల వ్యవధి | జీవితాంతం |
కారణాలు | స్పష్టమైన కారణం లేదు |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాల ఆధారంగా, మెడికల్ ఇమేజింగ్, రక్త పరీక్షలు |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | దైహిక లూపస్ ఎరిథెమాటోసస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా |
ఔషధం | నొప్పి మందులు, స్టెరాయిడ్లు, NSAID లు , వ్యాధి లక్షణాలు మార్పు చేసే యాంటీరుమాటిక్ మందులు (హైడ్రాక్సీక్లోరోక్విన్, మెథోట్రెక్సేట్ వంటి DMARD లు) |
తరుచుదనము | పెద్దవారిలో 0.5% నుండి 1% మధ్య |
మరణాలు | 1990లో 28,000 మరణాలు సంభవించగా, 2013లో 38,000 మరణాలు |
రోగ నిర్ధారణ
మార్చుకీళ్ళ వాతమునకు స్పష్టమైన కారణం లేనప్పటికీ, ఇది జన్యు పర్యావరణ కారకాల మిళితమయి ఉంటుందని భావిస్తారు. అంతర్లీన యంత్రాంగం ఏమంటే వ్యక్తి శరీర రోగనిరోధక వ్యవస్థ కీళ్లపై దాడి చేస్తుంది. ఇది కీళ్ల గుళిక (కాప్సూల్) వాపు గట్టిపడటానికి దారితీస్తుంది. ఇది అంతర్లీన ఎముక, మృదులాస్థి (కార్టిలేజ్)ను కూడా ప్రభావితం చేస్తుంది.[1] రోగనిర్ధారణ ఎక్కువగా ఒక వ్యక్తి సంకేతాలు, లక్షణాల ఆధారంగా చేస్తారు.[2] ఎక్స్-రేలు, ప్రయోగశాల పరీక్షలు రోగ నిర్ధారణకు తోడ్పడతాయి. లేదా ఇదే లక్షణాలతో ఉండే ఇతర వ్యాధులను మినహాయించవచ్చు.[1] ఉదాహరణకి ఇదే విధమైన లక్షణాలున్న ఇతర వ్యాధులలో దైహిక లూపస్ ఎరిథెమాటోసస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియాలు ఉన్నాయి.[2]
చికిత్స
మార్చుచికిత్స లక్ష్యం నొప్పిని, వాపును తగ్గించడం, ఒక వ్యక్తి మొత్తం పనితీరును మెరుగుపరచడం.[3] విశ్రాంతి, వ్యాయామం, స్ప్లింట్లు, బ్రేస్ లు వంటి సహాయ పరికరాల వాడకం సహాయకారిగా ఉంటుంది.[1][4][5] నొప్పి మందులు, స్టెరాయిడ్లు, నాన్ స్టెరాయిడల్ నొప్పి నివారించే మందులు (NSAID) నొప్పి నివారణకొరకు వాడుతారు. వ్యాధి లక్షణాలు మార్పు చేసే యాంటీరుమాటిక్ మందులు (హైడ్రాక్సీక్లోరోక్విన్, మెథోట్రెక్సేట్ వంటివి (DMARD - డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ ) వ్యాధి పురోగతిని తగ్గించడానికి వాడుతుంటారు.[1] ఇతర చికిత్సలకు వ్యాధి స్పందించనప్పుడు బయోలాజికల్ DMARD లను ఉపయోగించుతారు.[6] అయితే, అవి ఎక్కువ ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు.[7] కీళ్ళను మరమ్మతు చేయడానికి, భర్తీ చేయడానికి లేదా (ఫ్యూజ్) చేయడానికి శస్త్రచికిత్స కొన్ని సందర్భాల్లో సహాయపడవచ్చు.[1] చాలా ప్రత్యామ్నాయ వైద్య చికిత్సలకు, సరిఅయిన ఆధారాలు లేవు.[8][9]
వ్యాధి ప్రాబల్యం
మార్చు2015 నాటికి కీళ్ళ వాతం (RA) 24.5 మిలియన్ల మందిని ప్రభావితం చేసింది.[10] ఇది అభివృద్ధి చెందిన దేశాలలో పెద్దవారిలో 0.5% నుండి 1% మధ్య ఉంటుంది, ప్రతి సంవత్సరం 100,000 మందికి 5 నుండి 50 మంది కొత్తగా ఈ పరిస్థితికి గురి అవుతున్నారు.[11] ఈ వ్యాధి సాధారణంగా మధ్య వయస్సులో ప్రారంభం అవుతూ ఉంటుంది. పురుషులు కంటే మహిళలు 2.5 రెట్లు ఎక్కువగా ప్రభావితమవుతారు.[1] దీని ఫలితంగా 1990లో 28,000 మరణాలు సంభవించగా, 2013లో 38,000 మరణాలు నమోదయ్యాయి.[12] మొట్టమొదటి సారిగా 1800లో పారిస్ కు చెందిన అగస్టిన్ జాకబ్ లాండ్రె-బ్యూవైస్ (1772-1840) ఈ వ్యాధి ని వివరించాడు.[13]గ్రీకు భాషలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే పదానికి అర్ధం నీటితో ఉన్న మండే కీళ్లు అని చెపుతారు.[14]
మందులు
మార్చుసూచనలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Handout on Health: Rheumatoid Arthritis". National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases. August 2014. Archived from the original on June 30, 2015. Retrieved July 2, 2015.
- ↑ 2.0 2.1 2.2 (November 2007). "Rheumatoid arthritis: diagnosis and management".
- ↑ "Rheumatoid arthritis in adults: management: recommendations: Guidance and guidelines". NICE. December 2015. Archived from the original on 2017-04-16.
- ↑ (2018-12-04). "Effects of exercise and physical activity promotion: meta-analysis informing the 2018 EULAR recommendations for physical activity in people with rheumatoid arthritis, spondyloarthritis and hip/knee osteoarthritis".
- ↑ (January 2016). "Effects of rehabilitation for pain relief in patients with rheumatoid arthritis: a systematic review".
- ↑ (January 2016). "2015 American College of Rheumatology Guideline for the Treatment of Rheumatoid Arthritis".
- ↑ (February 2011). "Adverse effects of biologics: a network meta-analysis and Cochrane overview".
- ↑ (March 2010). "Complementary and alternative medicine use in rheumatoid arthritis: proposed mechanism of action and efficacy of commonly used modalities".
- ↑ "Rheumatoid Arthritis and Complementary Health Approaches". National Center for Complementary and Integrative Health. January 2006. Archived from the original on July 5, 2015. Retrieved July 1, 2015.
- ↑ (October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015".
- ↑ (October 2016). "Rheumatoid arthritis".
- ↑ GBD 2013 Mortality Causes of Death Collaborators (January 2015). "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013".
- ↑ Landré-Beauvais AJ (1800). La goutte asthénique primitive (doctoral thesis). Paris. reproduced in (March 2001). "The first description of rheumatoid arthritis. Unabridged text of the doctoral dissertation presented in 1800".
- ↑ Paget, Stephen A.; Lockshin, Michael D.; Loebl, Suzanne (2002). The Hospital for Special Surgery Rheumatoid Arthritis Handbook Everything You Need to Know. New York: John Wiley & Sons. p. 32. ISBN 9780471223344. Archived from the original on 2017-02-22.